కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోవా మార్గంలో నడుస్తూనే ఉండండి
    కావలికోట—1999 | మే 15
    • 6, 7. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని ఆరాధకులైనప్పటికీ వారు ఏ సందర్భాల్లో వైదొలగిపోయారు, ఎందుకు?

      6 పౌలు చూపించినట్లుగా ప్రాచీన ఇశ్రాయేలులో అలాగే జరిగింది. ఆయనిలా వ్రాశాడు: “వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.—జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే యిరువది మూడువేలమంది కూలిరి.”—1 కొరింథీయులు 10:6-8.

      7 పౌలు మొదట, సీనాయి పర్వతపాదం వద్ద ఇశ్రాయేలీయులు ఒక బంగారు దూడను ఆరాధించిన సందర్భాన్ని సూచిస్తున్నాడు. (నిర్గమకాండము 32:5, 6) ఇది, తాము కేవలం కొద్ది వారాల మునుపు విధేయత చూపుతామని ఒప్పుకున్న దైవిక ఆజ్ఞకు ప్రత్యక్షంగా చూపించిన అవిధేయతయై ఉంది. (నిర్గమకాండము 20:4-6; 24:3) తర్వాత పౌలు, ఇశ్రాయేలీయులు మోయాబు కుమార్తెలతోపాటు బయలుకు నమస్కరించినప్పటి సందర్భాన్ని సూచిస్తున్నాడు. (సంఖ్యాకాండము 25:1-9) దూడ ఆరాధనలో ఘోరమైన రీతిలో ఆత్మ సంతృప్తిని పొందడం, ‘ఆడడం’ అనేవి ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి.a బయలు ఆరాధనలో విచ్ఛలవిడితనంతో కూడిన లైంగిక అనైతికత ఇమిడివుండేది. (ప్రకటన 2:14) ఇశ్రాయేలీయులు ఈ పాపాలను ఎందుకు చేశారు? ఎందుకంటే వారు తమ హృదయాలు ‘చెడ్డవాటిని ఆశించేలా’—అవి విగ్రహారాధనయైనా లేదా దానితోకూడా ఉన్న విచ్ఛలవిడితనంతో కూడిన లైంగిక అభ్యాసాలైనా—అనుమతించారు.

      8. ఇశ్రాయేలీయుల అనుభవాలనుండి మనం ఏమి నేర్చుకోగలం?

      8 మనం ఈ సంఘటనల నుండి నేర్చుకోవల్సింది ఉందని పౌలు సూచించాడు. ఏమి నేర్చుకోవాలి? ఒక క్రైస్తవుడు ఏదో బంగారు దూడకు గానీ లేదా ప్రాచీన మోయాబు దేవతకు గానీ నమస్కరిస్తాడని మనం అనుకోము. కానీ అనైతికత విషయమేమిటి, లేదా విశృంఖలమైన రీతిలో ఆత్మ సంతృప్తిని పొందడం విషయమేమిటి? ఇవి నేడు సర్వసాధారణమైపోయాయి, మన హృదయంలో వాటిపట్ల వాంఛ అభివృద్ధిచెందేలా మనం అనుమతిస్తే, అవి మనకూ యెహోవాకూ మధ్య గోడలా ఏర్పడతాయి. దాని ఫలితం మనం విగ్రహారాధన చేయడంతో సమానం—దానర్థం మనం దేవుని నుండి వైదొలగిపోవడమనే. (పోల్చండి కొలొస్సయులు 3:5; ఫిలిప్పీయులు 3:19.) నిజానికి, తోటి విశ్వాసులను ఈ విధంగా పురికొల్పుతూ పౌలు ఆ సంఘటనల గురించిన తన చర్చను ముగిస్తున్నాడు: “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి.”—1 కొరింథీయులు 10:14.

  • యెహోవా మార్గంలో నడుస్తూనే ఉండండి
    కావలికోట—1999 | మే 15
    • a “ఆడుటకు లేచిరి” అని అనువదించబడిన గ్రీకు పదాన్ని సూచిస్తూ ఒక వ్యాఖ్యానకర్త, అన్యుల పండుగల్లో జరిగిన నృత్యాలను ఆ పదం సూచిస్తుందని చెప్పి, ఇంకా ఇలా జతచేస్తున్నాడు: “ఈ నృత్యాల్లో చాలామట్టుకు సర్వత్రా తెలిసినట్లే, అత్యంత తీవ్రమైన లైంగిక కోర్కెలను రేకెత్తించడానికి రూపొందించబడ్డాయి.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి