-
‘అందరితో సమాధానంగా ఉండండి’కావలికోట—2009 | అక్టోబరు 15
-
-
మేలు చేత కీడును జయించండి
13, 14. (ఎ) ఎవరైనా వ్యతిరేకిస్తే మనం ఎందుకు ఆశ్చర్యపోము? (బి) మనల్ని హింసించేవారిని ఎలా దీవించవచ్చు?
13 రోమీయులు 12:14, 21 చదవండి. యెహోవా తన ఉద్దేశాలను నెరవేరుస్తాడనే పూర్తి నమ్మకంతో మనం సాహసాలకు పోకుండా దేవుడు అప్పగించిన పని కోసం గట్టికృషి చేయవచ్చు. ‘రాజ్యసువార్తను’ “లోకమందంతట” ప్రకటించే పనిని ఆయన మనకు అప్పగించాడు. (మత్త. 24:14) “మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు” అని యేసు మనల్ని హెచ్చరించాడు కాబట్టి, ఆ పనిలో పాల్గొంటే మన శత్రువులకు కోపం వస్తుందని మనకు తెలుసు. (మత్త. 24:9) అందుకే, మనకు వ్యతిరేకత ఎదురైనప్పుడు మనం ఆశ్చర్యపోము లేదా నిరుత్సాహపడము. అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.”—1 పేతు. 4:12, 13.
-
-
‘అందరితో సమాధానంగా ఉండండి’కావలికోట—2009 | అక్టోబరు 15
-
-
15. మేలు చేత కీడును జయించే చక్కని విధానం ఏమిటి?
15 అందుకే, నిజ క్రైస్తవులు రోమీయులు 12వ అధ్యాయంలోని చివరి వచనాన్ని పాటిస్తారు: “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” ఈ లోకంలోని దుష్టత్వానికి అపవాదియైన సాతానే కారకుడు. (యోహా. 8:44; 1 యోహా. 5:19) అపొస్తలుడైన యోహానుకు ఇచ్చిన దర్శనంలో, తన అభిషిక్త సహోదరులు “గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని [సాతానును] జయించియున్నారు” అని యేసు తెలియజేశాడు. (ప్రక. 12:11) సాతానుతోపాటు, లోకంపై అతడి చెడు ప్రభావాన్ని జయించాలంటే రాజ్యం గురించి ప్రకటించడం ద్వారా మంచిని చేయాలని, జయించడానికి అదే చక్కని విధానమని ఆ మాటలు తెలియజేస్తున్నాయి.
-