కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఏదైనా ఆధ్యాత్మిక బలహీనత ఉంటే దాన్ని గుర్తించి అధిగమించడం ఎలా?
    కావలికోట—1999 | ఏప్రిల్‌ 15
    • క్రైస్తవుని మనస్సూ హృదయమూ వశంలో ఉంచుకోవడం కూడా చేరివున్న ఆధ్యాత్మిక సమరంలో మనం పోరాడుతున్నాము గనుక మనం మన అవయవాలన్నింటినీ సంరక్షించుకోవడానికి సాధ్యమైనదంతా చేయాలి. మన ఆధ్యాత్మిక కవచంలో మన హృదయాన్ని కాపాడే “నీతి అనే మైమరువు,” మన మనస్సును కాపాడే “రక్షణ అనే శిరస్త్రాణము” ఉన్నట్లు జ్ఞప్తికి తెచ్చుకోండి. వాటిని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం ఉపయోగించుకోకపోవడానికి, జయాపజయాలకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది.—ఎఫెసీయులు 6:14-17; సామెతలు 4:23; రోమీయులు 12:2.

  • ఏదైనా ఆధ్యాత్మిక బలహీనత ఉంటే దాన్ని గుర్తించి అధిగమించడం ఎలా?
    కావలికోట—1999 | ఏప్రిల్‌ 15
    • “రక్షణ అనే శిరస్త్రాణము” ధరించడంలో, ఈ లోకంలోని తళుకుబెళుకులు మనల్ని దారితప్పేలా చేయడానికి అనుమతించకుండా మనముందున్న అత్యద్భుతమైన ఆశీర్వాదాలను మనస్సుల్లో తేటగా ఉంచుకోవడం ఇమిడివుంది. (హెబ్రీయులు 12:2, 3; 1 యోహాను 2:16) ఈ విధమైన మనోవైఖరి ఉంచుకోవడం, మనం వస్తుసంపదలు కూడబెట్టుకోవడం కన్నా స్వంత లాభం పొందడంకన్నా, ఆధ్యాత్మిక ఆసక్తులను ముందుంచడానికి సహాయం చేస్తుంది. (మత్తయి 6:33) అందుకని, సర్వాంగ కవచంలోని ఈ భాగం మన శరీరంపై ఉన్నదని నిశ్చయపర్చుకోవడానికి, మనల్ని మనం ఇలా నిజాయితీగా ప్రశ్నించుకోవాలి: నేను నా జీవితంలో దేని వెనుక పరిగెడుతున్నాను? నాకు స్పష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్నాయా? వాటిని చేరుకోవడానికి నేనేం చేస్తున్నాను? శేషించిన అభిషిక్తుల్లో సభ్యులమైనా, పెద్ద సంఖ్యలోని “గొప్ప సమూహము”లోని వారమైనా మనం పౌలును అనుకరించాలి, ఆయనిలా అన్నాడు: “నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను.”—ప్రకటన 7:9; ఫిలిప్పీయులు 3:13, 14.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి