-
దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోంది!ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
-
-
2. లోకంలో 1914 నుండి ఎలాంటి పరిస్థితుల్ని, ప్రజల్ని చూస్తున్నాం?
యేసు శిష్యులు ఆయన్ని ఇలా అడిగారు: “నీ ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి?” (మత్తయి 24:3) దానికి జవాబుగా, పరలోకంలో తాను దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాక జరగబోయే చాలా విషయాల గురించి యేసు చెప్పాడు. వాటిలో కొన్ని ఏంటంటే యుద్ధాలు, ఆహారకొరతలు, భూకంపాలు. (మత్తయి 24:7 చదవండి.) “చివరి రోజుల్లో” ప్రజలు దారుణంగా తయారౌతారని, దానివల్ల జీవితం ‘కష్టంగా’ ఉంటుందని కూడా బైబిలు ముందే చెప్పింది. (2 తిమోతి 3:1-5) ఇలాంటి పరిస్థితుల్ని, ప్రజల్ని ముఖ్యంగా 1914 నుండి చూస్తున్నాం.
3. దేవుని రాజ్య పరిపాలన మొదలైనప్పటి నుండి లోకం ఎందుకు ఇంత దారుణంగా తయారైంది?
దేవుని రాజ్యానికి రాజైన వెంటనే యేసు పరలోకంలో సాతానుతో, చెడ్డదూతలతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోయాడు. “అతను భూమ్మీద పడేయబడ్డాడు, అతని దూతలు కూడా అతనితోపాటు పడేయబడ్డారు” అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 12:9, 10, 12) తన నాశనం దగ్గరపడిందని తెలిసి సాతాను చాలా కోపంతో ఉన్నాడు. అందుకే ఈ భూమ్మీద ఉన్న వాళ్లందరికీ బాధల్ని, కష్టాల్ని తెస్తున్నాడు. లోకం ఇంత దారుణంగా తయారవ్వడానికి కారణం అదే! అయితే, దేవుని రాజ్యం త్వరలోనే ఈ సమస్యలన్నీ తీసేస్తుంది.
-
-
దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోంది!ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
-
-
5. లోకం 1914 నుండి మారిపోయింది
తాను రాజైన తర్వాత లోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయో యేసు ముందే చెప్పాడు. లూకా 21:9-11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
ఈ లేఖనంలో చెప్పిన ఎలాంటి పరిస్థితుల్ని మీరు చూశారు లేదా విన్నారు?
చివరి రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారో అపొస్తలుడైన పౌలు చెప్పాడు. 2 తిమోతి 3:1-5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
ఈ లేఖనంలో చెప్పిన ఎలాంటి ప్రజల్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు?
6. దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోందని మీరు నమ్ముతున్నట్లు చూపించండి
మత్తయి 24:3, 14 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోందని నేడు జరుగుతున్న ఏ ముఖ్యమైన పని చూపిస్తుంది?
మీరు ఆ పనిలో పాల్గొనడానికి ఏం చేయవచ్చు?
దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోంది, అది భూమి మొత్తాన్ని పరిపాలించే రోజు దగ్గర్లోనే ఉంది. హెబ్రీయులు 10:24, 25 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
“ఆ రోజు దగ్గరపడే కొద్దీ” మనలో ప్రతీ ఒక్కరం ఏం చేయాలి?
ఏదైనా విషయం వేరేవాళ్లకు సహాయం చేస్తుందని, వాళ్ల ప్రాణాల్ని కాపాడుతుందని తెలిస్తే, మీరు ఏం చేస్తారు?
-