కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జీవం అనే బహుమతిని విలువైనదిగా చూడండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 3. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి

      యెహోవాకు సమర్పించుకున్న క్రైస్తవులు తమ పూర్తి శక్తి-సామర్థ్యాల్ని ఉపయోగించి ఆయన సేవ చేస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే, వాళ్లు ‘తమ శరీరాల్ని దేవునికి బలిగా అప్పగిస్తారు.’ కాబట్టి వాళ్లు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. రోమీయులు 12:1, 2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

      • మీ ఆరోగ్యాన్ని ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి?

      • మీరు ఏయే విధాలుగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు?

      ఒక గర్భిణీ స్త్రీ డాక్టరుతో మాట్లాడుతోంది.
  • బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 47వ పాఠం. సమావేశంలో ఒకతను బాప్తిస్మం తీసుకోవడం చూసి, ఒక బైబిలు విద్యార్థి తన బాప్తిస్మం గురించి ఆలోచిస్తున్నాడు.

      47వ పాఠం

      బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

      బైబిలు స్టడీ ద్వారా మీరు యెహోవా గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. బహుశా, నేర్చుకున్నవాటి ప్రకారం కొన్ని మార్పులు కూడా చేసుకుని ఉంటారు. అయినా ఏదోక కారణం వల్ల మీరు యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడుతుండవచ్చు. బాప్తిస్మం తీసుకునే విషయంలో ఎదురయ్యే కొన్ని అడ్డంకులు ఏంటో, వాటిని ఎలా దాటవచ్చో ఈ పాఠంలో చూస్తాం.

      1. బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు ఎంత బైబిలు జ్ఞానం ఉండాలి?

      బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు ‘సత్యం గురించిన సరైన జ్ఞానం ఉండాలి.’ (1 తిమోతి 2:4) దానర్థం, మీకు బైబిలంతా తెలిసుండాలని కాదు. నిజానికి బాప్తిస్మం తీసుకుని చాలా సంవత్సరాలైన క్రైస్తవులు కూడా, బైబిలు గురించి నేర్చుకుంటూనే ఉంటారు. (కొలొస్సయులు 1:9, 10) అయితే, బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు ప్రాథమిక లేదా ముఖ్యమైన బైబిలు బోధలు తెలిసుండాలి. మీరు వాటిని ఎంతవరకు తెలుసుకున్నారో అర్థం చేసుకోవడానికి సంఘ పెద్దలు మీకు సహాయం చేస్తారు.

      2. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏంటి?

      బాప్తిస్మం తీసుకోవడానికి ముందు, మీరు ‘పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి.’ (అపొస్తలుల కార్యాలు 3:19 చదవండి.) దానర్థం, మీరు ఏదైనా తప్పులు చేసివుంటే వాటి విషయంలో నిజంగా బాధపడుతూ, క్షమించమని యెహోవాను అడగాలి. అలాగే చెడు ప్రవర్తనకు దూరంగా ఉండాలని, యెహోవాకు నచ్చినట్టు జీవించాలని బలంగా నిర్ణయించుకోవాలి. దాంతోపాటు సంఘ పనుల్లో పాల్గొనడం మొదలుపెట్టాలి. అంటే మీటింగ్స్‌కి హాజరౌతూ ఉండాలి, బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు అయ్యి ప్రకటిస్తూ ఉండాలి.

      3. బాప్తిస్మం తీసుకోవడానికి మీరు ఎందుకు భయపడకూడదు?

      యెహోవాకు ఇచ్చిన మాట విషయంలో తప్పిపోతామేమో అనే భయంతో కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడతారు. నిజమే, మీరు కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు. బైబిల్లోని నమ్మకమైన దేవుని సేవకులు కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేశారు. అయితే, తన సేవకులు పరిపూర్ణంగా ఉండాలని యెహోవా కోరుకోవడం లేదు. (కీర్తన 103:13, 14 చదవండి.) ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మీరు చేయగలిగినదంతా చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు! ఆయన మీకు సహాయం చేస్తాడు. నిజానికి, ‘దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరుచేయలేదని’ ఆయన అభయం ఇస్తున్నాడు.—రోమీయులు 8:38, 39 చదవండి.

      ఎక్కువ తెలుసుకోండి

      యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ, ఆయన సహాయం తీసుకుంటూ బాప్తిస్మం విషయంలో మీకున్న అడ్డంకుల్ని ఎలా దాటవచ్చో చూడండి.

      చిత్రాలు: ఒక యువతి బాప్తిస్మం విషయంలో ఎదురైన ఆటంకాల్ని అధిగమిస్తోంది. ఇవే చిత్రాలు ఈ పాఠంలో మళ్లీ వస్తాయి.

      4. యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోండి

      ఆ యువతి ఒక యెహోవాసాక్షి దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటోంది.

      బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు యెహోవా గురించి ఎంత తెలిసుండాలి? యెహోవాను ప్రేమించేంతగా, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకునేంతగా తెలిసుండాలి. ప్రపంచవ్యాప్తంగా, బైబిలు స్టడీ తీసుకున్న చాలామంది అలా తెలుసుకున్నారు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

      వీడియో: బాప్తిస్మానికి నడిపించే మార్గం (3:56)

      • బాప్తిస్మం కోసం సిద్ధపడడానికి ఈ వీడియోలో చూపించిన కొంతమంది ఏం చేశారు?

      రోమీయులు 12:2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

      • బైబిలు చెప్పేవి లేదా యెహోవాసాక్షులు చెప్పేవి నిజమో కాదో అని సందేహపడుతున్నారా?

      • ఒకవేళ సందేహపడుతుంటే, మీరేం చేయవచ్చు?

      5. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని దాటేయండి

      వాళ్లమ్మ తిడుతున్నాసరే, ఆ యువతి బైబిల్ని తన బ్యాగులో పెట్టుకుంటుంది.

      యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, మనందరికీ అడ్డంకులు ఎదురౌతాయి. ఒకామెకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయో తెలుసుకోవడానికి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

      వీడియో: యెహోవా మీద ఉన్న ప్రేమ అడ్డంకుల్ని దాటడానికి సహాయం చేస్తుంది (5:22)

      • వీడియోలో ఉన్న సహోదరి, యెహోవాను ఆరాధించడానికి ఎలాంటి అడ్డంకుల్ని దాటాల్సి వచ్చింది?

      • ఆ అడ్డంకుల్ని దాటేలా యెహోవా మీద ఉన్న ప్రేమ ఆమెకు ఎలా సహాయం చేసింది?

      సామెతలు 29:25; 2 తిమోతి 1:7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • అడ్డంకుల్ని దాటడానికి కావాల్సిన ధైర్యాన్ని ఎలా పొందవచ్చు?

      6. యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి

      ఒక పెద్ద వయసు ఆవిడకు ఆ యువతి ప్రీచింగ్‌ చేస్తోంది. ఆమెకు స్టడీ ఇచ్చిన సహోదరి పక్కనే ఉంది.

      మీకు సహాయం చేయడానికి యెహోవా సిద్ధంగా ఉంటాడు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

      వీడియో: యెహోవా దేవుడు మీకు సహాయం చేస్తాడు (2:50)

      • ఒకతను బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు వెనకాడాడు?

      • యెహోవా మీద నమ్మకం పెంచుకోవడానికి అతను నేర్చుకున్న ఏ విషయం సహాయం చేసింది?

      యెషయా 41:10, 13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • మీ సమర్పణకు తగ్గట్టు జీవించగలరని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

      7. యెహోవా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచిస్తూ, కృతజ్ఞత పెంచుకోండి

      ఆ యువతి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటోంది.

      యెహోవా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచించే కొద్దీ, ఆయన మీద కృతజ్ఞత పెరుగుతూ ఉంటుంది. అలాగే, ఎల్లప్పుడూ ఆయన్నే ఆరాధించాలనే కోరిక బలపడుతుంది. కీర్తన 40:5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • యెహోవా మీకు ఇచ్చిన ఆశీర్వాదాల్లో, ముఖ్యంగా వేటిని బట్టి మీరు కృతజ్ఞతతో ఉన్నారు?

      యిర్మీయా ప్రవక్త యెహోవాను, ఆయన వాక్యాన్ని ప్రేమించాడు. అంతేకాదు, యెహోవా పేరుతో పిలవబడే అవకాశాన్ని గొప్ప గౌరవంలా చూశాడు. యిర్మీయా ఇలా అన్నాడు: “నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఉల్లాసాన్ని ఇచ్చాయి, ఎందుకంటే . . . యెహోవా, నేను నీ పేరుతో పిలవ​బడుతున్నాను.” (యిర్మీయా 15:16) ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

      • యెహోవాసాక్షిగా ఉండడం ఎందుకు ఒక గొప్ప గౌరవం?

      • మీరు ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకోవాలని కోరుకుంటున్నారా?

      • బాప్తిస్మం తీసుకోకుండా మిమ్మల్ని ఏదైనా ఆపుతోందా?

      • బాప్తిస్మం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ఇంకా ఏం చేయాలని మీకు అనిపిస్తుంది?

      ఆ యువతి బాప్తిస్మం తీసుకుంటోంది.

      కొంతమంది ఇలా అంటారు: “బాప్తిస్మం తీసుకున్నాక నేను దానికి తగ్గట్టు జీవించలేనేమో.”

      • మీకూ అలాగే అనిపిస్తుందా?

      ఒక్కమాటలో

      యెహోవా సహాయంతో మీరు ఎలాంటి అడ్డంకులనైనా దాటి, బాప్తిస్మం అనే లక్ష్యాన్ని చేరుకోగలరు.

      మీరేం నేర్చుకున్నారు?

      • బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు ఎంత బైబిలు జ్ఞానం ఉండాలి?

      • బాప్తిస్మం తీసుకోవడానికి ముందు, మీరు ఏ మార్పులు చేసుకోవాల్సి రావచ్చు?

      • బాప్తిస్మం తీసుకోవడానికి మీరు ఎందుకు భయపడకూడదు?

      ఇలా చేసి చూడండి:

      ఇవి కూడా చూడండి

      మీరు ఏ కారణాన్ని బట్టి బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకోవాలో తెలుసుకోండి.

      “మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?” (కావలికోట, మార్చి 2020)

      మీకు ఎదురయ్యే కొన్ని అడ్డంకుల్ని ఎలా దాటవచ్చో తెలుసుకోండి.

      “నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?” (కావలికోట, మార్చి 2019)

      ఒకతను పెద్దపెద్ద అడ్డంకుల్ని దాటి ఎలా బాప్తిస్మం తీసుకున్నాడో చూడండి.

      ‘బాప్తిస్మం తీసుకోవడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?’ (1:10)

      ఒకతను మొదట్లో బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడాడు. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకునేలా అతన్ని ఏది కదిలించిందో చూడండి.

      నిజంగా నేను అర్హుడినా? (7:21)

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి