కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 17 పేజీ 44-పేజీ 45 పేరా 1
  • యేసు రాత్రిపూట నీకొదేముకు బోధించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు రాత్రిపూట నీకొదేముకు బోధించాడు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీకొదేమునకు బోధించుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • నీకొదేము నుండి ఒక పాఠం నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • తిరిగి జన్మించిన వారెవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 17 పేజీ 44-పేజీ 45 పేరా 1
యేసు రాత్రిపూట నీకొదేముతో మాట్లాడుతున్నాడు

17వ అధ్యాయం

యేసు రాత్రిపూట నీకొదేముకు బోధించాడు

యోహాను 2:23–3:21

  • యేసు నీకొదేముతో మాట్లాడాడు

  • ‘మళ్లీ పుట్టడం’ అంటే అర్థం ఏంటి?

సా.శ. 30 పస్కా పండుగ కోసం యేసు యెరూషలేములో ఉన్నప్పుడు గొప్ప సూచనలు లేదా అద్భుతాలు చేశాడు. దాంతో చాలామంది ఆయనమీద విశ్వాసం ఉంచారు. నీకొదేము అనే పరిసయ్యుడు కూడా ఎంతో ముగ్ధుడయ్యాడు. అతను, యూదుల ఉన్నత న్యాయస్థానమైన మహాసభ సభ్యుడు. అతను యేసు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్లాడు. బహుశా, మిగతా యూదా నాయకులు చూస్తే తన పేరు పాడవుతుందనే భయంతో రాత్రిపూట వెళ్లాడు.

నీకొదేము యేసుతో ఇలా అన్నాడు: “రబ్బీ, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివని మాకు తెలుసు. దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరూ నువ్వు చేస్తున్న ఈ అద్భుతాలు చేయలేరు.” దానికి యేసు, ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ‘మళ్లీ పుట్టాలి’ అని చెప్పాడు.—యోహాను 3:2, 3.

ఒక వ్యక్తి మళ్లీ ఎలా పుట్టగలడు? నీకొదేము ఇలా అడిగాడు: “అతను మళ్లీ తన తల్లి గర్భంలోకి ప్రవేశించి పుట్టగలడా?”—యోహాను 3:4.

మళ్లీ పుట్టడం అంటే అర్థం అది కాదు. యేసు ఇలా వివరించాడు: “ఒక వ్యక్తి నీళ్లవల్ల, పవిత్రశక్తివల్ల పుడితేనే తప్ప దేవుని రాజ్యంలోకి వెళ్లలేడు.” (యోహాను 3:5) యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన మీదికి పవిత్రశక్తి వచ్చింది, అలా ఆయన “నీళ్లవల్ల, పవిత్రశక్తివల్ల” పుట్టాడు. అంతేకాదు, అప్పుడు పరలోకం నుండి ఈ ప్రకటన వినబడింది: “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.” (మత్తయి 3:16, 17) అలా, ఇప్పుడు యేసు ఒక ప్రత్యేకమైన విధంగా తనకు కుమారుడయ్యాడని, తిరిగి పరలోక రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం ఆయనకు ఉందని యెహోవా తెలియజేశాడు. తర్వాత సా.శ. 33 పెంతెకొస్తు రోజున, బాప్తిస్మం తీసుకున్న ఇతరుల మీదికి కూడా పవిత్రశక్తి వస్తుంది. అలా వాళ్లు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించే అవకాశమున్న దేవుని కుమారులుగా మళ్లీ పుడతారు.—అపొస్తలుల కార్యాలు 2:1-4.

రాజ్యం గురించి యేసు చెప్తున్న విషయాల్ని నీకొదేము అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే, దేవుని మానవ కుమారునిగా తనకున్న ప్రత్యేకమైన పాత్ర గురించి ఇంకా వివరిస్తూ, యేసు ఇలా అన్నాడు: “మోషే ఎడారిలో సర్పాన్ని పైకెత్తినట్టే మానవ కుమారుడు కూడా ఎత్తబడాలి. దానివల్ల, ఆయన్ని నమ్మే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందగలుగుతారు.”—యోహాను 3:14, 15.

ఇశ్రాయేలీయుల్ని విషసర్పాలు కాటేసినప్పుడు, ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్లు రాగి సర్పాన్ని చూస్తున్నారు

చాలాకాలం క్రితం ఇశ్రాయేలీయుల్ని విషసర్పాలు కాటేసినప్పుడు, వాళ్లు ప్రాణాలు కాపాడుకోవడానికి రాగి సర్పాన్ని చూడాల్సి వచ్చింది. (సంఖ్యాకాండం 21:9) అదేవిధంగా, మనుషులందరూ పాపమరణాల నుండి విడిపించబడి, శాశ్వత జీవితం పొందాలంటే దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచాలి. యెహోవా ప్రేమతో చేసిన ఆ ఏర్పాటు గురించి నొక్కిచెప్తూ, యేసు నీకొదేముతో ఇలా అన్నాడు: “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” (యోహాను 3:16) ఈ విధంగా, మనుషులు రక్షణ పొందడానికి తానే మార్గమని యేసు స్పష్టం చేశాడు. ఆయన ఆ విషయాన్ని, తన పరిచర్య మొదలుపెట్టిన దాదాపు ఆరు నెలల తర్వాత యెరూషలేములో నీకొదేముతో చెప్పాడు.

యేసు ఇంకా ఇలా చెప్పాడు: “దేవుడు లోకానికి తీర్పు తీర్చడానికి తన కుమారుణ్ణి పంపించలేదు.” అంటే మనుషులందరికీ కఠినమైన తీర్పు తీర్చి వాళ్లకు మరణశిక్ష వేయడానికి దేవుడు ఆయన్ని పంపించలేదు. బదులుగా యేసు చెప్పినట్లు, “లోకం తన కుమారుడి ద్వారా రక్షించబడాలనే ఆయన్ని పంపించాడు.”—యోహాను 3:17.

నీకొదేము ఇతరులకు భయపడి, యేసు దగ్గరికి రాత్రిపూట వచ్చాడు. అందుకే, యేసు తన సంభాషణను ఇలా ముగించాడు: “తీర్పు దీని ఆధారంగా జరుగుతుంది: నిజంగానే వెలుగు [తన జీవితం ద్వారా, బోధల ద్వారా యేసే ఆ వెలుగు అయ్యాడు] లోకంలోకి వచ్చింది. అయితే మనుషులు చెడ్డపనులు చేస్తున్నారు కాబట్టి వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. నీచమైన పనులు చేస్తూ ఉండే ప్రతీ ఒక్కరు వెలుగును ద్వేషిస్తారు; తమ పనులు బయటపడతాయని వాళ్లు వెలుగు దగ్గరికి రారు. అయితే సరైన పనులు చేసే ప్రతీ ఒక్కరు, తమ పనులు దేవుని ఇష్టప్రకారం ఉన్నాయని అందరికీ తెలిసేలా వెలుగు దగ్గరికి వస్తారు.”—యోహాను 3:19-21.

పరిసయ్యుడు, ఇశ్రాయేలు బోధకుడు అయిన నీకొదేము దేవుని సంకల్పంలో యేసు పాత్ర గురించి విన్నాడు. ఇప్పుడు దాని గురించి ఆలోచించి చర్య తీసుకుంటాడా లేదా అనేది అతని చేతుల్లోనే ఉంది.

  • నీకొదేము యేసు దగ్గరికి ఎందుకు వెళ్లాడు? రాత్రిపూటే ఎందుకు వెళ్లాడు?

  • ‘మళ్లీ పుట్టడం’ అంటే అర్థం ఏంటి?

  • యేసు “లోకానికి తీర్పు తీర్చడానికి” రాలేదంటే అర్థమేంటి?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి