-
ఆదరణ కొరకు యెహోవావైపు చూడండికావలికోట—1996 | నవంబరు 1
-
-
14. (ఎ) యేసు తాను మరణించడానికి ముందురాత్రి ఏ వాగ్దానాన్ని చేశాడు? (బి) దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చు ఆదరణ నుండి మనం పూర్తిగా ప్రయోజనం పొందాలంటే ఏమి అవసరం?
14 తన మరణానికి ముందు రాత్రి, యేసు తన నమ్మకమైన అపొస్తలులను త్వరలోనే విడనాడి, తన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లబోతున్నానని వారికి విశదపర్చాడు. ఇది వారిని కలవరపర్చి దుఃఖక్రాంతులను చేసింది. (యోహాను 13:33, 36; 14:27-31) వారు నిర్విరామంగా ఆదరించబడాల్సిన అవసరతను గుర్తిస్తూ యేసు ఇలా వాగ్దానం చేశాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.” (యోహాను 14:16, అథఃస్సూచి, NW) తాను పునరుత్థానమైన 50 రోజుల తర్వాత తన శిష్యులపై కుమ్మరించబడిన దేవుని పరిశుద్ధాత్మను యేసు ఇక్కడ సూచించాడు.a ఇతర విషయాలతోపాటు వారు శ్రమలను అనుభవిస్తున్న కాలంలో వారిని ఆదరించి, దేవుని చిత్తాన్ని చేయడంలో కొనసాగడానికి దేవుని ఆత్మ వారిని బలపర్చింది. (అపొస్తలుల కార్యములు 4:31) అయితే, అటువంటి సహాయం దానంతటదే వస్తుందని దృష్టించకూడదు. దానినుండి పూర్తిగా ప్రయోజనం పొందేందుకు, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా దయచేస్తున్న ఆదరణకరమైన సహాయం కొరకు ప్రతి క్రైస్తవుడు ఎడతెగక ప్రార్థిస్తుండాలి.—లూకా 11:13.
-
-
ఆదరణ కొరకు యెహోవావైపు చూడండికావలికోట—1996 | నవంబరు 1
-
-
a మొదటి శతాబ్ద క్రైస్తవులపైన దేవుని పరిశుద్ధాత్మ చేసిన ప్రధానమైన కార్యాలలో ఒకటి, వారిని దేవుని ఆత్మీయ దత్త పుత్రులుగాను యేసు సహోదరులుగాను అభిషేకించడమే. (2 కొరింథీయులు 1:21, 22) ఇది 1,44,000 మందియైన యేసుక్రీస్తు శిష్యులకు మాత్రమే ప్రత్యేకించబడింది. (ప్రకటన 14:1, 3) నేడు క్రైస్తవులలో అత్యధికులకు భూపరదైసుపై నిత్యజీవ నిరీక్షణ దయాపూర్వకంగా అనుగ్రహించబడింది. అభిషేకించబడకపోయినప్పటికీ వారు కూడా దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని ఆదరణను పొందుతారు.
-