కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 2/15 పేజీ 29
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు చర్య తీసుకున్నప్పుడు మీరు తప్పించబడతారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ‘ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పుము’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • “ఇవి ఎప్పుడు జరుగును? . . . మాతో చెప్పుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మహాశ్రమల నుండి సజీవంగా రక్షించబడుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 2/15 పేజీ 29

పాఠకుల ప్రశ్నలు

“శ్రమయొక్క చివరి భాగంలో, యెహోవా వైపున చేరిన ‘శరీరులు’ తప్పించుకుంటారు” అని ఆగస్టు 15, 1996 కావలికోట తెలియజేసింది. మహా శ్రమ యొక్క మొదటి దశ తర్వాత క్రొత్తవారనేకులు దేవుని వైపుకు వస్తారని అది సూచిస్తుందా?

అక్కడ చెప్పబడిన విషయం అదికాదు.

మత్తయి 24:22 నందలి యేసు మాటలు, రానైయున్న మహా శ్రమ యొక్క మొదటి భాగంలో అంటే మతంపై దాడి చేయబడినప్పుడు తప్పించడం ద్వారా భవిష్యత్తులో ప్రాథమిక నెరవేర్పును కలిగివుంటాయి. శీర్షిక ఇలా తెలియజేసింది: “శ్రమ యొక్క మొదటి భాగంలోనే మహాబబులోను త్వరగా మరియు సంపూర్ణంగా నాశనమైనప్పుడు, అభిషిక్త శేషం మరియు “గొప్పసమూహ”మైన ‘శరీరు’లందరూ ఇది వరకే తప్పించుకున్నారని జ్ఞాపకం చేసుకోండి.”

శ్రమ యొక్క చివరి భాగంలో యేసు మరియు ఆయన పరలోక సైన్యం చర్య తీసుకున్నప్పుడు అలాంటి నమ్మకమైనవారు ఏ ప్రమాదానికీ గురికారు. కాని శ్రమ యొక్క ఆ దశను ఎవరు తప్పించుకుంటారు? భూ నిరీక్షణగల ఒక గొప్ప సమూహం తప్పించుకుంటుందని ప్రకటన 7:9, 14 చూపిస్తుంది. ఆత్మాభిషిక్త క్రైస్తవుల విషయమేమిటి? అభిషిక్తుల శేషము పరలోకానికి ఎప్పుడు తీసుకు వెళ్లబడుతుందనే దాని గురించి మనం ఎందుకు నిర్హేతుకంగా ఉండకూడదో ఆగస్టు 15, 1990 కావలికోటలోని (ఆంగ్లం) “పాఠకుల ప్రశ్నలు” నందు చర్చించబడింది. కాబట్టి ఇటీవలి శీర్షిక (ఆగస్టు 15, 1996), “అదేవిధంగా, శ్రమ యొక్క చివరి భాగంలో, యెహోవా వైపున చేరిన ‘శరీరులు’ తప్పించుకుంటారు” అనే సాధారణ వ్యాఖ్యానం చేస్తూ విషయాన్ని అనిర్దిష్టంగా విడిచిపెట్టింది.

మహా శ్రమ ప్రారంభమైన తర్వాత క్రొత్తవారెవరైనా సత్యాన్ని నేర్చుకుని దేవుని వైపున చేరతారా లేదా అనే విషయంలో మత్తయి 24:29-31 నందు వ్రాయబడివున్న యేసు మాటలను గమనించండి. శ్రమ ప్రారంభమైన తర్వాత, మనుష్య కుమారుని సూచన కనిపిస్తుంది. భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ముకొట్టుకుంటారని యేసు చెప్పాడు. ప్రజలు పరిస్థితినిబట్టి జాగ్రత్తపడి, పశ్చాత్తాపపడి, దేవునివైపుకు వచ్చి నిజ శిష్యులౌతారనేదాని గురించి ఆయన ఏమీ చెప్పలేదు.

అలాగే, మేకలు గొర్రెలను గూర్చిన ఉపమానంలో, మనుష్యకుమారుడు ప్రత్యక్షమై, గతంలో ప్రజలు ఏమి చేశారు ఏమి చేయలేదు అనేదాని ఆధారంగా వారిని న్యాయబద్ధంగా వేరు చేస్తాడు. ఎంతో కాలంగా మేకవంటి లక్షణాలను కనబర్చి హఠాత్తుగా మారిపోయి గొర్రెలవలె తయారయ్యే ప్రజల గురించి యేసు ఏమీ చెప్పలేదు. ప్రజలు అప్పటికే ఏమై ఉన్నారని నిరూపించబడతారో దాని ఆధారంగా తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు.—మత్తయి 25:31-46.

అయితే, ఇక్కడ, ఈ విషయం గురించి నిర్హేతుకంగా ఉండకూడదు. దేవుని ప్రజలకు అంటే అభిషిక్తులకు మరియు గొప్ప సమూహానికి చెందిన వారికి ఇప్పుడు తామేమి చేయాలో తెలుసు అంటే ప్రకటించి శిష్యులను చేయాలని తెలుసు. (మత్తయి 28:19, 20; మార్కు 13:10) మనం ఈ ఉపదేశాన్ని హృదయానికి తీసుకోవడానికి సమయమిదే: “కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.—అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.”—2 కొరింథీయులు 6:1, 2.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి