-
“ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”కావలికోట (అధ్యయన)—2017 | జూలై
-
-
14. దుఃఖంలో ఉన్నవాళ్లను మనమెలా ఓదార్చవచ్చు?
14 ఒక్కోసారి దుఃఖంలో ఉన్నవాళ్లతో ఏమి మాట్లాడాలో కూడా మనకు తెలియకపోవచ్చు. కానీ ‘జ్ఞానముగలవాని మాటలు బాధను నయం చేస్తాయి’ అని బైబిలు చెప్తోంది. (సామె. 12:18, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్‌వర్షన్) మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే అనే బ్రోషుర్‌లో ఓదార్పునిచ్చే మాటల్ని చాలామంది కనుగొన్నారు.c అయితే దుఃఖంలో ఉన్నవాళ్లకు మీరు చేయగల అత్యంత గొప్ప సహాయం ఏమిటంటే, ‘ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వడం.’ (రోమా. 12:15) గాబీ అనే సహోదరి భర్త చనిపోయాడు. కొన్నిసార్లు తన బాధను బయటకు చెప్పడానికి ఉన్న ఒకేఒక్క మార్గం ఏడ్వడమేనని ఆమె చెప్తోంది. ఆమె ఇంకా ఇలా అంటోంది, “అందుకే నా స్నేహితులు నాతోపాటు ఏడిస్తే నాకు ఊరటగా ఉంటుంది. నా బాధను పంచుకునేవాళ్లు ఉన్నారని ఆ సమయంలో నాకనిపిస్తుంది.”
-
-
“ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”కావలికోట (అధ్యయన)—2017 | జూలై
-
-
20. యెహోవా చేసిన వాగ్దానాలు ఎందుకు చాలా ఓదార్పునిస్తాయి?
20 సమస్తమైన ఓదార్పునిచ్చే యెహోవా చనిపోయినవాళ్లను పునరుత్థానం చేయడం ద్వారా దుఃఖాన్నంతటిని తీసేస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉందో కదా! (యోహా. 5:28, 29) “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును” అని ఆయన మాటిస్తున్నాడు. (యెష. 25:8) అప్పుడు మనం ‘ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వాల్సిన’ అవసరం ఉండదు. బదులుగా భూమ్మీదున్న వాళ్లందరూ ‘సంతోషించేవాళ్లతో కలిసి సంతోషిస్తారు.’—రోమా. 12:15.
-