కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 12/1 పేజీలు 15-20
  • నిజమైన ప్రేమ ప్రతిఫలదాయకమైనది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిజమైన ప్రేమ ప్రతిఫలదాయకమైనది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన అత్యంతశ్రేష్టమైన మాదిరి
  • యేసుయొక్క శ్రేష్టమైన మాదిరి
  • పౌలు మాదిరి
  • మనదినములలో నిజమైన ప్రేమ ప్రతిఫలదాయకమైయున్నది
  • నిజమైన ప్రేమ మరియు మన పరిచర్య
  • ఇతర మార్గములందును ప్రతిఫలదాయకము
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “వీటన్నిటిలో గొప్పది ప్రేమ”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 12/1 పేజీలు 15-20

నిజమైన ప్రేమ ప్రతిఫలదాయకమైనది

“మీరు చేసిన కార్యమును. . .తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.

1, 2. నిజమైన ప్రేమ మనకెందుకు వ్యక్తిగతముగా ప్రతిఫలదాయకమైనది?

నిస్వార్థమైన ప్రేమ మనము ప్రదర్శించగల అత్యున్నతమైన, ప్రశంశనీయమైన, అమూల్యమైన లక్షణమైయున్నది. ఈ ప్రేమ (గ్రీకు, అ.గా’పే) మనలనెంతో ఎడతెగక కోరుచున్నది. మనము న్యాయము మరియు ప్రేమగల దేవునిచే సృష్టింపబడియున్నందున నిస్వార్థమైన ప్రేమ నిజముగా ప్రతిఫలదాయకమైనదిగా మనము కనుగొందుము. ఈ విధముగా ఎందుకు?

2 నిజమైనప్రేమ ప్రతిఫలదాయకమైనదిగా ఉండుటకు ఒక కారణమేమనగా అందు ఇమిడియున్న మానసిక మరియు శారీరిక ప్రభావ సూత్రము. అనగా మన శరీరములపై మన తలంపుల మరియు భావోద్రేకముల ప్రభావము. వ్యధనుగూర్చి ఒక అధికార ప్రకటన ఇట్లు చెప్పెను: “‘నీ పొరుగువాని ప్రేమించుము’ అనునది, ఇవ్వబడిన వైద్యసలహాలన్నిటిలో అత్యంత జ్ఞానయుక్తమైనది.” అవును, “దయగలవాడు తనకే మేలు చేసికొనును.” (సామెతలు 11:17) అదే భావమునిచ్చు మరొక మాటలు ఇట్లున్నవి: “ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లుపోయువారికి నీళ్లుపోయబడును.”—సామెతలు 11:25; లూకా 6:38ని పోల్చుము.

3. నిజమైన ప్రేమను ప్రతిఫలదాయకమైనదిగా చేయుటకు దేవుడెట్లు చర్యతీసికొనును?

3 నిస్వార్థత్వమునకు దేవుడు ఫలము దయచేయును గనుకను ప్రేమ ప్రతిఫలదాయకమైనదైయున్నది. మనమిట్లు చదువుదుము: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారముచేయును.” (సామెతలు 19:17) యెహోవాసాక్షులు దేవుని రాజ్యసువార్తను ప్రకటించునప్పుడు ఈ వాక్యమునకు అనుగుణ్యముగా పనిచేయుచున్నారు. ఎందుకనగా ‘వారి పనినిగాని, ఆయన నామముయెడల వారు చూపు ప్రేమనుగాని మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడ’ని వారికి తెలియును.—హెబ్రీయులు 6:10.

మన అత్యంతశ్రేష్టమైన మాదిరి

4. నిజమైన ప్రేమ ప్రతిఫలదాయకమనుటకు శ్రేష్టమైన మాదిరినెవరు అందించుచున్నారు, మరియు ఆయన ఆవిధముగా ఎట్లు చేసెను?

4 నిజమైన ప్రేమ ప్రతిఫలదాయకమైయున్నదనుటకు మనకు ఎవరు అత్యంతశ్రేష్టమైన మాదిరి నుంచుచున్నారు? ఎందుకు, ఎవరివలనోకాక, ఇది దేవునివలననే దయచేయబడియున్నది! ఆయన ‘లోకమును (మానవజాతితోనిండిన) ఎంతో ప్రేమించి తన అద్వితీయకుమారుని అనుగ్రహించెను.’ (యోహాను 3:16) ఆ విమోచనక్రయధనమును అంగీకరించువారందరు నిత్యజీవమును పొందునట్లు తన కుమారుని యిచ్చుట స్వల్పమైనదేమికాక, యెహోవా నుండి అది ఎంతో కోరునదైయుండెను. స్పష్టముగా అది ఆయన ప్రేమ మరియు సానుభూతిని కలిగియున్నాడని చూపినది. ‘ఐగుప్తునందలి ఇశ్రాయేలీయుల యావద్బాధలో ఆయన బాధనొందుటనుబట్టి’ ఇంకనూ ఇది మరియెక్కువగా విశదమగుచున్నది. (యెషయా 63:9) హింసా మ్రానుపై తన కుమారుడు బాధనొందుచు, “నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యివిడిచితివి?” అని మొరపెట్టుటను వినుట ఆయనకు ఎంత బాధకరముగా ఉండియుండును?—మత్తయి 27:46.

5. దేవుడు తనకుమారుని బలిగా అర్పించునంతగా మానవజాతిని ప్రేమించుటనుబట్టి ఏమి జరిగియున్నది?

5 యెహోవా తాను స్వయముగా ప్రదర్శించిన నిజమైన ప్రేమను ప్రతిఫలదాయకమైనదిగా కనుగొన్నాడా? ఎంతో నిశ్చయముగా ఆయనట్లు కనుగొనెను. అతి ప్రధానముగా, యేసు, సాతాను తనకెన్ని చేసినను ఆయన నమ్మకస్థునిగా రుజువుపరచుకొనినప్పుడు సాతానుకు దేవుడు దానిముఖము యెదుటనే ఎంతటి జవాబునివ్వగలిగెను! (సామెతలు 27:11) వాస్తవమునకు, యెహోవా నామముపైగల దూషణనంతటిని తీసివేయుటకు దేవునిరాజ్యము చేయునదంతయు, భూమిని పరదైసుగా తిరిగిస్థాపించుటయు, కోట్లకొలది మానవులకు నిత్యజీవమిచ్చుటయు కేవలము దేవుడు తన హృదయమునకు అత్యంత ప్రియమైన సొత్తును బలిగా అర్పించునంతగా మానవజాతిని ప్రేమించుటనుబట్టియే జరుగుచున్నది.

యేసుయొక్క శ్రేష్టమైన మాదిరి

6. ప్రేమ యేసును ఏమి చేయుటకు పురికొల్పినది?

6 నిజమైన ప్రేమ ప్రతిఫలదాయకమని రుజువుపరచుటకు మరొక మంచిమాదిరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన తన పరలోకపు తండ్రిని ప్రేమించుచున్నాడు. మరియు ఆ ప్రేమ అన్ని పరిస్థితులయందును యెహోవా చిత్తమును చేయుటకు యేసును కదలించినది. (యోహాను 14:31; ఫిలిప్పీయులు 2:5-8) కొన్నిసార్లు ఆయనకు అది తన తండ్రిని “మహారోదనముతోను కన్నీళ్లతోను” యాచించవలసిన స్థితిని కలుగజేసినను, యేసు దేవునియెడలగల తనప్రేమను చూపుతునేయుండెను.—హెబ్రీయులు 5:7.

7. యేసు ఏ విధముగా నిజమైన ప్రేమను ప్రతిఫలదాయకముగా కనుగొనెను?

7 అట్టి స్వయంత్యాగపూరితమైన ప్రేమకు యేసు ప్రతిఫలము పొందాడా? నిజముగా పొందాడు! తన మూడున్నర సంవత్సరముల పరిచర్యలో తాను చేసిన మంచిపనులన్నిటినుండి ఆయన పొందిన ఆనందమునుగూర్చి తలంచుము. ఆత్మీయముగా మరియు భౌతికముగా ఆయన ప్రజలకు ఎంతగా సహాయముచేసెను! అన్నిటికంటె ఎక్కువగా, సాతాను తనకు వ్యతిరేకముగా ఏమి తెచ్చినను పరిపూర్ణమానవుడు పరిపూర్ణముగా దేవునియెదుట తన యథార్థతను కాపాడుకొనగలడని నిరూపించుటద్వారా, అపవాదిని అబద్ధికుడని నిరూపించిన సంతృప్తిని యేసు కలిగియుండెను. అంతేగాక, దేవుని నమ్మకమైన సేవకునిగా పరలోకజీవితమునకు పునరుత్థానమైన తరువాత గొప్ప ప్రతిఫలమైన అమర్త్యతను యేసు పొందెను. (రోమీయులు 6:9; ఫిలిప్పీయులు 2:9-11; 1 తిమోతి 6:15, 16; హెబ్రీయులు 1:3, 4) మరియు ఆయనయెదుట ఆర్మగెద్దోనుయందును, భూమిపరదైసుగా తిరిగి తేబడి, కోట్లాదిమంది మృతులనుండి లేపబడు వెయ్యేండ్ల పరిపాలనలోను ఎంతటి అద్భుతమైన ఆధిక్యతలు ఉన్నవి! (లూకా 23:43) నిశ్చయముగా నిజమైన ప్రేమను యేసు ప్రతిఫలదాయకముగా కనుగొనెననుటలో ఏ ప్రశ్నయులేదు.

పౌలు మాదిరి

8. దేవునియెడల మరియు తన తోటిమానవునియెడల నిజమైన ప్రేమను కల్గియున్నందుకు పౌలుయొక్క అనుభవమేమైయుండెను?

8 ఒకసారి పేతురు యేసును: “ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని” అడిగెను. అందుకు యేసు: “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు ఎన్నోరెట్లు అధికముగా పొందును, ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనునని” చెప్పెను. (మత్తయి 19:27-29 NW) ఈ విషయములో అపొస్తలుడైన పౌలుయందు మనము బలముగా ప్రభావితముచేయగల మాదిరిని కలిగియున్నాము. ప్రత్యేకముగా లూకాచే అపొస్తలులకార్యముల పుస్తకములో వ్రాయబడినట్లుగా ఆయన అనేక ఆశీర్వాదములను అనుభవించెను. దేవునియెడల మరియు తోటిమానవునియెడల ఆయనకుగల నిజమైనప్రేమ ఒక గౌరవింపబడిన పరిసయ్యునిగా తన వృత్తిని విడిచిపెట్టునట్లు ఆయనను చేసెను. అంతేగాక పిడిగుద్దులు, మరణమునకు చేరువచేసిన సంఘటనలు, అపాయములు, ఏకాంతములను ఆయన సహించిన విధమును ఆలోచించుము. ఇదంతయు దేవునియెడల మరియు ఆయన పరిశుద్ధసేవయెడలగల నిజమైన ప్రేమవలననే సాధ్యమాయెను.—2 కొరింథీయులు 11:23-27.

9. నిజమైన ప్రేమను ప్రదర్శించినందుకు పౌలు ఎట్లు ప్రతిఫలము పొందెను?

9 నిజమైన ప్రేమను ప్రదర్శించుటలో అట్టి శ్రేష్టమైన మాదిరియైనందుకు పౌలుకు యెహోవా ప్రతిఫలమిచ్చాడా? తన పరిచర్యలో పౌలు ఎంత ఫలవంతముగా ఉండెనో ఆలోచించుము. ఆయన ఒకదానివెంట మరొక క్రైస్తవ సంఘమును స్థాపించగలిగెను. మరియు ఎటువంటి అద్భుతములను చేయునట్లు దేవుడు ఆయనకు శక్తినిచ్చెను! (అపొస్తలుల కార్యములు 19:11, 12) పౌలు పరలోకసంబంధమైన దర్శనములనుచూడగలిగి, క్రైస్తవ గ్రీకు లేఖనములలో భాగమైన 14 పత్రికలను వ్రాయు ఆధిక్యతను కూడా పొందెను. వీటన్నిటికంటె మిన్నగా పరలోకములో అమర్త్యతను పొందు బహుమానము ఆయనకు యివ్వబడినది. (1 కొరింథీయులు 15:53, 54; 2 కొరింథీయులు 12:1-7; 2 తిమోతి 4:7, 8) నిజమైన ప్రేమకు దేవుడు ఫలమిచ్చునని పౌలు నిశ్చయముగా కనుగొనెను.

మనదినములలో నిజమైన ప్రేమ ప్రతిఫలదాయకమైయున్నది

10. యేసు శిష్యులమై యెహోవాయెడల మన ప్రేమను కనపరచుటకు ఎంతటి విలువను చెల్లించుట అవసరము కావచ్చును?

10 అలాగే యెహోవాసాక్షులు నేడును నిజమైన ప్రేమను ప్రతిఫలదాయకమైనదిగా కనుగొన్నారు. మనము ఆయన పక్షమున నిలబడి యెహోవాయెడల మన ప్రేమను కనపరస్తూ యేసు శిష్యులగుటద్వారా, యథార్థతను కాపాడుకొనువారముగా మన ప్రాణములనుకూడా పెట్టవలసిన స్థితి ఏర్పడవచ్చును. (ప్రకటన 2:10 ని పోల్చుము.) అందుకే యేసు మనము తగులుబడిని లెక్కచూచుకొనవలెనని చెప్పెను. అయితే శిష్యునిగా ఉండుట ఫలదాయకమా కాదా అని నిర్ణయించుకొనుటకు మనము తగులుబడిని లెక్కచూచుకొనము. బదులుగా శిష్యత్వము మనలను ఏమి కోరినను దానిని చెల్లించునట్లు సిద్ధపడుటకు మనము అలా చేయుదుము.—లూకా 14:28.

11. కొందరెందుకు తమ్మును తాము దేవునికి సమర్పించుకొనుటకు తప్పిపోవుదురు?

11 ఈనాడు అనేకులు, నిశ్చయంగా లక్షలకొలది, దేవునివాక్యమునుండి యెహోవాసాక్షులు తమయొద్దకు తెచ్చు వర్తమానమును నమ్ముదురు. అయితే తమ్మును తాము దేవునికి సమర్పించుకొని బాప్తిస్మము పొందుటకు వారు వెనుకాడుదురు. ఇది, దేవునియెడల ఇతరులు కలిగియున్న నిజమైన ప్రేమను వారు కలిగియుండక పోవుటనుబట్టియా? అనేకులు అవిశ్వాసియైన తమ జత యిష్టముచొప్పున నడచుకొనుటకు, సమర్పణ మరియు బాప్తిస్మపు చర్యలు తీసికొనుటకు తప్పిపోవుదురు. ఒక వ్యాపారస్థుడు సాక్షితో: “నాకు పాపమంటె యిష్టము” అని చెప్పాడు. కావున మరికొందరు ఈ వ్యాపారస్థునిలాంటి స్వభావమును కలిగియున్నందున దేవునికి సమీపస్థులుగా రారు. స్పష్టముగా, అటువంటి వ్యక్తులు దేవుడు మరియు యేసుక్రీస్తు వారికొరకు చేసిన దానినంతటిని మెచ్చుకొనరు.

12. నిజమైన ప్రేమయందు మనలను దేవునికి సమీస్థులనుగా చేయు జ్ఞానముయొక్క ఉన్నతాంశములనుగూర్చి ఈ పత్రిక ఏమి చెప్పినది?

12 దేవుడు మరియు యేసుక్రీస్తు మనకొరకు చేసియున్నదానంతటియెడల నిజమైన మెప్పుదలను కలిగియుంటే, మన పరలోకపు తండ్రిని సేవించుటకు మరియు యేసు శిష్యులముగా ఉండుటకు అవసరమైన దేనినైను యిష్టపూర్వకంగా చేయుటద్వారా దానిని చూపించుదుము. దేవునియెడల తమకుగల నిజమైన ప్రేమనుబట్టి సమస్త జీవితవిధానములలోవున్న పురుషులు మరియు స్త్రీలు అనగా విజయవంతమైన వ్యాపారస్థులు, పేరుగాంచిన క్రీడాకారులు, మొదలగువారు తమ స్వయం శ్రద్ధకొరకే ఉన్నట్లున్న వృత్తులను అపొస్తలుడైన పౌలువలెనె మార్చుకొన్నారు. దేవుని తెలిసికొని ఆయనను సేవించుటవలన లభించు ప్రతిఫలముల స్థానమును పొందుటకు వేరేదేనిని వారు అంగీకరించరు. ఈ విషయంలో ది వాచ్‌టవర్‌ ఒకప్పుడు ఇట్లు చెప్పినది: “కొన్నిసార్లు మేము, సహోదరులను, తాము తెలుసుకొనిన సత్యమునకు మారుగా వెయ్యిడాలర్లు తీసుకొనటకు ఎంతమంది యిష్టపడతారని అడిగాము? దానికి ఎవరు తమచేతులు చూపలేదు. పదివేల డాలర్లు ఎవరు తీసుకొంటారు? అని అడుగగా ఎవరు లేదు. తాము తెలుసుకొనిన దైవిక లక్ష్యణము, దైవ పథకమునకు మారుగా పదివేల డాలర్లు ఎవరు తీసుకొంటారు? లేక లోకమంతటిని ఎవరు తీసుకొంటారు? అని అడుగగా ఎవరు కనపడలేదు! అప్పుడు మేము ప్రియమైన స్నేహితులారా, నిశ్చయంగా మీరు ఎంతో అసంతృప్తితో నిండిన ప్రజలు కారు. మీరు తెలుసుకొనిన దేవుని జ్ఞానమునకు మారుగా దేనిని అంగీకరించలేనంతటి ధనవంతులైయున్నట్లయిన, మేము ఎంతటి ధనవంతులమని భావిస్తున్నామో అలాగే మీరును భావిస్తున్నారు.” (డిశంబరు 15, 1914, పేజి 377) అవును, దేవునిగూర్చిన మరియు ఆయన సంకల్పములనుగూర్చిన సరైనజ్ఞానము నిశ్చయముగా మనలను ప్రతిఫలదాయకమైన ప్రేమయందు దేవునికి సమీపస్థులనుగా చేయుచున్నది.

13. వ్యక్తిగత పఠనమును మనమెట్లు దృష్టించవలెను?

13 మనము దేవుని ప్రేమించినట్లయిన, ఆయన చిత్తమును తెలుసుకొని దానిచేయుటకు మనము పోరాడుదుము. (1 యోహాను 5:3) వ్యక్తిగత పఠనము, ప్రార్థన, క్రైస్తవ కూటములకు హాజరగుటనుగూర్చి మనము గంభీరమైన దృష్టిని కలిగియుందుము. వీటన్నిటికి స్వయం-త్యాగము అవసరము. ఎందుకనగా ఈ పనులలో సమయము, శక్తి, మరియు వ్యక్తిగత మూలములను వ్యయపరచుట ఇమిడియున్నది. వ్యక్తిగత పఠనముచెయ్యాలా, లేక టివి., కార్యక్రమము చూడాలా అనువాటిలో ఒకదానిని ఎన్నుకోవలసి వస్తుంది. అయితే అటువంటి పఠనమును తీవ్రమైనదానిగాయెంచి దానికి కావలసినంత సమయమును కేటాయించిన, మనము ఆత్మీయముగా ఎంత బలముగా తయారగుదుము, ఎంతబాగుగా ఇతరులకు సాక్ష్యమివ్వగలుగుదుము, ఎంత ఎక్కువగా క్రైస్తవ కూటములనుండి ప్రయోజనము పొందుదుము!—కీర్తన 1:1-3.

14. ప్రార్థన మరియు యెహోవాదేవునితో మంచి సంబంధము ఎంత ప్రాముఖ్యము?

14 ‘ప్రార్థనలో పట్టుదల’ కలిగియుండుటద్వారా మన పరలోకపు తండ్రితో మాట్లాడుటను మనము క్రమముగా ఆనందించెదమా? (రోమీయులు 12:12) లేక తరచు ఈ అమూల్యమైన ఆధిక్యతకు న్యాయము జరిగించలేనంతటి పనితొందరలో తీరికలేకయున్నామా? యెహోవా దేవునితో మన సంబంధమును బలపరచుకొనుటకు ‘యెడతెగక ప్రార్థించుట’ ఒక ప్రాముఖ్య మార్గమైయున్నది. (1 థెస్సలొనీకయులు 5:17) మరియు మనము శోధనలను ఎదుర్కొనినప్పుడు యెహోవాతోగల మంచి సంబంధముకంటె మనకు బాగుగా సహాయపడగలది మరేదియు లేదు. పోతిఫరు భార్యవలన శోధించబడినప్పుడు దానిని ఎదిరించుటకు యోసేపుకు సహాయపడినదేమి? యెహోవాకు విన్నపముచేయుటను మాదీయ పారశీకుల ఆజ్ఞ నిషేధించినప్పుడు, ప్రార్థన చేయకుండ దానియేలు ఎందుకు మానుకొనలేదు? (ఆదికాండము 39:7-16; దానియేలు 6:4-11) ఆ మనుష్యులకు దేవునితోగల మంచి సంబంధము విజయవంతులుగా నిలబడుటకు వారికి సహాయపడినది. నేడు మనమును అలాగేచేయుటకు అది సహాయపడును.

15. క్రైస్తవకూటములను మనమెట్లు దృష్టించవలెను, మరియు ఎందుకు?

15 ఇదియేగాక, వారపు ఐదు కూటములకు హాజరుగుటను మనము ఎంత గంభీరముగా తీసుకొందుము? అలసిపోవుటను, ఏదోకొంచెము శరీరకంగా బాగలేకపోవుటను, లేక కొంచెము వాతావరణము బాగుగా లేక పోవుటను, తోటివిశ్వాసులతో సమాజముగా కూడుట మానకూడదు అను మన బాధ్యతకు ఆటంకముగా నిలుచుటకు మనము అనుమతించెదమా? (హెబ్రీయులు 10:24, 25) మంచి జీతమును పొందు ఒక అమెరికా దేశపు యాంత్రిక నిపుణుడు తన ఉద్యోగము పదేపదే క్రైస్తవకూటములకు హాజరగుటకు ఆటంకముగా ఉంటున్నట్లు గమనించాడు. కావున ఆర్థికంగా నష్టమును భరించి, క్రైస్తవ కూటములన్నిటికి క్రమముగా హాజరగునట్లు ఆయన తన ఉద్యోగమును మార్చుకున్నాడు. మన కూటములు ఒకరి ప్రోత్సాహమునుబట్టి మరొకరము ఆనందించుటకును, ఒకరియొకరి విశ్వాసమును బలపరచుకొనుటకును సహాయపడును. (రోమీయులు 1:11, 12) ఈ విషయములన్నిటిలో “విస్తారముగా విత్తువాడు విస్తారముగా కోయున”ను దానిని చూడమా? (2 కొరింథీయులు 9:6) అవును, ఆ మార్గములందును నిజమైన ప్రేమను ప్రదర్శించుట ఎంతో ప్రతిఫలదాయకమైనది.

నిజమైన ప్రేమ మరియు మన పరిచర్య

16. ప్రేమ మనలను తటస్థముగా సాక్ష్యమిచ్చుటకు నడిపినయెడల ఏ ఫలితమురావచ్చును?

16 యెహోవా ప్రజలుగా సువార్తను ప్రకటించుటకు మనలను ప్రేమ ప్రేరేపించును. ఉదాహరణకు అది మనలను తటస్థసాక్ష్యములో పాల్గొనుటకు నడిపించును. తటస్థంగా సాక్ష్యమిచ్చుటకు మనము వెనుకాడవచ్చును. అయితే ప్రేమ మనలను మాట్లాడుటకు బలవంతపెడుతుంది. ప్రేమ నిజముగా, సంభాషణను ప్రారంభించుటకు కావలసిన నేర్పుగల మార్గమునులను వెదకుటకు కారణమై చివరకు దానిని రాజ్యమువైపు నడుపునట్లు మనలను చేయును. దీనిని వివరించుటకు: ఒకసారి విమానములో ప్రయాణముచేస్తుండగా, ఒక పెద్ద, తనప్రక్క ఒక కేథలిక్‌ మతగురువు కూర్చొనడం గమనించాడు. పెద్ద మొదట ఆ మతగురువును నొప్పించుకొనని ప్రశ్నలను అడిగాడు. విమానము దిగే సమయానికి మతగురువు ఆసక్తి ఆయనను రెండు పుస్తకములను తీసుకొనే లాగున పురికొల్పినది. తటస్థంగా సాక్ష్యమిచ్చినందుకు ఎంతటి మంచి ఫలితము!

17, 18. క్రైస్తవ పరిచర్య సంబంధముగా ప్రేమ మనలనేమి చేయుటకు నడిపించును?

17 నిజమైన ప్రేమ మనలను ఇంటింటి సువార్త పనిచేయుటకు క్రెస్తవపరిచర్యయొక్క ఇతర రూపకార్యక్రమములను చేయుటకు పురికొల్పుతుంది. మనమెంత ఎక్కువగా బైబిలు చర్చలను కలిగియుండగలిగితే అంత ఎక్కువగా యెహోవాదేవునికి ఘనత తీసుకురాగలిగి, గొర్రెలాంటివారు నిత్యజీవమార్గమును కనుగొనునట్లు సహాయపడగలము. (మత్తయి 7:13, 14 పోల్చుము) ఒకవేళ మనము బైబిలు చర్చలను కలిగియుండలేకపోయినను, మన ప్రయత్నములు వ్యర్థమైనవిగా ఉండవు. మనము కేవలము గృహములముందు కనపడుటయే, ప్రజలకు సాక్ష్యముగా పనిచేయును, మరియు మనమట్టుకు మనమును పరిచర్యవలన ప్రయోజనము పొందుదుము. ఎందుకనగా మన విశ్వాసమును బలపరచుకొనకుండ, మనము బైబిలు సత్యములను ప్రకటించలేము. ఇంటింటికి వెళ్లుటకు నిజముగా మనకు దీనత్వము అవసరమవుతుంది, ‘సువార్తలో వారితో పాలివారమగుటకై దానికొరకే మనము సమస్తమును చేయుచున్నాము’ (1 కొరింథీయులు 9:19-23) దేవునియెడల మరియు తోటిమానవులయెడలగల ప్రేమనుబట్టి మనము దీనత్వముతో కృషిచేసి, తద్వారా అధికమైన ఆశీర్వాదములను పొందుదుము.—సామెతలు 10:22.

18 మరియు బైబిలు సత్యముయెడల ఆసక్తిగలవారిని పునర్దర్శించుటలో మనఃపూర్వక శ్రద్ధ కలిగియుండుటకు కూడ యెహోవా సేవకులకు నిజమైన ప్రేమ అవసరము. వార, వారము నెల నెల బైబిలు పఠనములను జరిపించుట నిజముగా దేవునియెడల మరియు పొరుగువారియెడల ప్రేమను వ్యక్తపరచుటైయున్నది. ఈ పనికి కాలము, శక్తి, మనకున్న ఆర్థికమూలములను వ్యయపరచవలసియున్నది. (మార్కు 12:28-31) అయినను, ఈ బైబిలు విద్యార్థులలో ఒకరు బాప్తిస్మముపొందుట లేక పూర్తికాల పరిచర్యలో భాగమువహించుటను చూచినప్పుడు నిజమైన ప్రేమ నిజముగా ప్రతిఫలదాయకమైనదని ఒప్పించబడమా?—2 కొరింథీయులు 3:1-3ను పోల్చుము.

19. ప్రేమకు మరియు పూర్తికాల సేవకు మధ్య ఏ సంబంధము కలదు?

19 నిజమైన ప్రేమ వస్తుసంబంధమైన సౌకర్యములను త్యాగముచేసి సాధ్యమైన యెడల పూర్తికాలసేవలో ప్రవేశించుటకు అది మనలను పురికొల్పును. ఆమట్టుకు తమ ప్రేమను వ్యక్తపరచిన వేలకొలది సాక్షులు తమకు నిజముగా అది ఎంతో ప్రతిఫలదాయకముగా నున్నదని సాక్ష్యమివ్వగలరు. పూర్తికాల పరిచర్యలో భాగమువహించుటకు పరిస్థితులు అనుమతించినను, వాటిని మీరు ఉపయోగించుకొనకపోయినప్పుడు, మీరు ఎటువంటి ఆశీర్వాదములను పోగొట్టుకొంటున్నారో మీకే తెలియదు.—మార్కు 10:29, 30 ని పోల్చుము.

ఇతర మార్గములందును ప్రతిఫలదాయకము

20. ప్రేమ మనలను క్షమించువారిగా నుండునట్లు ఎట్లు సహాయపడగలదు?

20 నిజమైనప్రేమ మనకు ప్రతిఫలదాయకముగా ఉండు మరొక మార్గమేమనగా అది మనలను క్షమించువారముగా ఉండుటకు సహాయపడును. అవును, ప్రేమ “అపకారమును మనస్సులో ఉంచుకొనదు.” నిజమునకు “ప్రేమ అనేక పాపములను కప్పును.” (1 కొరింథీయులు 13:5; 1 పేతురు 4:8) “అనేకము” అనగా అనేక పాపములు అని భావము కాదా? మరియు క్షమించువారముగా ఉండుట ఎంతటి ప్రతిఫలదాయకము! నీవు క్షమించినప్పుడు అది నిన్ను మరియు క్షమించబడినవారిని మంచి భావముతో నిండుకొనియుండునట్లు చేయును. అంతకంటె ప్రాముఖ్యమైన సత్యమేమనగా మనము ఇప్పటికే మనయెడల పాపము చేసినవారిని క్షమించియుండకపోయినట్లయిన మనలను యెహోవా క్షమించునని కనిపెట్టజాలము.—మత్తయి 6:12; 18:23-35.

21. నిజమైన ప్రేమ మనము లోబడువారముగా నుండునట్లు ఎట్లు సహాయపడగలదు?

21 అంతేగాక నిజమైన ప్రేమ ఎందుకు ప్రతిఫలదాయకమైనదనగా, అది మనలను లోబడువారముగాయుండునట్లును సహాయముచేయును. ఆయన బలమైన హస్తము క్రింద మనలను మనమే దీనులనుగా ఉంచుకొందుము. (1 పేతురు 5:6) ఆయనయెడలగల ప్రేమ, తాను ఏర్పరచుకొనిన సాధనమగు “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసునికి” లోబడునట్లును మనలను నడిపించును. ఇందులో సంఘమునకు నాయకత్వము వహించు వారికి లోబడుట కూడ ఇమిడియున్నది. ఇది ప్రతిఫలదాయకము. ఎందుకనగా అలా చేయనియెడల మనకు “హానికరము.” (మత్తయి 24:45-47; హెబ్రీయులు 13:17 NW) ఔను, లోబడియుండు ఈ సూత్రము కుటుంబవలయములోను వర్తిస్తుంది. అట్టి విధానము ఎందుకు ప్రతిఫలదాయకమనగా అది కుటుంబ ఆనందమును, సమాధానమును, అనుగుణ్యతను కలుగజేసి దేవుని మనము సంతోషపరస్తున్నామని తెలుసుకొనుటవలన కలుగు సంతృప్తిని ఇస్తుంది.—ఎఫెసీయులు 5:22; 6:1-3.

22. మనము ఎట్లు నిజముగా సంతోషముగలవారమై యుండగలము?

22 కావున స్పష్టముగా, మనము వృద్ధిచేసికొనవలసిన అత్యున్నతమైన లక్షణము నిస్వార్థమైన మరియు సూత్రముపై ఆధారపడిన అ.గా’పే ప్రేమయైయున్నది. కావున ప్రేమగల మన దేవుడైన యెహోవా మహిమార్థమై ఈ లక్ష్యణమును సాధకము చేసికొనుచు ప్రదర్శించినయెడల మనము సంతోషభరితులమగుదుము. (w90 11/15)

మీరెట్లు ప్రత్యుత్తరమిత్తురు?

◻ ఏయే విధములుగా యెహోవాదేవుడు నిజమైన ప్రేమను ప్రదర్శించెను?

◻ యేసుక్రీస్తువలన ప్రేమ ఎట్లు చూపబడియున్నది?

◻ నిజమైన ప్రేమను చూపుటలో అపొస్తలుడైన పౌలు ఏ మాదిరిని చూపెను?

◻ యెహోవాసాక్షులెట్లు ప్రేమను ప్రదర్శించుచున్నారు?

◻ నిజమైన ప్రేమ ప్రతిఫలదాయకమైనదని మీరెందుకు చెప్పుదురు?

[16వ పేజీలోని చిత్రాలు]

మానవజాతియెడల యెహోవాకుగల ప్రేమ మనము నిత్యజీవము పొందుటకై తనకుమారుని పంపునట్లు కదలించెను. అట్టి నిజమైనప్రేమను నీవు మెచ్చుకొందువా?

[18వ పేజీలోని చిత్రాలు]

యెహోవాయెడలగల నిజమైన ప్రేమ “ప్రార్థనలో పట్టుదలగలిగియుండునట్లు” మనలను నడిపించును

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి