కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 2/1 పేజీలు 4-6
  • సూచన నీవు దానిని లక్ష్యపెట్టుచున్నావా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సూచన నీవు దానిని లక్ష్యపెట్టుచున్నావా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆ సూచన మనకు ఎందుకు అవసరం
  • సహనమును కోల్పోకుండా కాపాడుకొనుట
  • “పరిహాసకులు”
  • “ప్రేమచల్లారును”
  • “ఐహిక విచారములు”
  • “కొనిపోబడుటా” లేక “విడిచి పెట్టబడుటా”
  • ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనల గురించి యేసు ప్రవచించాడు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • యేసు ప్రత్యక్షతా సూచనను మీరు గుర్తిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • అర్మగిద్దోను దగ్గరపడిందని ఎలా చెప్పవచ్చు?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • అపొస్తలులు యేసును ఒక సూచన అడిగారు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 2/1 పేజీలు 4-6

సూచన నీవు దానిని లక్ష్యపెట్టుచున్నావా?

“ప్రతిదేశమందలి ప్రజలు సాఫల్యం, సంక్షేమం, మరియు సంతోషములనుభవింపవలెనని మేము ఆశించుచున్నాము. దీనికి గల మార్గము పరమాణురహిత, అహింసాయుత ప్రపంచమువైపు కొనసాగుటయందు గలదు.”—పెరిస్త్రొయికా, సోవియట్‌ నాయకుడు మిఖాయెల్‌ గోర్బచెవ్‌

మానవుడు అటువంటి ప్రపంచపరిస్థితులను ఉత్పన్నము చేయుటలో నిజంగా సమర్ధవంతుడా అని అనేకులు సందేహిస్తారు. వేరొక నాయకుడగు యేసుక్రీస్తు—అంతకన్న గొప్పదైన మరణవిధానమును కూడా తలక్రిందులను చేయు భూపరదైసు గూర్చి వాగ్ధానము చేసెను. (మత్తయి 5:5; లూకా 23:43; యోహాను 5:28, 29.) అయితే దీనిని చేయగల మార్గము దైవిక చొరవయే. “ఎప్పుడు” అటువంటి చొరవ తీసుకొనబడును అను ప్రశ్నకు సమాధానమిస్తూ యేసు: “దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు” అని చెప్పెను. ముందుగా, సూచనార్ధకమైన పక్షిరాజు కన్నులను కల్గి సునిశిత పరిశీలనా దృష్టికల్గియున్నవారు మాత్రమే గ్రహించగలరు. (లూకా 17:20, 37)

ఆ సూచన మనకు ఎందుకు అవసరం

పరలోకమునకు ఆరోహణమైనప్పటినుండి, యేసుక్రీస్తు, “సమీపింపరాని తేజస్సులో వసించుచు, మనుష్యులలో ఎవడును చూచి యుండని, చూడనేరని స్థితిలోయున్నాడు.” (1 తిమోతి 6:16) కనుక అక్షరార్ధ మానవ నేత్రములు ఆయనను ఇక ఎన్నడును చూడలేవు. యేసు తన భూసంబంధ జీవితముయొక్క చివరిదినమున చెప్పినట్లు: “కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడు చూడదు.” (యోహాను 14:18) కేవలము సూచనార్ధకముగానే ఆయనను చూడదగును.—ఎఫెసి 1:18; ప్రకటన 1:7.

అయినను దేవునిరాజ్యము పాలించుట ఎప్పుడు ప్రారంభించునో తనశిష్యులకు గ్రహించ సాధ్యమగునని యేసు చెప్పెను. ఎలా? ఒక సూచన ద్వారానే. “నీ రాకడకు సూచనలేవి?” అను ప్రశ్నకుత్తరమిచ్చుచు, తన భవిష్యత్‌ అదృశ్యపాలనకు గల దృశ్యమైన నిదర్శనములను యేసు వివరించెను.—మత్తయి 24:3.

ఎటువంటి ప్రజలు దానినుండి ప్రయోజనము పొందగలరో తెల్పు ఒక ఉపమానము ఆ సూచనయందే యిమిడియున్నది. “పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును” అని యేసు చెప్పెను. (మత్తయి 24:28) ప్రస్తుత విధానాంతమునందు, దేవుని నూతన విధానములోనికి తప్పింప బడగోరువారందరూ, క్రీస్తుయొక్క గద్దనుపోలిన “ఏర్పరచబడిన వారితో” పాటు ఆత్మీయాహారమును అనుభవించుటకు ‘సమకూడ వలసియున్నది’.—మత్తయి 24:31, 45-47.

సహనమును కోల్పోకుండా కాపాడుకొనుట

ప్రస్తుత దుష్టవిధానాంతము కొరకు ఒక నిర్ణీత సమయమును ఏ మానవుడు నిర్ణయింపలేడు. “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రితప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరని” యేసు చెప్పెను.—మార్కు 13:32, 33.

అయితే ఆ సూచన అనేకతరముల కాలనిడివిలో సంభవింపవలసియుండెనా? లేదు. ఒక ప్రత్యేకతరములోనే ఆ సూచన సంభవింపవలెను. ఆ సూచన యొక్క ప్రారంభమును చూచినతరమే “లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు సంభవించని మహాశ్రమలు” తారాపథ స్థాయికి చేరుకొనుటను కూడా చూడగలరు. దీనిని గూర్చి యేసు యిచ్చిన అభయాన్ని మత్తయి, మార్కు, లూకా అనే ముగ్గురు చరిత్రకారులు వ్రాసారు.—మార్కు 13:19, 30; మత్తయి 24:13, 21, 22, 34; లూకా 21:28, 32.

ఏమైనప్పటికి సహనాన్ని కోల్పోయే ప్రమాదమున్నది. 1914లో మొదటి ప్రపంచయుద్ధము సంభవించి 75 సంవత్సరములు గతించిపోయినవి. మానవుల దృష్టిలో ఇది చాలా దీర్ఘకాలముగా కనిపించవచ్చును. కాని మొదటి ప్రపంచయుద్ధమును చూచిన సునిశిత దృష్టిగల క్రైస్తవులు కొందరు ఇంకా జీవించియున్నారు, వారి తరము గతింపలేదు.

ఆ సూచనను తెల్పినప్పుడు, సహనమును కోల్పోయే ప్రమాదమును గూర్చి యేసు హెచ్చరించెను. “నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు” అని తమ మనస్సులో అనుకొను కొందరినిగూర్చి యేసు మాట్లాడెను. అటువంటి తలంపులను పరిశీలించుకొనకపోతే, అవివేక చర్యలవైపుకు నడుపునని యేసు తెల్పెను. (మత్తయి 24:48-51) దీనినిగూర్చి క్రీస్తు అపొస్తలులు ఇంకనూ, చెప్పగలరు.

“పరిహాసకులు”

బైబిలు రచయిత యూదా వ్రాసిన ప్రకారం క్రీస్తు అపొస్తలులకు ఈ క్రింది హెచ్చరిక యివ్వబడెను: “అంత్యకాలమునందు తమ భక్తిహీన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురు.”—యూదా 17, 18.

శుభ్రపరచబడిన నూతన లోకమునందు జీవితము కొరకు గల కోరిక “భక్తిహీనమైన దురాశల” వలన సులభంగా తొలగింపబడును. భావాలను వ్యక్తపరచుట, సంభాషించుటలో, లోకము అనుసరిస్తున్న పద్ధతుల దృష్ట్యా నేడు అది చాలా ప్రమాదకరంగా ఉన్నది. మానవచరిత్రలో మునుపెన్నడు లేనంతగా దౌర్జన్యము, అభిచారము, లైంగికదుర్నీతి, విస్తృతంగా పెరిగినది. అవి తరచు రేడియో, మరియు సంగీత కార్యక్రమములోల ముంఖ్యాంశములైనవి, మరియు అవి అనేక టి.వి కార్యక్రమములలో, వీడియో, వ్యాపారప్రకటనలతో, పుస్తకములలో మరియు పత్రికలలో ప్రధానాంశములైనవి.

అటువంటి భక్తిహీనతయొక్క అంతాన్ని ఆ సూచనచూపుచున్నది. సాధారణంగా భక్తిహీన విషయాలపై అత్యాసక్తిగల్గినవారు ఆ సూచనను పరిహసింతురు. ప్రవచించబడినరీతిగానే, “సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టె నిలిచి యున్నదే” అని వారు వాదింతురు.—2 పేతురు 3:3, 4.

“ప్రేమచల్లారును”

ఇటీవల న్యూస్‌వీక్‌ అను పత్రికద్వారా 75సం.ల అమెరికా దేశ రచయిత పాల్‌ బౌలిస్‌ పరిచయము చేయబడెను. “ప్రపంచాన్ని గూర్చి మీ దృక్పథమేమి?” అను ప్రశ్నకు సమాధానమిస్తూ, బౌలిస్‌ యిట్లనెను.: “నైతిక విషయాలలో లోకము తునాతునకలై పోయింది. 60సం.ల క్రితము నిజాయితీగా ఉన్నరీతిగా ఈనాడు ఎవ్వరు నిజాయితీగా లేరు. సభ్యమానవుడు అనే భావన ఉండేది; అది మన పశ్చిమ దేశసంస్కృతికి సంబంధించి అమూల్యమైనది. ఇప్పుడు ఎవ్వరు లక్ష్యపెట్టుటలేదు. ధనముపై ఎక్కువ శ్రద్ధచూపబడుచున్నది.”

బైబిలు ముందుగా తెల్పినట్లే, ఈ పరిస్థితులున్నవి. యేసు యిలా ప్రవచించెను: “అక్రమము విస్తరించుటవలన అనేకుల ప్రేమ చల్లారును.” (మత్తయి 24:12; 2 తిమోతి 3:1-5) స్వార్థము, దురాశ, వృద్ధియైనప్పుడు, దేవునియెడల ప్రేమ తరిగిపోవును. నేరములు, ఉగ్రవాదము, అవినీతితోకూడిన వ్యాపార వ్యవహారములు, లైంగిక అవినీతి, మాదక ద్రవ్యముల దుర్వినియోగములలో అత్యధిక ప్రజలు మునిగియుండుటవలన దేవునిశాసనముల కంటె తమ స్వంత కోరికలను ముందుంచుచున్నారని తేటపడుచున్నది.

కొందరు సూచనయొక్క నెరవేర్పును గమనించియు, తమ్మును తాము ప్రీతిపర్చుకొనుటలో మునిగిపోయినందువలన దానివిషయములో పని చేయలేకపోవు చున్నారు. సూచనను లక్ష్యపెట్టుట అనగా దేవునియెడల, పొరుగువానియెడల నిస్వార్ధమైన ప్రేమను చూపుటయైయున్నది.—మత్తయి 24:13, 14.

“ఐహిక విచారములు”

స్వార్థపరమైన సుఖభోగములేకాక, అవసరమగు భౌతిక అవసరతలే కొందరిని ఆ సూచనను నిర్లక్ష్యపెట్టునట్లు ముంచి వేయునని కూడా యేసు హెచ్చరించెను. ఆయన యిలా వేడుకొనెను: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను, మత్తువలనను, ఐహికవిచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.”—లూకా 21:34, 35.

నిజమే, సంతోషభరితమైన కుటుంబజీవితాన్ని బైబిలు ప్రోత్సహిస్తున్నది. (ఎఫెసి 5:24–6:4) అందుకు కుటుంబయజమాని తన భార్య, పిల్లల అవసరతలను తీర్చుటకు ఏదొక ఉద్యోగమునో లేక వ్యాపారమునో చేయవలసి యుండును. (1 తిమోతి 5:8) అయితే ఒకడు తన జీవితాన్ని పూర్తిగా కుటుంబము, వ్యాపారము, వస్తుసంపదల చుట్టు తిరుగనిచ్చుచున్నయెడల అది ముందుచూపు లేనిదైయుండును. అట్టి ప్రమాదమును గూర్చియే యేసు హెచ్చరించెను: “నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచునుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను. . .ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.”—లూకా 17:26-30; మత్తయి 24:36-39.

“కొనిపోబడుటా” లేక “విడిచి పెట్టబడుటా”

ఆ గడియ ఆలస్యమాయెను. త్వరలో సంగతులను సరిదిద్దు టకు దేవునిరాజ్యము జోక్యము చేసికొనును. అప్పుడు ప్రతి మానవుడు రెండింటితో ఏదొక పద్ధతికి ప్రభావితుడగును. యేసు వివరించియున్నట్లు: “ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును. ఒకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొనిపోబడును. ఒకతె విడిచి పెట్టబడును.—మత్తయి 24:40, 41.

ఆ క్లిష్టసమయమాసన్నమైనప్పుడు, నీ స్థితి ఏమైయుంటుంది? నాశనమునకు విడువబడుదువా లేక రక్షించబడుటకు కొనిపోబడుదువా? సరియైన మార్గమందు నీవు నడిపించబడుటకు యేసు చెప్పిన ఉపమానమును మరొకసారి గమనించుము: “పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును.”—లూకా 17:34-37; మత్తయి 24:28.

ఆవిధంగా, దూరదృష్టి, సమైక్య కృషిలయొక్క అవసరతను యేసు నొక్కిచెప్పుచుండెను. రక్షింపబడుటకు కొనిపోబడు వారెవరనగా, దేవుడనుగ్రహించు ఆత్మీయాహారమునుండి ప్రయోజనము పొందుటకు క్రమముగా సమకూడువారు. అట్టి ఆత్మీయాహారమును 60,192 కంటె ఎక్కువగా ఉన్న యెహోవా సాక్షుల సంఘములలో ఒక దానితో సన్నిహిత సహవాసము ద్వారాను, నీవు చదువుచున్న ఈ పత్రిక వంటి బైబిలు ఆధారమైన ప్రచురణలను చదువుట ద్వారా లక్షలాది మంది ప్రజలు అనుభవించిరి.

“ఈ రాజ్యసువార్తను” తమ పొరుగువారితో పంచుకొనుటద్వారా 37,87,188 మందిపైగా నున్న యెహోవాసాక్షులు ఆ సూచనయందు తమకు గల విశ్వాసమును ప్రదర్శించుచున్నారు. (మత్తయి 24:14) ఆ సువార్తకు నీవు అనుకూలంగా ప్రతిస్పందించుచున్నావా? అట్లయిన, భూపరదైసు లోనికి రక్షింపబడుదువను వాగ్దానమును నీ హృదయములోనికి తీసికొనగలవు. (w88 10/15)

[5వ పేజీలోని చిత్రాలు]

సూచనను నిర్లక్ష్యపెట్టునట్లు అనేకులు విలాసము లందు బహుగా నిమగ్నులైరి

[6వ పేజీలోని చిత్రాలు]

సూచనను లక్ష్యపెట్టుటలో దేవుని వాక్య ఉపదేశమునకు సమకూడుట యిమిడి యున్నది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి