కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 4 | దేవుని సహాయంతో ద్వేషాన్ని తీసేసుకోండి
    కావలికోట (సార్వజనిక) (2022) | No. 1
    • బైబిలు సలహా:

      “పవిత్రశక్తి మనుషుల్లో పుట్టించే లక్షణాలు ఏమిటంటే: ప్రేమ, సంతోషం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం.”—గలతీయులు 5:22, 23.

      దానర్థం:

      దేవుని సహాయం తీసుకుంటే ద్వేషమనే విషచక్రం నుండి బయటపడడం సాధ్యమే! కొన్ని లక్షణాల్ని మనం సొంతగా అలవర్చుకోలేం, కానీ దేవుడిచ్చే పవిత్రశక్తితో వాటిని పెంచుకోగలం. కాబట్టి ద్వేషాన్ని తీసేసుకోవడానికి సొంత శక్తి మీద ఆధారపడే బదులు, దేవుని మీద ఆధారపడడం తెలివైన పని. దేవుని సేవకుడైన పౌలు అదే చేశాడు, అందుకే పౌలు; “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను” అని చెప్పగలిగాడు. దేవుడిచ్చే శక్తి మీద ఆధారపడితే మనం కూడా అలాగే చెప్పగలుగుతాం. (ఫిలిప్పీయులు 4:13) అంతేకాదు, “యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది” అని అనగలుగుతాం.—కీర్తన 121:2.

  • 4 | దేవుని సహాయంతో ద్వేషాన్ని తీసేసుకోండి
    కావలికోట (సార్వజనిక) (2022) | No. 1
    • తన భార్య యెహోవాసాక్షుల దగ్గర బైబిలు గురించి నేర్చుకోవడం వాల్డోకు నచ్చలేదు. అతనిలా చెప్పాడు: “నేను మాత్రం యెహోవాసాక్షుల పేరు వింటేనే మండిపడేవాణ్ణి. చాలాసార్లు వాళ్లను బూతులు కూడా తిట్టాను. అప్పుడు వాళ్లు నాతో గొడవకు దిగుతారని అనుకున్నాను. కానీ అలా ఎప్పుడూ జరగలేదు.”

      కొంతకాలానికి వాల్డో కూడా బైబిలు గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు తనకెలా అనిపించిందో ఇలా వివరించాడు: “నేర్చుకున్న వాటిని పాటించడమంటే కొరకరాని కొయ్యలా ఉండేది. నాకున్న వెర్రికోపాన్ని తగ్గించుకోవడం అసాధ్యం అనిపించింది.” కానీ బైబిల్లో నుండి నేర్చుకున్న ఒక విషయం అతని జీవితాన్ని మార్చేసింది.

      వాల్డో ఇలా చెప్తున్నాడు: ‘ఒకరోజు నాకు బైబిలు సత్యాలు నేర్పించే అలెజాండ్రో నన్ను గలతీయులు 5:22, 23 చదవమన్నాడు. పవిత్రశక్తి సహాయం లేకుండా మనంతట మనమే ఆ లక్షణాలు అలవర్చుకోలేమని అతను వివరించాడు. ఆ మాట నా ఆలోచనా తీరును పూర్తిగా మార్చేసింది.’

      దేవుని సహాయం తీసుకోవడం వల్ల వాల్డో ద్వేషాన్ని పూర్తిగా తీసేసుకోగలిగాడు. దానికి ఎలాంటి స్పందన వచ్చింది? “నాలో వచ్చిన ఈ పెనుమార్పు చూసి నా బంధువులు, స్నేహితులు ఎంతో ఆశ్చర్యపోయారు” అని వాల్డో చెప్పాడు. అంతేకాదు, “క్రూరుడినైన నన్ను యెహోవా దేవుడు శాంతి స్వభావునిగా మార్చేశాడు” అని కూడా అతను చెప్పాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి