క్రీస్తు ప్రత్యక్షత సమయంలో విస్తరించిన కార్యకలాపాలు
“అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి—నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.”—మత్తయి 25:34.
1. క్రీస్తు పరోసియా ఎట్లు “నోవహు దినములలో వలె” ఉంటుంది?
క్రీస్తు ప్రత్యక్షత—దీర్ఘకాలంగా వేచియున్న సంఘటనే! యేసుక్రీస్తు “యుగసమాప్తికి” సంబంధించి మాట్లాడిన “నోవహు దినము” వంటి సమయం 1914 వ సంవత్సరంలో వచ్చింది. (మత్తయి 24:3, 37) “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని” అభిషక్త శేషమునకు క్రీస్తు ప్రత్యక్షత లేదా పరోసియా, ఏ భావాన్నిస్తుంది? (మత్తయి 24:45) వారు అతిచురుకైన వెలుగు ప్రకాశకులుగా అభివృద్ధినొందవలసినారనే భావాన్నిస్తుంది! అద్భుత విషయాలు జరుగవలసియుండెను! అపూర్వమైన సమకూర్చే పని ప్రారంభించబడవలసియుండెను.
2. మలాకీ 3:1-5 నెరవేర్పు ప్రకారం ఏవిధమైన నిర్మలపరిచే పని జరిగింది?
2 అయినప్పటికి, మొదట ఈ అభిషక్త క్రైస్తవులు నిర్మలం చేయబడాలి. మలాకీ 3:1-5 లో ప్రవచింపబడినట్లు యెహోవా దేవుడు, ఆయన “నిబంధన దూతయైన” యేసుక్రీస్తు 1918 వసంతకాలములో ఆత్మీయాలయాన్ని తనిఖీ చేయుటకు వచ్చారు. “దేవుని ఇంటియొద్దనే” తీర్పు ఆరంభం కావలసియుంది. (1 పేతురు 4:17) “వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన [యెహోవా] వారిని నిర్మలులను చేయును” అని మలాకీ 3:3 లో ప్రవచింపబడింది. శోధించి, నిర్మలము చేయుటకు అది సమయమైయుంది.
3. ఆత్మీయ నిర్మలత జరుగుట ఎందుకు ప్రాముఖ్యమైయుండెను?
3 పందొమ్మిది వందల పద్దెనిమిదిలో ముగిసిన యీ తీర్పునుదాటి, దాసుని తరగతికి చెందిన శేషం లౌకిక, మతపరమైన భ్రష్టత్వంనుండి నిర్మలులుగా చేయబడ్డారు. యెహోవా వారినెందుకు నిర్మలపర్చెను? ఎందుకంటే ఆయన ఆత్మీయ ఆలయం ఇందులో యిమిడివుంది. కాబట్టి యిది యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తార్థబలిపై ఆధారపడి యెహోవాను ఆరాధించుటకు చేసిన ఆలయంవంటి ఏర్పాటైయున్నది. యెహోవా తన ఆలయం పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడు, తద్వారా భూమిపై నివసించే నిరీక్షణతోనున్న ఆరాధికులు ఎక్కువ సంఖ్యలో దానిలోనికి తేబడినపుడు దేవుని నీతి సూత్రాలకు లోబడి, దైవ నామము మహిమపర్చబడుచూ, ఆయన సార్వభౌమాధిపత్యాన్ని గౌరవిస్తున్న స్థలాన్ని వారు గుర్తిస్తారు. ఆ విధంగా, వారు యెహోవాను కొనియాడుచు, ఆయన గొప్ప సంకల్పాలను తెలియపర్చుటలో సహకరిస్తారు.
అధిక ఆధిక్యతలు
4, 5. (ఎ) యేసు వేసిన ప్రశ్న ఈనాటి దాసునితరగతిలోని ప్రతివానికి ఏవిధంగా సవాలైయుంది? (బి) “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడు” మరియు “తన యింటివారు” అనే పదాలను యేవిధంగా అర్థంచేసుకోవాలి? (సి) యేసు దాసునికి ఎటువంటి ఆజ్ఞనిచ్చాడు?
4 పందొమ్మిదివందల పందొమ్మిదిలో నిర్మలము చేయబడిన దాసుని తరగతి, ఎల్లప్పుడూ విస్తరించే కార్యకలాపాలకొరకు నిరీక్షించగల్గారు. వారి యజమానుడైన యేసుక్రీస్తు 1914 లో పరలోక రాజ్యాధికారాన్ని పొందాడు. తన “యింటివారిని” అందరిని తనిఖీ చేయుటకు యింటిబాధ్యతలుగలవారి నొద్దకు తిరిగివచ్చినపుడు, ఆయన ఈ భూమ్మీదనున్నప్పుడు తనకులేని రాజవైభవంతో వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఏం గమనించాడు? యజమానుని పనిలో ఈ దాసుని తరగతి పనిరద్దీ కల్గియుండిరా? మత్తయి 24:45-47 లో వ్రాయబడినట్లుగా, ప్రతి అభిషక్త శిష్యునికి యెహోవాయొక్క మెస్సీయ యెడలగల తమ వ్యక్తిగత భక్తిని పరీక్షించుకొనుటకు అవసరమైన ఒక ప్రశ్నను యేసు అడిగాడు: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వానినుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
5 నిశ్చయంగా, నమ్మకమైన దాసుని గూర్చి యేసు చేసిన వర్ణన ఏ ఒక్కమానవునికి సరిపోదు. కాని ఇది ఒక క్రీస్తుయొక్క నమ్మకమైన అభిషక్త సంఘాలనన్నింటిని కలిపి ఒకగుంపుగా వర్ణిస్తుంది. వ్యక్తిగతంగా క్రీస్తు అభిషక్త అనుచరులే ఈ యింటివారు. ఈ అభిషక్తులను తన స్వరక్తమిచ్చి కొంటాడని యేసుకు తెలుసు, అందుచేతనే, వారిని ఏకముగా తనకు దాసులని యుక్తంగా సూచించాడు. వారిని గూర్చి 1 కొరింథీయులు 7:23 యిలా చెప్తుంది: “మీరు [ఏకముగా మాట్లాడుచు] విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.” యేసు క్రీస్తు తన దాసుని తరగతికి ఆకర్షించేలా వెలుగును ప్రకాశింపజేయుమని, ఇతర శిష్యులను తయారుచేయుమని, తన యింటివారికి తగిన వేళ ఆత్మీయాహారమును అందజేయుచూ క్రమక్రమంగా పోషించుమని ఆజ్ఞాపించాడు.
6. యేసు తనిఖీచేసిన ఫలితంగా దాసుడు ఎలా బహుమానం పొందాడు?
6 క్రీస్తు ప్రత్యక్షత ఆరంభమయిననాటినుండి 1918 వరకు, దాసుని తరగతి జనాదరణలేకపోయిననూ, హింసలు, కొంత గందరగోళ పరిస్థితినెదుర్కొన్నప్పటికీ, యింటివారికి తగినవేళ ఆహారం పెట్టుటకు కృషిచేస్తూనేవుండెను. తనిఖీ ప్రారంభమైనప్పుడు దాసుడు యిలా చేయడాన్ని యజమానుడు గమనించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆనందించాడు, మరి 1919 లో ఆయన, నమ్మకమైనదాసుని తరగతిని ధన్యులని ప్రకటించాడు. దాసుడు తన యజమానుడు తనకు నియమించిన పనిని చేయుటవలన పొందిన సంతోషకరమైన బహుమానమేమిటి? మరిన్ని బాధ్యతలే! అవును, తన యజమానుని ఆస్థిని వృద్ధి చేయుటకు ఎక్కువ బాధ్యతలు ఇవ్వబడ్డాయి. అయితే, తన యజమానుడు ఇప్పుడు పరలోకములో రాజైనప్పటినుండి, మరెందుకు ఈ భూసంబంధమైన ఆస్తులు మరిఎక్కువ అమూల్యమైయుండెను.
7, 8. (ఎ)యజమానుని ‘ఆస్తులన్నియు’ ఏమిటి? (బి) ఈ ఆస్తులన్నిటిమీద యాజమాన్యం వహించుటకు దాసుడు ఏమి చేయవలసియున్నది?
7 మరి, “అతని ఆస్తులన్నియు” ఏమైయున్నవి? భూమిపైనున్న యీ ఆత్మీయ ఆస్తులన్నియు, పరలోకరాజుగా క్రీస్తుఅధికారంతో ముడిపడియున్న తన సొత్తైయున్నవి. లోకరాజ్యాలన్నిటికి దేవుడు స్థాపించిన రాజ్యానికి ప్రతినిధులుగా వ్యవహరించే గొప్ప ఆధిక్యతతో పాటు క్రీస్తుకు శిష్యులను తయారుచేసే ఆజ్ఞ దీనియందు ఖచ్చితంగా యిమిడియుంది.
8 యజమానుని ఆస్తియంతటి మీద పైవిచారణ చేసే మరింత బాధ్యత మూలంగా దాసుని తరగతి రాజ్యసేవను చేయుటకును, అవును ఆ సేవనిమిత్తం మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేయుటకు ఎక్కువ సమయాన్ని ధ్యానాన్ని ఇవ్వవలసి వచ్చింది. సేవచేయుటకు ఆ తరగతికిప్పుడు విస్తారమైన ప్రాంతం అంటే ప్రపంచమంతా ఉన్నది.
గొర్రెలను సమకూర్చుట
9. దాసునికి విస్తరించిన కార్యకలాపాలనుండి వచ్చిన ఫలితమేమి?
9 అందుకే, క్రీస్తుయొక్క నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని తరగతి దాని కార్యకలాపాలను విధేయతతో విస్తరింపచేసింది. దీని ఫలితమేమైయుంది? లక్షానలువది నాలుగు వేలమంది అభిషక్తులలో కడపటివారు సమకూర్చబడ్డారు. తరువాత ప్రకటన 7:9-17 లో లిఖించబడిన యోహాను దర్శనము ఒక పులకరించే, హృదయాన్ని ఉత్తేజపరిచే నిజత్వమైంది. ముఖ్యంగా 1935 నుండి దాసుని తరగతివారు నిశ్చలంగా విశదపరచిన ఈ దర్శన నెరవేర్పునుగూర్చి సాక్ష్యమిచ్చుటలో ఆనందించారు. ప్రపంచమంతటనున్న “గొప్పసమూహమునకు” చెందిన లక్షలాదిమంది ఈనాడు దేవుని ఆత్మీయ ఆలయపు సరిహద్దులకు ఆయన ఆరాధికులుగా వస్తున్నారు. ఈ గొప్పసమూహాన్ని ఏమానవుడు లెక్కించలేడని యెహోవా దేవుని దూత యోహానుతో చెప్పాడు. యెహోవా ఆత్మీయ ఆలయములోనికి దాసుని తరగతివారు తీసుకురావలసియున్న చాలా మంది ప్రజలకు ఒక సరిహద్దంటూ లేదని దీని అర్థము. మార్గము తెరిచియున్నంత వరకు, వారిని సమకూర్చే ఈ పని కొనసాగుతూనే ఉంటుంది.
10. ఈనాడు దాసుడు ఏ ప్రేమపూర్వకమైన కార్యకలాపంలో నిమగ్నమైయున్నాడు?
10 అన్ని రాష్ట్రాలనుండి వచ్చిన ఈ గొర్రెలాంటివారు యజమానుడైన, యేసుక్రీస్తునకు ప్రియమైనవారని, తెలుసుగనుకనే, ఎడతెగక అభివృద్ధినొందుచున్న ఈ “వేరే గొర్రెల” విషయంలో శ్రద్ధవహించే గంభీరబాధ్యత యీనమ్మకమైన తరగతికి ఉన్నది. వాస్తవానికి వారు ఆయన మందయైయున్నారు. (యోహాను 10:16; అపొస్తలుల కార్యములు 20:28; 1 పేతురు 5:2-4) అందుచేత యజమానునియెడల, గొర్రెలయెడలనున్న ప్రేమను బట్టి, గొప్ప సమూహము యొక్క ఆత్మీయావసరతలను తీర్చుటకు దాసుని తరగతి సంతోషముగా శ్రద్దవహిస్తున్నది.
11-13. వాచ్‌టవర్ సొసైటీ అప్పటి అధ్యక్షుడు దాసుని కార్యకలాపమును గూర్చి ఎటువంటి యుక్తమైన వ్యాఖ్యానం చేశాడు?
11 దాసుని పనియైన వెలుగు ప్రకాశింపజేసే పనిలో గొప్పభాగం దేవుని రాజ్యపు భూసంబంధ పౌరులను ప్రోగుచేయుటకూడా యిమిడివుంది. నిత్యమూ విస్తరించుచున్న నమ్మకమైన దాసుల కార్యకలాపాలను గూర్చి చర్చిస్తూ, అప్పటి వాచ్‌టవర్ సొసైటీ అధ్యక్షుడైన ఎఫ్. డబ్ల్యు. ఫ్రాంజ్, 1992 డిశంబరులో తాను చనిపోక ముందు యీవిధంగా తెల్పాడు:
12 “నా 99 సంవత్సరాల జీవితానుభవమునుబట్టి, అన్ని సమయాలలోను యేసుక్రీస్తు, సంస్థను ఎంతో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఈ సంస్థను నడిపించేది కేవలం మానవుడు కాదు, కాని ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకంటే యిది మనం ఆలోచించని విధముగా ఎంతో అద్భుతంగాను, వైభవంగాను పనిచేసింది. ఈనాడు మనం ప్రపంచమంతటను విస్తరించియున్న సంస్థను కలిగి యున్నాము. ఇది తూర్పు, పడమర దేశాల్లోను, ఉత్తరార్థగోళం, దక్షిణార్థగోళంలోను, పనిచేస్తున్నది. ఒకే ఒక వ్యక్తి అనగా నమ్మకమును బుద్ధిమంతుడైన దాసునిపై అధికారిగానున్న దేవుని కుమారుడు మాత్రమే ఈ గొప్ప అభివృద్ధికి బాధ్యుడైయున్నాడు. ఆయన తన బాధ్యతలను నెరవేర్చుచున్నాడు, మనం చూస్తున్న యీగొప్ప విస్తరణకు కారణమదే.
13 “ఈ కార్యము ఒకనితో జరిగేది కాదు. మనము ఒక దైవీకమైన సంస్థను కలిగియున్నాము, అది దేవుని నడిపింపులోను, దైవీకరీతిలోను పనిచేస్తున్నది. ఏమానవుడును, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి స్థాపకుడు కూడా భూవ్యాప్తంగా నెరవేరుతున్న దానికి కారకుడని లేదా దానికి బాధ్యుడని ఆరోపించలేము. ఇది కేవలము ఓ అద్భుతం.” గొప్ప గుంపుకు చెందినవారంతా, చనిపోయిన బ్రదర్ ఫ్రాంజ్ చెప్పిన ఈ మాటలతో పూర్ణహృదయంతో ఏకీభవించరా? అవును నిజముగా వారంతా నమ్మకమైన దాసుని విస్తారమైన కార్యకలాపాలకు అత్యంత కృతజ్ఞులై యున్నారు.
రాజ్యపౌరులు
14, 15. (ఎ) తలాంతుల దృష్టాంతంలో యేసు ఏమి వివరించాడు (మత్తయి 25:14-30)? (బి) దానితర్వాత మత్తయి 25 వ అధ్యాయంలో యుక్తంగా ఏ దృష్టాంతము తెల్పబడింది?
14 దేవుని రాజ్యమునకు భూసంబంధమైన పౌరులను ప్రోగుచేయు ఈ గొప్ప పనిని, మత్తయి 25 అధ్యాయంలో, గొర్రెలను మేకలను గూర్చి యేసు చెప్పిన ఉపమానం వివరిస్తున్నది. దీనికి ముందున్న తలాంతుల దృష్టాంతములో, యేసుక్రీస్తు తనతో పరలోకములో పాలించే అభిషక్త శిష్యులు తన భూసంబంధ ఆస్తులను అభివృద్ధి చేయుటకు పనిచేయాలని వివరించాడు. మరి, దానికి తగినట్లుగానే, యేసు తన పరలోక రాజ్యమునకు ఎవరు పౌరులు కావాలనుకుంటున్నారో, వారికి కావలసిన అర్హతలేమిటో యేసు తరువాతి దృష్టాంతములో వర్ణిస్తున్నాడు.
15 మత్తయి 25:31-33 లో ఈయన మాటలను గమనించండి: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన యెదుట పోగుచేయబడుదురు, గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.”
16. ఏవిధంగా జనములు సమకూర్చబడ్డాయి మరియు ప్రజలు విభాగింపబడ్డారు?
16 యేసు 1914 లో తన మహిమతో వచ్చాడు. ఆయన తన దూతలందరితో కలసి దయ్యములైన శత్రువులనెదుర్కొని, వారిని పరలోకమునుండి బయటికి వెళ్లగొట్టాడు. యేసు తన ప్రత్యక్షత సమయంలో మహిమా సింహాసనంపై న్యాయాధీశునిగా కూర్చున్న స్థానాన్ని మనం గుణగ్రహించుటకు దీని తరువాతి దృష్టాంతము మనకు సహాయం చేస్తుంది. ఆయన ముందు అన్ని జనములను సమకూర్చడం అనగా అలంకారికంగా, యేసు తనకు కాబోవు మందయగు జనాంగములయెడల వ్యవహిరించుటే యని దీని భావము. ఈ మందలో, గొఱ్ఱెలు, మేకలు కలిసి ఉన్నాయి. నిజమైన మందలోని మేకలనుండి గొఱ్ఱెలను వేరుచేయుటకు ఒకదినములో కొంచెం భాగం పట్టవచ్చును, అయితే భూవ్యాప్తంగా స్వేచ్ఛాచిత్తంగల ప్రజలను వేరుచేయుటకు మరెక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే వేరుపరచడమనేది ప్రతివ్యక్తి జీవించే విధానముమీద ఆధారపడియుంది.
17. ప్రజలందరికి కూడ నేటి పరిస్థితి ఎందుకు తీవ్రమైనదిగా ఉంది?
17 ఈ దృష్టాంతంలో గొఱ్ఱెలకాపరి-రాజు గొఱ్ఱెలాంటి వారిని తన కుడిచేయి వైపున, మేకలాంటి వారిని తన ఎడమచేయి వైపున ఉంచుతాడు. కుడిచేతి వైపునున్న వారికివ్వబడే తీర్పుఫలితం నిత్యజీవము. ఎడమచేతి వైపునున్న వారు నిత్యనాశనము అనే తీర్పు పొందుతారు. ఈ విషయంలో రాజుయొక్క దృఢనిర్ణయం గంభీరమైన ఫలితాలను కలిగియుంది.
18. యేసు అదృశ్యత ఎవరినీ ఎందుకు క్షమించదు?
18 అదృశ్యంగా పరిపాలించుచున్న తన ప్రత్యక్షత లేదా పరోసియా సమయంలో మనుష్య కుమారుడు ఎవ్వరినీ క్షమించడు. అనేకమంది గొఱ్ఱెలాంటి ప్రజలు ఈనాడు దాసుని తరగతిలో చేరుతూ ప్రపంచమంతటను దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు, తమ వెలుగును ప్రకాశింపజేయుచున్నారు. నిజముగా, వారి సాక్ష్యము భూగోళపు సుదూర ప్రాంతాలకు చేరింది.—మత్తయి 24:14.
19. గొఱ్ఱెలు, మేకల దృష్టాంతములో దాసుని తరగతి ఏ గుణములు వివరించబడినవి?
19 గొఱ్ఱెలకాపరి-రాజు గొఱ్ఱెలతరగతివారికి దివ్యమైన భవిష్యత్తునెందుకు బహూకరించాడు? ఎందుకంటే వారు రాజ్యప్రచార పని విషయంలో పూర్ణహృదయంతో సహకరిస్తున్నారు, యేసు తనకు చూపిస్తున్నట్లుగా భావిస్తున్న దయను వారు అభిషక్త సహోదరులపట్ల చూపిస్తున్నారు. కాబట్టి, రాజకుమారుడు వారికి ఈవిధంగా చెబుతున్నాడు: “నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.”—మత్తయి 25:34; 28:19, 20.
రాజుకు సహాయం చేయుట
20, 21. గొఱ్ఱెలు తాము దేవుని పక్షమున నిలిచియున్నారని ఎటువంటి సాక్ష్యాధారం ఇస్తున్నాయి?
20 రాజు ఈ గొఱ్ఱెలను దేవుని రాజ్యసంబంధమైన ఈ భూలోకాన్ని స్వతంత్రించుకొనుడని ఆహ్వానించినపుడు వారు ఆశ్చర్యాన్ని వ్యక్తపరచుట గమనించండి. వారాయనను యిలా అడుగుతారు: ‘ప్రభువా మేమెప్పుడు నీకొరకు ఇవన్నియు చేశాము?’ అందుకాయన యిలా సమాధానమిస్తాడు: “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 25:40) పునరుత్థానుడైన రోజున యేసు మగ్దలేనే మరియకు కనబడి, ఆయన తన ఆత్మీయ సహోదరులనుగూర్చి మాట్లాడుతూ యిట్లనెను: “అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లుము.” (యెహాను 20:17) ఆయన అదృశ్య ప్రత్యక్షత సమయంలో, యేసు తన ఆత్మీయసహోదరులైన 1,44,000 మందిలో కొద్దిమంది శేషించిన ఆత్మీయ సహోదరులను మాత్రమే ఇంకను ఈ భూమిమీద కల్గియుండెను.
21 పరలోకములో యేసుక్రీస్తు అదృశ్యముగా ఉన్నాడు గనుక, గొఱ్ఱెలాంటి ప్రజలు ప్రేమతో ఆయనకు చేసిన ఈ కార్యములు కేవలం పరోక్షంగానే చేస్తున్నారు. విశ్వాసమనే వారికన్నులతో మాత్రమే వారాయనను సింహాసనముమీద చూస్తున్నారు. ఎవరైతే ఆయనతో పాటు పరలోకములో తోటివారసులవుతారో, అట్టి ఆత్మీయ సహోదరులకు సహాయంచేయుటకు చేసిన కృషిని బట్టి వారిని యేసు మెచ్చుకుంటాడు. తన సహోదరులకు చేసినదంతయు తనకు వ్యక్తిగతంగా చేసినట్లే భావిస్తాడు. క్రీస్తు సహోదరులకు గొఱ్ఱెలాంటి వారు ఉద్దేశపూర్వకంగానే మంచి చేస్తున్నారు, ఎందుకంటే వారు వారిని ఆవిధంగానే గుర్తించారు. యేసు ఆత్మీయసహోదరులు యెహోవా రాజ్యానికి రాయబారులని వారు మెచ్చుకొంటున్నారు, మరియు వారు ఆ రాజ్యపక్షం వహిస్తున్నట్లు గట్టి సాక్ష్యాధారం ఇవ్వాలనుకుంటున్నారు.
22. ఏవిధంగా గొఱ్ఱెల తరగతివారు దీవించబడుచున్నారు? (ప్రకటన 7:14-17 పోల్చండి.)
22 ఈ గొఱ్ఱెలాంటి తరగతి వారు తన కుమారుని ప్రత్యక్షత సమయంలో బయల్పడతారని, వారికొరకు అద్భుతమైన బహుమానం తాను దాచియుంచాడని యెహోవా ముందుగానే ఊహించాడు! యెహోవాయొక్క రాజైన యేసుక్రీస్తు, ఆనందదాయకమైన వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఈ గొప్పసమూహం భూమిమీద శాంతి సమాధానాశీర్వాదములను పొందుతారు.
23. ఏయే రీతులలో గొఱ్ఱెలు రాజు సహోదరులకు తెలిసే సహకరిస్తున్నారు?
23 గొఱ్ఱెలు మేకలను గూర్చి యేసు చెప్పిన దృష్టాంతాలను క్రీస్తు ప్రత్యక్షత సమయంలో వర్తించు ప్రవచనాలను మనం పరిశీలించినపుడు, మనమేమి గమనిస్తాము? ఇదే మనం గమనించేది: తెలియకుండా, అనుకోకుండా రాజుయొక్క ఆత్మీయ సహోదరులలో ఒకనికి మంచిచేయడం వలన ఒకడు నీతిమంతుడై గొఱ్ఱెవలె దేవునియొద్ద, ఆయన రాజునొద్ద నిలువబడలేడు. గొఱ్ఱెలతరగతికి చెందినవారు వారి సహజ నేత్రాలతో పరిపాలించుచున్న రాజును చూడకపోయినను, వారు చేసేదేదో వారికి తెలుసు. వారు రాజుయొక్క సహోదరులకు భౌతికమైన సహాయమేకాకుండా, ఆత్మీయరీతిలో కూడా సహాయపడుటకు పాటుపడుతున్నారు. ఏవిధంగా? క్రీస్తుకు శిష్యులను చేయునిమిత్తం బైబిలు అధ్యయనాలను చేయడం, దేవుని రాజ్యసువార్తను ప్రకటించడంలో వారికి సహకరించడం ద్వారా అలా సహాయపడుతున్నారు. ఈలాగున, ఈనాడు 40 లక్షలకంటే ఎక్కువ మంది వెలుగును ప్రకాశింపజేసే దేవుని రాజ్యప్రచారకులుగా ఉన్నారు.
విస్తరించిన కార్యకలాపాలు
24. ఏ ప్రేమపూర్వక ఏర్పాట్లు దాసుని తరగతివారిని ఈనాడు భూమిమీద అత్యంత ఆనందదాయకమైన ప్రజలుగా ఉండేటట్లుచేస్తున్నాయి?
24 నమ్మకమైన దాసుని తరగతి చేసిన కొన్ని మంచి పనులను మనం పేర్కొందాము. మొదటిగా, క్రీస్తు ఆస్తులంతటిమీద, భూమిపైనున్న తన రాజ్యముమీద—ఈ దాసుని తరగతి నియమింపబడింది—ఈ ఆస్తులన్నియు అభివృద్ధినొందుతునేయున్నవి. రెండవదిగా, ఆ తరగతి అభిషక్తులను మాత్రమే కాకుండా, నిత్యమూ విస్తరించుచున్న గొప్ప సమూహానికి చెందిన వేరే గొఱ్ఱెలను కూడ ఆత్మీయాహారంతో పోషిస్తుంది. మూడవదిగా, రాజ్య వెలుగును వెదజల్లుటలో దాసుని తరగతి నాయకత్వం వహిస్తున్నది. నాల్గవదిగా, వేరేగొఱ్ఱెలకు చెందిన గొప్పసమూహమును సమకూర్చడంలో అత్యంత గొప్పగా విస్తరించిన కార్యకలాపాలతో, వారిని యెహోవా ఆత్మీయాలయంలోనికి తేవడం. ఐదవదిగా, గొఱ్ఱెలాంటి ప్రజలకు పూర్ణహృదయంతో మద్దతునిచ్చేందుకు దాసుని తరగతి, ప్రపంచమంతటనున్న బ్రాంచి కార్యాలయాలకు, అమెరికాలోని ప్రధానకార్యాలయాలకు కూడా విస్తరించిన సౌకర్యాలను కల్పిస్తున్నారు. అటువంటి ప్రేమపూరిత ఏర్పాట్లు దాసుని తరగతిని ఈ భూమిమీద ఆనందదాయకమైన ప్రజలుగా తయారు చేశాయి, అంతేకాకుండా, వారు లక్షలాదిమంది వేరేప్రజలను కూడా ఆనందభరితులను చేశారు. వీరందరు బుద్ధిమంతుడైన దాసుని విస్తరించిన కార్యకలాపాలను నడిపించిన యేసుక్రీస్తుకు, యెహోవా దేవునికి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.
25. గొఱ్ఱెలు దాసుని తరగతివారికి ఎలా మద్దతునిస్తూండవచ్చు, ఏనిరీక్షణతో?
25 నేడు దాసుని తరగతి దేవుడు నియమించిన పనులను మునుపెన్నడు కూడ పనిచేయని విధంగా కష్టపడి చేయుచున్నారు. “మహాశ్రమలు” రావడానికి యింకా కొద్ది సమయం మాత్రమే మిగిలివుంది! (మత్తయి 24:21) దేవుని గొఱ్ఱెలైన వీరు తనకు ప్రియమైన గొఱ్ఱెలకాపరియైన-రాజు కుడిచేతి ప్రక్కనుండుట ఎంత ఆవశ్యకము! అందుచేత, మనమందరమూ ఉత్సాహంతో నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని తరగతికి మద్దతునిచ్చుటలో కొనసాగుదాం. కేవలం ఈవిధంగా చేయడంద్వారానే, త్వరలో ఒకరోజు గొఱ్ఱెలాంటి వారందరు అటువంటి ఆనందదాయకమైన మాటలను వినగలరు: “నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.” (w93 5/1)
మీరు సమాధాన మివ్వగలరా?
▫ రాజు సింహాసనాసీనుడైన వెంటనే మొదటిగా జరిగే తీర్పేమిటి?
▫ మత్తయి 24:45-47 యొక్క ఆధునిక దిననెరవేర్పు ఎలాజరిగింది?
▫ విస్తరించిన కార్యకలాపాల విషయంలో, ఏ కార్యక్రమాల కొరకు దాసుని తరగతి మరియు గొప్ప సమూహము అత్యంత కృతజ్ఞులైయున్నారు?
▫ పరోసియా సమయంలో మత్తయి 25:34-40 ఏవిధంగా నెరవేరింది?
[బాక్సు]
యజమానుడు తన ఆస్తులనన్నిటిని నమ్మకమైన దాసునికి అప్పగించుట
[బాక్సు]
మానవజాతిని తీర్పుతీర్చుటకు యేసు తన మహిమగల సింహాసనాసీనుడయ్యాడు