ప్రవచనము నెరవేరింది
యేసుక్రీస్తును తన శిష్యులు ఆయన రాజ్యాధికారమునకు వచ్చినప్పుడు ఆయన అదృశ్య ప్రత్యక్షతకు సూచన ఏమని అడిగినప్పుడు, యేసు “అక్రమము విస్తరించు”నని ప్రవచించెను. (మత్తయి 24:3, 12) ఈ ప్రవచనము మనదినములలో నెరవేరుతుందా?
నిశ్చయంగా నెరవేరుతుంది! యు. యన్‌చే అక్టోబరు 1991లో ప్రచురించబడిన ది యునైటెడ్ నేషన్స్ అండ్ క్రైమ్ ప్రివెన్ష్‌న్ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “భయంకరమైన నేరము ప్రపంచంలోని అనేక దేశాలకు ఒక కఠిన సమస్యగా పరిణమించింది. ఆయా దేశములలోని నేరము అదుపుతప్పి మరియు అంతర్జాతీయ స్థాయిని మించి పలు దేశాలకు పాకుతుంది. కొన్ని నిర్థిష్ట సంస్థలవలన రూపొందించబడుతున్న నేరము అవధులు దాటి, భయంకరమైన ఫలితాలతో శారీరక హింస, బెదరింపు, ప్రభుత్వాధికారుల అవినీతి వరకు చేరుకుంది. ఉగ్రవాదము వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నది. ప్రజలను దోచుకొనే మాదక ద్రవ్య నల్లవ్యాపారం ప్రపంచవ్యాప్త దుస్సంఘటనగా తయారయ్యింది. నిర్లక్ష్యతతో కూడిన నేరబద్ధమైన పర్యావరణ వినాశనము వర్ణనాతీతమై లోకానికి వ్యతిరేకంగాచేసే నేరంగా ఎంచబడే స్థితికి ఎదిగింది.
అత్యాచారాలు: పందొమ్మిది వందల డెబ్బయిలో 1,00,000 మంది ప్రజల్లో 150 మంది వీటికి గురైతే, 1990లో యీ సంఖ్య 1,00,000 మందిలో 400 మందికి పెరిగింది.
దొంగతనాలు: పందొమ్మిది వందల డెబ్బయిలో 1,00,000 మందికి 1,000 మంది వీటికి గురైతే, 1990లో 1,00,000 మందికి 3,500 మంది వీటికి గురయ్యారు.
బుద్ధిపూర్వక హత్యలు: అభివృద్ధిచెందుతున్న దేశాలలో 1975-1985 మధ్యలో 1 నుండి 2.5కు పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశాలలో అదే సమయంలో 3 కంటె తక్కువ సంఖ్య నుండి 3.5 వరకు పెరిగింది.
మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరము: ఈ పుస్తకము గమనించునట్లు: “పెద్దపెద్ద మాదక ద్రవ్య వ్యాపారాలన్నిటిని కలిపితే చిన్న దేశాల ప్రభుత్వ ఖర్చుకు, వారి ఇంధన ఖర్చుకు మించిపోతుంది. పారిశ్రామిక దేశాల చట్ట ప్రయోగాలకు అవరోధంగా ఇది నిలువగలుగుతుంది.
మొత్తము మీద నేరముల సంఖ్య: పందొమ్మిదివందల ఎనభై ఐదులో 1,00,000 మందికి 4,000గా ఉన్న నేరాల సంఖ్య 2000 సంవత్సరపు అంతానికి దాదాపు 8,000లకు పెరుగుతుంది.
ప్రపంచవ్యాప్తముగా నేరము విస్తరించుట “యుగసమాప్తిని” గూర్చి యేసు చెప్పిన ప్రవచనములో ఒక భాగము మాత్రమే. (మత్తయి 24:3) యేసు ఇలా చెప్పెను: “ఇవి జరుగుట మీరు చూచినప్పుడు, దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.”—లూకా 21:31. (w92 10/15)