కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యేసు ఎవరు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 1. యేసు ఎవరు?

      యేసు పరలోకంలో ఉండే ఒక శక్తివంతమైన దేవదూత. మిగతా సృష్టిలో దేన్నీ చేయకముందే యెహోవా దేవుడు యేసును సృష్టించాడు. అందుకే, బైబిలు ఆయన్ని “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు” అని అంటుంది. (కొలొస్సయులు 1:15) యెహోవా స్వయంగా సృష్టించింది యేసును మాత్రమే, అందుకే బైబిలు ఆయన్ని దేవుని ‘ఒక్కగానొక్క కుమారుడు’ అని పిలుస్తుంది. (యోహాను 3:16) తన తండ్రైన యెహోవా మిగతా సృష్టిని చేస్తున్నప్పుడు, యేసు ఆయనతో కలిసి చాలా దగ్గరగా పని చేశాడు. (సామెతలు 8:30 చదవండి.) ఇప్పటికీ యేసుకు యెహోవాతో చాలా దగ్గరి సంబంధం ఉంది. యేసు యెహోవా దేవుని తరఫున మాట్లాడుతూ ఆయన సందేశాల్ని, నిర్దేశాల్ని దేవదూతలకు, మనుషులకు నమ్మకంగా అందజేస్తాడు. అందుకే యేసుకు “వాక్యం” అనే పేరు ఉంది.—యోహాను 1:14.

  • యేసు మరణం మనల్ని ఎలా రక్షిస్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 27వ పాఠం. కొయ్య మీది నుండి యేసు మృతదేహాన్ని కిందికి దించారు.

      27వ పాఠం

      యేసు మరణం మనల్ని ఎలా రక్షిస్తుంది?

      మొదటి మనుషులైన ఆదాముహవ్వలు దేవుని మాట వినకపోవడం వల్ల మనకు పాపం, బాధలు, మరణం వచ్చాయి.a అయితే, యెహోవా మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని పాపమరణాల నుండి విడిపించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. యేసు మన కోసం చనిపోవడం ద్వారా విమోచన క్రయధనాన్ని ఇచ్చాడని బైబిలు చెప్తుంది. విమోచన క్రయధనం అంటే ఎవరినైనా విడిపించడానికి కట్టే వెల. యేసు తన పరిపూర్ణ మానవ ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించాడు. (మత్తయి 20:28 చదవండి.) కావాలనుకుంటే యేసు చనిపోకుండా ఎప్పటికీ భూమ్మీద జీవించవచ్చు. కానీ, ఆయన మన కోసం ఇష్టంగా తన ప్రాణాన్ని అర్పించాడు. దానివల్ల, ఆదాముహవ్వలు పోగొట్టుకున్నవన్నీ మనం తిరిగి పొందడం సాధ్యమైంది. తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తనకు, యెహోవాకు మన మీద ఎంత ప్రేమ ఉందో కూడా యేసు చూపించాడు. విమోచన క్రయధనం మీద మన కృతజ్ఞతను పెంచుకోవడానికి ఈ పాఠం సహాయం చేస్తుంది.

      1. యేసు చనిపోవడం వల్ల మనం ఇప్పుడు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?

      మనం పాపులం కాబట్టి యెహోవాను బాధపెట్టే ఎన్నో పనులు చేస్తుంటాం. అయితే మనం మన పాపాల్ని ఒప్పుకుని, యేసుక్రీస్తు ద్వారా యెహోవాను క్షమాపణ అడిగి, మళ్లీ ఆ తప్పులు చేయకుండా ఉండడానికి కృషిచేస్తే దేవునికి దగ్గరి స్నేహితులుగా ఉండవచ్చు. (1 యోహాను 2:1) బైబిలు ఇలా చెప్తుంది: “అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే చనిపోయాడు. పాపాల్ని తీసేయడానికి, మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి ఆయన అలా చనిపోయాడు.”—1 పేతురు 3:18.

      2. యేసు చనిపోవడం వల్ల మనం భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?

      యేసు తన పరిపూర్ణ మానవ ప్రాణాన్ని అర్పించడానికి యెహోవా ఆయన్ని భూమ్మీదికి పంపించాడు. యేసు మీద “విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” (యోహాను 3:16) ఆదాము దేవుని మాట వినకపోవడం వల్ల జరిగిన నష్టాన్నంతటినీ యెహోవా అతిత్వరలోనే తీసేస్తాడు. యేసు అర్పించిన బలి ద్వారా యెహోవా అలా చేస్తాడు. కాబట్టి, ఆ బలి మీద విశ్వాసం ఉంచితే పరదైసులా మారిన భూమ్మీద ఎల్లప్పుడూ సంతోషంగా జీవించవచ్చు!—యెషయా 65:21-23.

      ఎక్కువ తెలుసుకోండి

      యేసు తన ప్రాణాన్ని ఎందుకు అర్పించాడో, దాని నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోండి.

      3. విమోచన క్రయధనం మనల్ని పాపమరణాల నుండి విడిపిస్తుంది

      వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

      వీడియో: యేసు ఎందుకు చనిపోయాడు?—1వ భాగం (2:01)

      • దేవుని మాట వినకపోవడం వల్ల ఆదాము ఏ అవకాశం పోగొట్టుకున్నాడు?

      రోమీయులు 5:12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • ఆదాము చేసిన పాపం వల్ల మనమెలా నష్టపోయాం?

      యోహాను 3:16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • యెహోవా తన కుమారుణ్ణి భూమ్మీదికి ఎందుకు పంపించాడు?

      1. చిత్రాలు: 1. దేవుని మాటను మీరిన తర్వాత ఆదాము. 2. కొంతమంది శవపేటికను మోసుకెళ్తున్నారు. చిత్రాలు: 1. దేవుని మాటను మీరిన తర్వాత ఆదాము. 2. యేసు క్రీస్తు. 2. చిత్రాలు: 1. యేసు క్రీస్తు. 2. వేర్వేరు వయసుల, జాతుల, సంస్కృతుల, నేపథ్యాల ప్రజలు.
      1. 1. ఆదాము ఒక పరిపూర్ణ మనిషి, ఆయన దేవుని మాట వినలేదు కాబట్టి మనుషులు పాపులై చనిపోతున్నారు

      2. 2. యేసు ఒక పరిపూర్ణ మనిషి, ఆయన దేవుని మాట విన్నాడు కాబట్టి మనుషులు పరిపూర్ణులై ఎల్లప్పుడూ జీవించే అవకాశం దొరికింది

      4. యేసు మరణం నుండి అందరూ ప్రయోజనం పొందవచ్చు

      వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

      వీడియో: యేసు ఎందుకు చనిపోయాడు?—2వ భాగం (2:00)

      • ఒక్క మనిషి చనిపోవడం వల్ల అందరూ ఎలా ప్రయోజనం పొందుతారు?

      1 తిమోతి 2:5, 6 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • మనుషులు పాపులై చనిపోయేలా చేసిన ఆదాము ఒక పరిపూర్ణ మనిషి. అయితే, యేసు కూడా ఒక పరిపూర్ణ మనిషే. యేసు బలి “సరిసమానమైన విమోచన క్రయధనం” ఎలా అయ్యింది?

      5. విమోచన క్రయధనం యెహోవా మీకోసం ఇచ్చిన బహుమతి

      దేవుని స్నేహితులు విమోచన క్రయధనాన్ని యెహోవా తమ కోసమే ఇచ్చిన బహుమతిలా చూస్తారు. ఉదాహరణకు, గలతీయులు 2:20 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • అపొస్తలుడైన పౌలు విమోచన క్రయధనాన్ని దేవుడు తన కోసమే ఇచ్చిన బహుమతిలా చూశాడని ఎలా చెప్పవచ్చు?

      ఆదాము పాపం చేసినప్పుడు ఆయనకు, ఆయన పిల్లలైన మనందరికీ మరణం వచ్చింది. కానీ, మీరు ఎల్లప్పుడూ జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే మీకోసం చనిపోవడానికి తన కుమారుణ్ణి పంపించాడు.

      యోహాను 19:1-7, 16-18 చదవండి. ఆ వచనాలు చదువుతూ, తన కుమారుడు బాధ పడుతున్నప్పుడు యెహోవాకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించుకోండి. తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • యెహోవా, యేసు మీకోసం చేసిన దాన్నిబట్టి మీకు ఏమనిపిస్తుంది?

      కొంతమంది ఇలా అడుగుతారు: “ఒక్క వ్యక్తి చనిపోవడం వల్ల మనుషులందరూ ఎలా రక్షణ పొందుతారు?”

      • వాళ్లకు మీరేం చెప్తారు?

      ఒక్కమాటలో

      యేసు మరణం వల్ల మనం యెహోవా క్షమాపణ పొందడం, భవిష్యత్తులో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించడం సాధ్యమౌతుంది.

      మీరేం నేర్చుకున్నారు?

      • యేసు ఎందుకు చనిపోయాడు?

      • యేసు బలి “సరిసమానమైన విమోచన క్రయధనం” ఎలా అయ్యింది?

      • యేసు మరణం నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు?

      ఇలా చేసి చూడండి:

      ఇవి కూడా చూడండి

      యేసు అర్పించిన పరిపూర్ణ మానవ ప్రాణాన్ని విమోచన క్రయధనం అని ఎందుకు పిలవవచ్చో తెలుసుకోండి.

      “యేసు బలి, ‘అనేకుల కోసం విమోచన క్రయధనం’ ఎలా అయ్యింది?” (jw.org ఆర్టికల్‌)

      పాపమరణాల నుండి విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి?

      “యేసు రక్షిస్తాడు—ఎలా?” (jw.org ఆర్టికల్‌)

      యెహోవా ఘోరమైన తప్పుల్ని కూడా క్షమిస్తాడా?

      “బైబిలు ప్రశ్నలకు జవాబులు” (కావలికోట ఆర్టికల్‌)

      యేసు బలి గురించి నేర్చుకోవడం వల్ల ఒకాయన ఎలా మారాడో తెలుసుకోండి.

      “ఒకప్పుడు గొడవలు, కొట్లాటలే నా ప్రపంచం” (jw.org ఆర్టికల్‌)

      a పాపం అనే మాట కేవలం తప్పు చేయడాన్నే కాదు, తప్పు చేయాలనిపించే స్వభావాన్ని కూడా సూచిస్తుంది. ఆ స్వభావం మనుషులందరికీ ఆదాముహవ్వల నుండి వారసత్వంగా వచ్చింది.

  • యెహోవా, యేసు మీకోసం చేసినదానికి కృతజ్ఞత చూపించండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 1. యెహోవా, యేసు మన కోసం చేసినదానికి కృతజ్ఞత చూపించే ఒక మార్గం ఏంటి?

      యేసు మీద ‘విశ్వాసం ఉంచే ప్రతీ ఒక్కరు’ శాశ్వత కాలం జీవించే అవకాశం పొందుతారని బైబిలు మాటిస్తుంది. (యోహాను 3:16) యేసు మీద విశ్వాసం ఉంచడం అంటే అర్థమేంటి? దానర్థం, కేవలం మనసులో యేసును నమ్మడమే కాదు. మన నిర్ణయాల్లో, పనుల్లో మనం ఆయన్ని నమ్ముతున్నామని చూపించాలి. (యాకోబు 2:17) అలా మన మాటల్లో, పనుల్లో విశ్వాసాన్ని చూపించినప్పుడు యేసుకు, ఆయన తండ్రైన యెహోవాకు ఇంకా దగ్గరౌతాం.—యోహాను 14:21 చదవండి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి