కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ‘నమ్మకమైన దాసుడు’ పరీక్షలో కృతార్థుడయ్యాడు!
    కావలికోట—2004 | మార్చి 1
    • 2, 3. ‘దుష్టుడైన దాసుడు’ ఎక్కడనుండి వచ్చాడు, ఎలా వచ్చాడు?

      2 ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ గురించి మాట్లాడిన వెంటనే యేసు దుష్టుడైన దాసుని గురించి మాట్లాడాడు. ఆయనిలా చెప్పాడు: “అయితే దుష్టుడైన యొక దాసుడు—నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి [“అత్యంత కఠినంగా శిక్షించి,” NW] వేషధారులతోకూడ వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.” (మత్తయి 24:48-51) “దుష్టుడైన యొక దాసుడు” అనే మాట యేసు అంతకుముందు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” గురించి పలికిన మాటలపైకి మన అవధానాన్ని మళ్లిస్తుంది. అవును, ‘దుష్టుడైన ఆ దాసుడు’ నమ్మకమైన దాసుని తరగతి నుండే వచ్చాడు.a ఎలా?

  • ‘నమ్మకమైన దాసుడు’ పరీక్షలో కృతార్థుడయ్యాడు!
    కావలికోట—2004 | మార్చి 1
    • 4. ‘దుష్టుడైన దాసునితో,’ అదే స్వభావం కనబరచిన వారందరితో యేసు ఎలా వ్యవహరించాడు?

      4 ఈ మాజీ క్రైస్తవులు చివరకు ‘దుష్టుడైన దాసునిగా’ గుర్తించబడడంతో, యేసు వారిని ‘అత్యంత కఠినంగా’ శిక్షించాడు. ఎలా? ఆయన వారిని తిరస్కరించగా వారు తమ పరలోక నిరీక్షణ పోగొట్టుకున్నారు. అయితే వారు వెనువెంటనే నాశనం చేయబడలేదు. వారు మొదట క్రైస్తవ సంఘం వెలుపల ఏడుస్తూ పండ్లు కొరుకుతూ కొంత కాలం గడపవలసివచ్చింది. (మత్తయి 8:12) ఆ తొలి రోజులు మొదలుకొని, మరి కొంతమంది అభిషిక్తులు అలాంటి చెడు స్వభావమే కనబరచి, తమనుతాము ‘దుష్టుడైన దాసునిగా’ కనబరచుకున్నారు. ‘వేరే గొఱ్ఱెల్లోని’ కొందరు వారి అవిశ్వాస్యతను అనుకరించారు. (యోహాను 10:16) అలాంటి క్రీస్తు శత్రువులందరూ ఒకే విధమైన ఆధ్యాత్మిక ‘వెలుపటి చీకటిని’ అనుభవిస్తారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి