కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 2/1 పేజీలు 26-27
  • రత్నాలు యోహాను సువార్తనుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రత్నాలు యోహాను సువార్తనుండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చాలవరకు అదనపు సమాచారము
  • దీనత్వము మరియు ఆనందము
  • ప్రజల పట్ల యేసు శ్రద్ధ
  • మంచి కాపరి శ్రద్ధవహించును
  • దేవునికి ఎప్పటికిని నమ్మకమైన కుమారుడు
  • మంచి కాపరి, గొర్రెల దొడ్లు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • గొర్రెల దొడ్లు మరియు గొర్రెల కాపరి
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 2/1 పేజీలు 26-27

రత్నాలు యోహాను సువార్తనుండి

కదలించు శక్తిగల యేసు జీవితము మరియు పరిచర్య వృత్తాంతమును వ్రాయుటకు వృద్ధుడైన అపొస్తలుడగు యోహానును యెహోవా ఆత్మ ప్రేరేపించెను. ఎఫెసులో లేక దానికి సమీపమున సా.శ.98లో ఈ సువార్త వ్రాయబడినది. అయితే ఈ వృత్తాంత స్వభావమేమి? ఇందులోగల కొన్ని రత్నాలు ఏమి?

చాలవరకు అదనపు సమాచారము

యోహాను ఎంతో ఎంపిక చేసి వ్రాస్తూ మత్తయి, మార్కు, లూకా, వ్రాసిన సమాచారములో చాలా తక్కువ భాగమును తిరిగి వ్రాసెను. తాను కంటితో చూసి వ్రాసిన ఈ వృత్తాంతము చాలామట్టుకు అదనపుసమాచారమై, 90 శాతము కంటె ఎక్కువగా ఇతర సువార్తలలో లేని సమాచారమును అందించుచున్నది. ఉదాహరణకు, “వాక్యము శరీరధారియై వచ్చెనని” వ్రాయుచు యేసు మానవపూర్వపు ఉనికిని ఆయన మాత్రమే చెప్పుచున్నాడు. యోహాను (1:1-14) యేసు తనపరిచర్య అంతిమ కాలములో దేవాలయమును శుభ్రము చేశాడని ఇతర సువార్త వ్రాతగాళ్లు చెప్పుచుండగా, ఆ పనిని ఆయన ప్రారంభంలో కూడా చేశాడని యోహాను వ్రాయుచున్నాడు. యోహాను (2:13-17) నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట, చనిపోయిన లాజరునులేపుట, పునరుత్థానము తర్వాత అద్భుతరీతిగా చేపనుపట్టుట వంటి యేసు చేసిన కొన్ని అద్భుతములను వృద్ధుడైన అపొస్తలుడు మాత్రమే మనకు చెప్పుచున్నాడు.—యోహాను 2:1-11; 11:38-44; 21:4-14.

యేసు తన మరణజ్ఞాపకార్థమును ఎలా ప్రారంభించాడో సువార్త వ్రాతగాళ్లందరు చెప్పుచున్నారు, అయితే యోహాను మాత్రమే క్రీస్తు ఆ రాత్రి అపొస్తలుల పాదములు కడుగుట ద్వారా వారికి దీనత్వమును గూర్చిన పాఠమును బోధించినట్లు చూపుచున్నాడు. అంతేగాక యోహాను మాత్రమే ఆ సమయములో యేసు హృదయమువిప్పి వారితోమాట్లాడిన మాటలను, వారికొరకు ఆయన చేసిన ప్రార్థనను వ్రాయుచున్నాడు.—యోహాను 13:1—17:26.

ఈ సువార్తలోని యోహాను అను పేరు బాప్తిస్మమిచ్చు యోహానును సూచించుచున్నది. రచయిత మాత్రము తనను తాను “శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు” అని పిలుచుకొనుచున్నాడు. యోహాను (13:23) అపొస్తలుడు నిశ్చయముగా యేసును ప్రేమించాడు, మరియు ఆయన యేసును వాక్యము, జీవాహారము, లోకమునకు వెలుగు, మంచి కాపరి, మార్గము, సత్యము, జీవము అని వర్ణించుట యేసు యెడల మన ప్రేమను అధికము చేసియున్నది. యోహాను (1:1-3, 14; 6:35; 8:12; 10:11; 14:6) మరియు ఇది యోహాను వ్రాసిన ఉద్దేశ్యమును కూడ నెరవేర్చుచున్నది. ఏమనగా: “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును,నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.”—యోహాను 20:31.

దీనత్వము మరియు ఆనందము

యేసును వాక్యముగాను, పాపము మోసికొనిపోవు గొర్రెపిల్లగాను, పరిచయముచేసి, “ఆయన దేవుని పరిశుద్ధుడని” రుజువు చేయు అద్భుతములను యోహాను సువార్త వ్రాయుచున్నది. యోహాను (1:1–9:41) ఇతర విషయములతోపాటు, ఈ వృత్తాంతము బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క దీనత్వమును, ఆయన ఆనందమును ఉన్నతపరచుచున్నది. తాను క్రీస్తుకు ముందుగా వచ్చువాడైనను ఆయన యిలా చెప్పెను: “ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను.” యోహాను (1:27) చెప్పులు చర్మపుదారములతో కట్టబడును. ఒక దాసుడు ఇతర వ్యక్తియొక్క చెప్పులదారమును విప్పి తనకొరకు వాటిని అతడు మోయును. యిది తక్కువగా యెంచబడిన పని. ఆ విధముగా బాప్తిస్మమిచ్చు యోహాను తన దీనత్వమును, యజమానుని యెదుట తాను ఏమాత్రము గుర్తింపులేని వానిగాను వ్యక్తపరిచియున్నాడు. యెహోవాకును ఆయన మెస్సియా రాజుకును సేవచేయుటకు కేవలము దీనులే తగినవారు గనుక అది ఒక మంచి పాఠమైయున్నది.—కీర్తన 138:6; సామెతలు 21:4.

గర్వముతో యేసును చూచి మండిపడే బదులు, “పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లికుమారునిస్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమైయున్నది” అని అనెను. యోహాను (3:29) పెండ్లికుమారుని ప్రతినిధిగా, స్నేహితుడు వివాహఏర్పాట్లను అనగా కొన్నిసార్లు నిశ్చితార్థముచేయుట, పెండ్లికుమార్తెకు బహుమతులనిచ్చుట, ఆమె తండ్రికి ఓలినిచ్చుట వంటి వాటినిచేసెను. తోడిపెండ్లికుమారుడు తన పనిని నెరవేర్చినందుకు నిశ్చయంగా సంతోషించు కారణమును కలిగియున్నాడు. అలాగే యోహాను కూడ యేసును తన పెండ్లికుమార్తెయందలి తొలి సభ్యులయొద్దకు తెచ్చికలుపుటలో ఆనందించెను. (ప్రకటన 21:2, 9) పెండ్లికుమారుని స్నేహితుని సేవలు కొద్దికాలము ఉండినట్లే, యోహాను పనియు త్వరగా సమాప్తమాయెను. యేసు హెచ్చుచుండగా, యెహాను తగ్గిపోవుచుండెను.—యోహాను 3:30.

ప్రజల పట్ల యేసు శ్రద్ధ

సుఖారను ఊరిలోగల బావియొద్ద నిత్యజీవమునిచ్చు సూచనార్థక జలమును గూర్చి మాట్లాడెను. “ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి.” యోహాను (4:27) ఎందుకు అట్టి ప్రతిస్పందన? సహజముగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. వారిని యూదులు అవమానించు వారు కూడ. యోహాను (4:9; 8:48) అంతేగాక యూదా బోదకుడు బహిరంగముగా ఒక స్త్రీతో మాట్లాడుట అసాధారణమైన విషయము. అయితే ప్రజలయెడల యేసుకు గల దయగల శ్రద్ధ ఆయనను ఈ సాక్ష్యమిచ్చుటకు నడిపినది. మరియు తద్వారా ఊరివారు “ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.”—యోహాను 4:28-30.

ప్రజలయెడలగల ఆయన శ్రద్ధ యేసును యిలా అనుటకు నడిపినది: “ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పితీర్చుకొనవలెను.” యోహాను (7:37) స్పష్టముగా, ఆయన ఎనిమిది దినముల పర్ణశాల పండుగకు చేర్చబడిన ఆచారమునకు సంబంధముగా అలా మాట్లాడెను. ఏడుదినముల వరకు ప్రతి ఉదయము యాజకుడు సిలోయము అను కొనేటినుండి నీరును తీసుకొనివచ్చి ఆలయ బలిపీఠము మీద పోయువాడు. యితర విషయములతో పాటు ఇది ఆత్మ క్రుమ్మరింపబడుటను సూచించునని చెప్పబడెను. సా.శ. 33 నుండి యేసు అనుచరులు జీవమునిచ్చు జలములను భూవ్యాప్తముగా తీసుకువెళ్లునట్లు దేవుని ఆత్మవారిని ప్రేరేపించెను. “జీవ జలముల ఊట” యైన యెహోవానుండి మాత్రమే క్రీస్తుద్వారా ఎవరైనను నిత్యజీవమును పొందగలరు.—యిర్మీయా 2:13; యెషయా 12:3; యోహాను 17:3.

మంచి కాపరి శ్రద్ధవహించును

ప్రజలపట్ల యేసుకు గల శ్రద్ధ గొర్రెలాంటి తన అనుచరులనుగూర్చి శ్రద్ధతీసుకొను తన మంచికాపరి పాత్రలో స్పష్టమగుచున్నది. మరణము సమీపించుచుండగా, యేసు తన శిష్యులకు ప్రేమగల సలహానిచ్చి వారి కొరకు ప్రార్థించెను. యోహాను (10:1–17:26) దొంగ లేక దోచుకొనువానివలె కాక ఆయన గొర్రెల దొడ్డి లోకి ద్వారముననుండి ప్రవేశించును. యోహాను (10:1-5) గొర్రెలదొడ్డి రాత్రులందు గొర్రెలను దొంగలనుండి, వాటిని తిను జంతువులనుండి కాపాడుటకై ఏర్పరచునది. దానికి బహుశ రాతి గోడలుండి, ఆ గోడలపై ముండ్ల కొమ్మలు వేయుదురు. ప్రవేశించు ద్వారమున మాత్రము ద్వారా పాలకుడుండును.

ఒకే గొర్రెల దొడ్డిలో అనేక కాపరుల మందలు వుండవచ్చును. అయితే గొర్రెలు మాత్రము వాటి వాటి కాపరుల స్వరమునకు మాత్రమే జవాబిచ్చేవి. మానర్స్‌ అండ్‌ కస్టమ్స్‌ ఆఫ్‌ బైబిల్‌ లేండ్స్‌ అను తన పుస్తకములో ఫ్రెడ్‌. హెచ్‌. వైట్‌ చెప్పునదేమనగా “అనేక గొర్రెమందలను వేరుచేయవలసి వచ్చినప్పుడు కాపరులు ఒకరితరువాత ఒకరు ద్వారముయొద్ద నుండి: టహు, టహు, అని లేక తనకు యిష్టమువచ్చిన పేరుతోగాని పిలుచును. అప్పుడు గొర్రెలు తలలు యెత్తి సాధారణ అరపుతో తమ స్వంత కాపరిని అనుసరించ మొదలిడును. వాటికి తమ స్వంత కాపరి స్వరము బాగుగా తెలిసియుండును. క్రొత్తవారు తరచు అదేశబ్దమును ఉపయోగించినను వాటిని తమవెంట తీసుకు వెళ్లవలెనను వారి ప్రయత్నము ఎప్పుడు విఫలమగును.” ఆసక్తిదాయకంగా యేసు యిలా చెప్పెను: “నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటినెరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను.” యోహాను (10:27, 28) “చిన్న మంద” మరియు “వేరేగొర్రెలు” యేసు స్వరమువిని, ఆయన నాయకత్వమును అనుసరించి, తన దయగల శ్రద్ధను అనుభవించును. —లూకా 12:32; యోహాను 10:16.

దేవునికి ఎప్పటికిని నమ్మకమైన కుమారుడు

క్రీస్తు ఎప్పటికిని దేవునికి నమ్మకముగా యుండి, తన భూజీవితమంతటిలో ప్రేమగల కాపరిగా మంచి మాదిరినుంచెను. తాను పునరుత్థానమైన తరువాత కనిపించినప్పటి సంఘటనలలోను తన దయ ప్రదర్శించబడినది. ఇతరుల యెడల తనకు గల ఆ దయగల శ్రద్ధయే పేతురుతో తన మందను మేపుమని చెప్పుటకు యేసును నడిపినది.—యోహాను 18:1–21:25.

వ్రేలాడదీయబడినవాడై, మరణమువరకు నమ్మకత్వమును చూపుటకు యేసు మనకు మంచి మాదిరిని ఉంచెను. “నా వస్త్రమును వారు పంచుకొనియున్నారను” ప్రవచన నెరవేర్పు ప్రకారము ఆయన బహిరంగమైన అవమానమును భరించెను. (కీర్తన 22:18) శ్రేష్టమైన తన లోపలి అంగీని ఎవరు తీసుకోవాల అని వారు దానికొరకు చీట్లువేశారు, (గ్రీకు, khiton’) ఇది కుట్టులేకుండ నేయబడినది. యోహాను (19:23, 24) అట్టి నిలువుటంగీ బహుశా, ఉన్నితో ఒకే ముక్కగా తెల్లరంగులో లేక రంగులతో నేయబడినది కావచ్చును. సాధారణముగా అట్టిది చర్మముపైనే వేసుకొనబడి మోకాళ్లవరకు లేక మెడిమల వరకు ఉండేది. యేసు వస్తువులను ప్రేమించేవాడు కాకపోయినను, ఆయన అట్టి విలువైన కుట్టులేని అంగీని వేసుకొనెను.

యేసు పునరుత్థానమైన తరువాత కనిపించిన ఒక సందర్భములో తనశిష్యులను మీకు సమాధానము కలుగుగాక” అని అభినందించెను. యోహాను (20:19) యూదులలో ఇది సహజమైన అభినందన. (మత్తయి 10:12, 13) అనేకులకు అవి ఒక భావములేని మాటలుగా యుండవచ్చును. అయితే యేసుకు అట్లుకాదు. ఎందుకనగా ఆయన తన అనుచరులతో: “సమాధానము మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను, నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాన”ని చెప్పెను. (యోహాను 14:27) యేసు తన శిష్యులకు యిచ్చిన సమాధానము ఆయనను దేవుని కుమారునిగా విశ్వసించుటపై ఆధారపడి వారి హృదయములను, మనస్సులను శాంతిపరచుటకై పనిచేసెను.

అలాగే మనమును “దేవుని సమాధానము” ను అనుభవించవచ్చును. తన ప్రియకుమారుని ద్వారా యెహోవాతో సన్నిహిత సంబంధమునుండి కలుగు పోల్చగరాని ఆ సమాధానమును మనము కాపాడుకొందుముగాక!—ఫిలిప్పీ 4:6, 7. (w90 3/15)

[27వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి