కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 5/1 పేజీ 32
  • కీడుపై గెలుపు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కీడుపై గెలుపు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 5/1 పేజీ 32

కీడుపై గెలుపు

“ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెద”నన్న అభ్యర్థనను ఇశ్రాయేలీయుల సైన్యాధిపతియైన అబీషై చేశాడు. తన ప్రభువు, రాజైన దావీదుని బెన్యామీనీయుడైన షిమీ దూషించినప్పుడు కోపంతో అబీషై ఆ విధంగా ప్రతిస్పందించాడు.—2 సమూయేలు 16:5-9.

ఈనాడు సాధారణంగా అంతటా అంగీకరించబడుతున్న దెబ్బకుదెబ్బ అనే తత్త్వానికి అబీషై లోబడ్డాడు. అవును, షిమీ దావీదును అవమానకరంగా దూషించినందుకు అబీషై అతనిని తగినవిధంగా శిక్షించాలనుకున్నాడు.

మరి దావీదు ప్రతిస్పందన ఎలా ఉంది? దావీదు “వాడి జోలికి పోవద్దు” అంటూ అబీషైకి అడ్డుచెప్పాడు. షిమీ మోపిన ఆరోపణలన్నింటిలో తను నిర్దోషియైనప్పటికీ ప్రతీకారం చేయాలనే ప్రలోభాన్ని నమ్రతగా త్రోసిపుచ్చాడు. బదులుగా, ఆ విషయాన్ని యెహోవా చేతుల్లోకే ఆయన విడిచి పెట్టాడు.—2 సమూయేలు 16:10-13. పరిశుద్ధ బైబిల్‌.

తన కుమారుడు తిరుగుబాటు చేసినప్పుడు పారిపోయి, అది విఫలమైన తర్వాత తన రాజ్యాధికారానికి తిరిగి వచ్చిన దావీదును అభినందించడానికి మొదట వచ్చిన వారిలో ఈ షిమీ కూడా ఉన్నాడు, తనను క్షమించమని షిమీ దావీదును అడిగాడు. అబీషై మళ్లీ అతన్ని చంపాలని అనుకున్నాడు కానీ, దావీదు ఈసారి కూడా అనుమతించలేదు.—2 సమూయేలు 19:15-23.

ఈ సంఘటనలో దావీదు “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; . . . న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను” అని పేతురు ఎవరి గురించైతే వ్రాశాడో ఆ యేసుక్రీస్తును చక్కగా చిత్రీకరించడానికి తాను తగిన వాడని నిరూపించుకున్నాడు.—1 పేతురు 2:23.

ఈనాడు, క్రైస్తవులందరూ ‘వినయమనస్కులై . . . కీడుకు ప్రతికీడు’ చేయకుండా ఉండాలని ఉద్బోధించబడుతున్నారు. (1 పేతురు 3:8, 9) దావీదు, యేసుక్రీస్తు అందించిన మాదిరులను అనుసరించటం ద్వారా మనం కూడా ‘మేలు చేత కీడును జయించ’గలం.—రోమీయులు 12:17-21.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి