కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • బాప్తిస్మం అంటే ఏంటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
    • పవిత్రశక్తితో బాప్తిస్మం. బాప్తిస్మమిచ్చే యోహాను, అలాగే యేసుక్రీస్తు ఇద్దరూ పవిత్రశక్తితో ఇచ్చే బాప్తిస్మం గురించి మాట్లాడారు. (మత్తయి 3:11; లూకా 3:16; అపొస్తలుల కార్యాలు 1:1-5) దానికీ పవిత్రశక్తి పేరున ఇచ్చే బాప్తిస్మానికీ తేడా ఉంది. (మత్తయి 28:19) అలా అని ఎందుకు చెప్పవచ్చు?

      యేసు అనుచరుల్లో కొంతమంది మాత్రమే పవిత్రశక్తితో బాప్తిస్మం పొందుతారు. వీళ్లు పవిత్రశక్తితో అభిషేకించబడతారు. ఎందుకంటే వీళ్లు పరలోకంలో క్రీస్తుతోపాటు ఉంటూ రాజులుగా భూమిని పరిపాలించడానికి, యాజకులుగా సేవచేయడానికి పిలవబడ్డారు.f (1 పేతురు 1:3, 4; ప్రకటన 5:9, 10) వాళ్లు, అందమైన తోటలా మారే భూమ్మీద శాశ్వతకాలం జీవించే కోట్లమంది యేసు అనుచరుల్ని పరిపాలిస్తారు.—మత్తయి 5:5; లూకా 23:43.

  • బాప్తిస్మం అంటే ఏంటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
    • అగ్నితో బాప్తిస్మం. యోహాను ప్రజలతో ఇలా అన్నాడు: “ఆయన [యేసు] మీకు పవిత్రశక్తితో, అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చేతిలో తూర్పారబట్టే పార ఉంది, ఆయన తన కళ్లాన్ని పూర్తిగా శుభ్రం చేసి, గోధుమల్ని గోదాములో సమకూరుస్తాడు; పొట్టును మాత్రం ఆరని మంటల్లో కాల్చేస్తాడు.” (మత్తయి 3:11, 12) అగ్నితో ఇచ్చే బాప్తిస్మానికి, పవిత్రశక్తితో ఇచ్చే బాప్తిస్మానికి కొన్ని తేడాలు ఉన్నాయని గమనించండి. యోహాను ఈ ఉదాహరణ ఉపయోగించి ఏం చెప్పాలనుకుంటున్నాడు?

      గోధుమలు యేసు చెప్పేది విని, పాటించే వాళ్లను సూచిస్తున్నాయి. వాళ్లు పవిత్రశక్తితో బాప్తిస్మం పొందడం కోసం ఎదురుచూడవచ్చు. పొట్టు, యేసు చెప్పేది వినని వాళ్లను సూచిస్తుంది. వాళ్లకు అగ్నితో బాప్తిస్మం ఉంటుంది, అంటే వాళ్లు శాశ్వతంగా నాశనమౌతారని అర్థం.—మత్తయి 3:7-12; లూకా 3:16, 17.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి