కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • “నీ రాకడకు సూచనలేవి?”
    కావలికోట—1994 | ఫిబ్రవరి 15
    • 13. పారిపొమ్మని యేసు యిచ్చిన హెచ్చరికను క్రైస్తవులు ఎందుకు అనుసరించగల్గారు?

      13 రోమన్లు యెరూషలేము నుండి వెనక్కి వెళ్లిపోయారు, గనుక ఎవరైన ఎందుకు పారిపోవాలి? ఎందుకంటే ‘యెరూషలేము నాశనం సమీపమైంది’ అని అనడానికి అక్కడ సంభవించినది రుజువని యేసు పలికిన మాటలు స్పష్టం చేశాయి. (లూకా 21:20) అవును, నాశనము. ‘లోకారంభమునుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడునూ కలుగబోదని’ యేసు ముందే ప్రవచించాడు. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత అంటే సా.శ. 70లో సైన్యాధిపతియైన టైటస్‌ నాయకత్వంలోని రోమా సైన్యాల చేతుల్లో యెరూషలేము నిజంగా “మహాశ్రమ” అనుభవించింది. (మత్తయి 24:21; మార్కు 13:19) కాని, అప్పటివరకు గాని అంతకుముందుగాని సంభవించిన శ్రమలకన్నా యిది గొప్పదని యేసు ఎందుకు వర్ణించాడు?

      14. అంతకు ముందుగానీ దాని తర్వాత గాని సంభవింపనిది సా.శ. 70 నందు జరిగిన “మహాశ్రమ” అని మనం ఎలా చెప్పవచ్చు?

      14 సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును బొత్తిగా పాడుచేశారు, ఆలాగే మన ప్రస్తుత శతాబ్దంలో కూడా భయంకర యుద్ధాల్ని ఆ పట్టణం చవిచూసింది. అయినా సా.శ. 70లో జరిగింది మాత్రం ఎన్నడూ ఎరుగని మహాశ్రమే. రమారమి ఐదు నెలలు సాగిన ఆ యుద్ధదాడిలో టైటస్‌ నాయకత్వంలోని రోమా సైన్యం యూదులను ఓడించి, వారిలో యించుమించు 11,00,000 మందిని హతమార్చి, దాదాపు 1,00,000 మందిని బానిసలుగా తీసుకువెళ్లారు. ఆ పిమ్మట రోమన్లు యెరూషలేమును నిర్మానుష్యం చేశారు. కాబట్టి, దేవాలయమే కేంద్రంగావున్న యూదుల ఆరాధనా విధానాన్ని ఆ వినాశనం అంతమొందించింది. (హెబ్రీయులు 1:2) అవును సా.శ. 70 నాటి సంఘటనలను ‘లోకారంభము నుండి యిప్పటివరకు [ఆ పట్టణం, రాజ్యం, విధానంపై] కలుగ లేదు ఇక ఎప్పుడును కలుగబోని శ్రమగా’ సరిగానే పరిగణించవచ్చును.—మత్తయి 24:21.d

  • “నీ రాకడకు సూచనలేవి?”
    కావలికోట—1994 | ఫిబ్రవరి 15
    • d ఆంగ్ల రచయిత మాథ్యూ హెన్రీ యిలా వ్యాఖ్యానించాడు: “కల్దీయులు యెరూషలేమును నాశనం చేయడం మహా భయంకరంగా ఉండెను, అయితే యిది దానిని మించిపోయింది. ఇది ప్రపంచమందలి యూదులందరూ సంహరించబడతారనే . . . భయాన్ని కల్గించింది.”

  • “నీ రాకడకు సూచనలేవి?”
    కావలికోట—1994 | ఫిబ్రవరి 15
    • [10వ పేజీలోని చిత్రం]

      సా.శ. 70లో సంభవించిన మహాశ్రమ యెరూషలేము, యూదా జనాంగము అంత వరకూ అనుభవించిన వాటిలోకెల్లా అతి భీకరమైంది

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి