-
పిల్లలపై వారికి అవసరమైన శ్రద్ధ చూపించడంతేజరిల్లు!—2005 | ఏప్రిల్ 8
-
-
కోపం రేపకుండా శిక్షణ ఇవ్వడం
పేరుపొందిన ఉపాధ్యాయుడు, మానసిక రుగ్మతల మీద పరిశోధన చేస్తున్న వైద్యుడు అయిన డా. రాబర్ట్ కోల్స్ ఒకసారి ఇలా అన్నారు: “పిల్లల్లో అంతకంతకూ వృద్ధిచెందే నైతిక గ్రహింపు ఉంటుంది. నైతికపరమైన మార్గనిర్దేశం కోసం పిల్లల్లో ఉండే తృష్ణ దేవుడిచ్చినదేనని నా అభిప్రాయం.” మరి నైతికపరమైన మార్గనిర్దేశం కోసం పిల్లల్లో ఉండే ఈ ఆకలి దప్పికలను ఎవరు తీర్చాలి?
ఎఫెసీయులు 6:4 లోని మాటలు ఇలా ప్రోత్సహిస్తున్నాయి: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” ఈ లేఖనం, తమ పిల్లల్లో దేవునిపట్ల ప్రేమను, దైవిక ప్రమాణాలపట్ల ప్రగాఢమైన మెప్పును నాటవలసిన బాధ్యతను ప్రత్యేకంగా తండ్రికే అప్పగించడాన్ని మీరు గమనించారా? అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులు 6వ అధ్యాయం 1 వ వచనంలో, “మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి” అని పిల్లలకు చెప్పినప్పుడు తల్లిదండ్రులిద్దరి గురించి మాట్లాడాడు.a
ఒకవేళ తండ్రి లేకపోతే, తల్లి ఆ బాధ్యతను చేపట్టాలి. చాలామంది ఒంటరి తల్లులు యెహోవా దేవుని శిక్షలోనూ, బోధలోనూ పిల్లలను పెంచడంలో విజయం సాధించారు. అయితే, తల్లి వివాహం చేసుకున్నప్పుడు క్రైస్తవ భర్త నాయకత్వం వహించాలి. తల్లి తమ పిల్లలకు శిక్షణనివ్వడంలోనూ వారిని క్రమశిక్షణలో పెట్టడంలోనూ ఆయన నాయకత్వానికి ఇష్టపూర్వకంగా విధేయురాలు కావాలి.
మీరు మీ పిల్లలకు ‘కోపము రేపకుండా’ వారిని ఎలా క్రమశిక్షణలో పెడతారు లేక శిక్షణనిస్తారు? దీనికి ఏ రహస్య సూత్రాలూ లేవు, ఎందుకంటే ప్రతీ బిడ్డ భిన్నంగా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లలపట్ల ప్రేమా గౌరవాలు చూపిస్తూ తాము ఇచ్చే క్రమశిక్షణా విధానం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఆసక్తికరంగా, పిల్లలకు కోపం రేపకుండా ఉండడం గురించి లేఖనాల్లో మరోసారి కొలొస్సయులు 3:21 లో ప్రస్తావించబడింది. అక్కడ తండ్రులకు మళ్ళీ ఇలా ఉద్బోధించబడింది: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.”
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల మీద గట్టిగా అరుస్తుంటారు. ఇది పిల్లలకు చికాకు కలిగిస్తుందనడంలో సందేహం లేదు. కానీ బైబిలు ఇలా ప్రోత్సహిస్తోంది: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి [“అరపులు,” క్యాతలిక్ అనువాదము] దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫెసీయులు 4:31) అంతేకాదు ‘ప్రభువు దాసుడు జగడమాడకుండా అందరి యెడల సాధువుగా ఉండాలి’ అని కూడా బైబిలు చెబుతోంది.—2 తిమోతి 2:26.
-
-
పిల్లలపై వారికి అవసరమైన శ్రద్ధ చూపించడంతేజరిల్లు!—2005 | ఏప్రిల్ 8
-
-
a పౌలు ఇక్కడ గోనెఫ్స్ నుండి వచ్చిన గోనెఫ్సిన్ అనే గ్రీకు పదాన్ని వాడాడు, దానికి “తల్లిదండ్రులు” అని అర్థం. కానీ 4వ వచనంలో ఆయన “తండ్రులు” అనే భావంగల పాటరస్ అనే గ్రీకు పదాన్ని వాడాడు.
-