కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ‘ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పుము’
    కావలికోట—2013 | జూలై 15
    • 16. యేసు రావడం గురించి ఏ ఇతర లేఖనాల్లో ఉంది?

      16 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని గురించి యేసు ఇలా చెప్పాడు: “యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.”కన్యకల గురించిన ఉపమానంలో యేసు ఇలా అన్నాడు: “వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను.”తలాంతుల గురించిన ఉపమానంలో యేసు ఇలా చెప్పాడు: ‘బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చెను.’అదే ఉపమానంలో యజమానుడు ఇలా అన్నాడు: “నేను వచ్చి . . . నా సొమ్ము తీసికొనియుందునే.” (మత్త. 24:46;25:10, 19, 27) యేసు రావడం గురించి చెబుతున్న ఈ నాలుగు సందర్భాల నెరవేర్పు కాలం ఎప్పుడు?

      17. మత్తయి 24:46లో యేసు రావడం గురించిన ప్రస్తావనకు సంబంధించి మన ప్రచురణల్లో ఇదివరకు ఏమి తెలియజేశాం?

      17 ముందటి పేరాలో మనం మాట్లాడుకున్న చివరి నాలుగు ప్రస్తావనలు, యేసు 1918లో రావడానికి సంబంధించినవని మన ప్రచురణల్లో ఇదివరకు తెలియజేశాం. ఉదాహరణకు, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ గురించి యేసు చెప్పిన మాటలను పరిశీలిద్దాం. (మత్తయి 24:45-47 చదవండి.) 46వ వచనంలో ఉన్న ప్రస్తావన 1918లో అభిషిక్తుల ఆధ్యాత్మిక పరిస్థితిని తనిఖీ చేసేందుకు యేసు వచ్చినప్పుడు నెరవేరిందని, 1919లో యజమానియైన యేసు తన దాసుణ్ణి యావదాస్తిమీద నియమించాడని గతంలో అనుకున్నాం. (మలా. 3:1) అయితే, యేసు చెప్పిన ప్రవచనాన్ని మరింత పరిశీలించాక, అందులోని కొన్ని అంశాల నెరవేర్పు కాలానికి సంబంధించిన మన అవగాహనను సవరించుకోవాల్సిన అవసరం ఉందని అర్థమైంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు?

      18. యేసు చెప్పిన ప్రవచనంలోని విషయాల్ని మొత్తం కలిపి చూస్తే, ఆయన రావడానికి సంబంధించి ఏ విషయం స్పష్టమౌతోంది?

      18 మత్తయి 24:46కు ముందున్న వచనాల్లో, “వచ్చును” అనే పదం, మహాశ్రమల కాలంలో తీర్పు ప్రకటన వెలువర్చడానికి, తీర్పును అమలుపర్చడానికి యేసు వచ్చే సమయాన్నే సూచిస్తుంది. (మత్త. 24:30, 42, 44) అంతేకాక, మనం 12వ పేరాలో చూసినట్లుగా, యేసు రావడం గురించి మత్తయి 25:31లో ఉన్న ప్రస్తావన కూడా భవిష్యత్తులో రానున్న ఆ తీర్పుకాలానికి సంబంధించినదే. కాబట్టి, నమ్మకమైన దాసుణ్ణి యావదాస్తిమీద నియమించడానికి యేసు రావడం గురించి మత్తయి 24:46, 47 వచనాల్లో ఉన్న ప్రస్తావన కూడా భవిష్యత్తులో రానున్న మహాశ్రమల కాలానికి సంబంధించినదే అన్న నిర్ధారణకు మనం రావడం సబబే.నిజానికి, యేసు చెప్పిన ప్రవచనంలోని విషయాల్ని మొత్తం కలిపి చూస్తే, యేసు రావడం గురించిన ఎనిమిది ప్రస్తావనల్లో ప్రతీది, భవిష్యత్తులో రానున్న మహాశ్రమలప్పుడు ఉండే తీర్పుకాలానికి సంబంధించినదేనని స్పష్టమౌతోంది.

  • ‘ఇవి ఎప్పుడు జరుగును? మాతో చెప్పుము’
    కావలికోట—2013 | జూలై 15
తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి