కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 10/1 పేజీలు 16-17
  • “ఒకరికొరకు ఒకరు ప్రార్థనచేయుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఒకరికొరకు ఒకరు ప్రార్థనచేయుడి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒకరికొరకు ఒకరము ప్రార్థించుట ఎందుకు?
  • వేటినిగూర్చి ప్రార్థించవలెను?
  • క్రైస్తవ లక్షణములు ఉన్నతపరచబడును
  • ఒకరికొరకు ఒకరు ప్రార్థించుచుండుడి
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • ప్రార్థనలో దేవునికి చేరువ కావడం
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 10/1 పేజీలు 16-17

“ఒకరికొరకు ఒకరు ప్రార్థనచేయుడి”

యెహోవా “ప్రార్థన ఆలకించువాడు.” (కీర్తన 65:2) తనకు హృదయపూర్వకముగా అంకితమైన వారి ప్రార్థనలను ఆయన ఎల్లప్పుడు వినును. మనము ఒకరికొరకు ఒకరము ప్రార్థనచేసినప్పుడు ఆయన వింటాడని నిశ్చయత కలిగియుండగలము.

అయితే ఒకరికొరకు ఒకరము ఎందుకు ప్రార్థించవలెను? అలాంటి ప్రార్థనలు వేటివిషయమై చేయవచ్చును? అలా ఒకరికొరకు ఒకరము ప్రార్థించినపుడు ఏ దైవిక లక్షణములు ఉన్నతపరచబడును?

ఒకరికొరకు ఒకరము ప్రార్థించుట ఎందుకు?

లేఖనములు యెహోవా ప్రజలను ఒకరికొరకు ఒకరు ప్రార్థించవలెనని ప్రోత్సహించుచున్నవి. అపొస్తలుడైన పౌలు విన్నపములుచేసినపుడు వాటిలో ఆయన ఇతరులకొరకు ప్రార్థించెను. (కొలొస్సయులు 1:3; 2 థెస్సలొనీకయులు 1:11) అంతేగాక శిష్యుడైన యాకోబు కూడ యిలా వ్రాసెను: “ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి.”—యాకోబు 5:16.

ఇతర దేవుని సేవకులకొరకు ప్రార్థించుట ఫలవంతమైనది. యాకోబు 5:13-18 నందు ఇది చూపబడినది. అచ్చట ఆత్మీయముగా రోగియైన క్రైస్తవుడు సంఘపెద్దల పిలువనంపి తనకొరకు వారు “యెహోవా నామమున నూనె రాచి ప్రార్థనచేయునట్లు” చేసికొనవలెనని చూపినది. వారి ప్రార్థనలను వినుట కృంగియున్న వ్యక్తిని బలపరచి, తన స్వంత ప్రార్థనలకు కూడ దేవుడు సమాధానమిచ్చునను నమ్మకమును కలుగజేయును. (కీర్తన 23:5; 34:18) ఆ వ్యక్తితో ప్రార్థించుటతో పాటు, మృదువైన నూనె లాంటి లేఖన తలంపులను తెలియపరచి పెద్దలు అతనిని ఆత్మీయ ఆరోగ్యమునకు తిరిగితెచ్చుటకు ప్రయత్నింతురు.

యాకోబు ఇంకను ఇట్లనుచున్నాడు: “విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. యెహోవా అతనిని లేపును. ఔను, ఆత్మీయముగా రోగియైన వ్యక్తి పెద్దల “విశ్వాససహితమైన ప్రార్థన” వలన సహాయము పొందును. అంతేగాక ఆ వ్యక్తి సహాయము పొంద నిష్టపడినయెడల దేవుడు అతనిని ఆత్మీయ ఆరోగ్యమునకు “లేపును.” ఒకవేళ ఆత్మీయ రోగము గంభీరమైన పాపమువలన కలిగినదైతే దాని విషయమేమి? అయినను, ఆ వ్యక్తి పశ్చాత్తాపపడినట్లయిన యెహోవా అతనిని క్షమించును.

అందువలన యాకోబు ఇలా చెప్పుచున్నాడు, “మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదైయుండును. ఏలీయా. . .వర్షింపకుండునట్లు. . .ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమిమీద వకర్షిపలేదు. అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.” (1 రాజులు 17:1-7; 18:1, 42-45) దేవుని చిత్తానికి అనుగుణ్యమైన నీతిమంతుని ప్రార్థన ఎంతో బలముగలదైయుండును.—1 యోహాను 5:14, 15.

వేటినిగూర్చి ప్రార్థించవలెను?

తోటి విశ్వాసిని గూర్చి ఏ అంశమునైనను మన ప్రార్థనలలో చేర్చవచ్చును. ఉదాహరణకు పౌలు తనకు సువార్తను మాట్లాడుటకు తగిన శక్తినిచ్చునట్లు ప్రార్థించమని ఇతరులను అడిగాడు. (ఎఫెసీయులు 6:17-20) ఒకరు శోధించబడుచున్నారని నీకు తెలిసిన దాని విషయమేమి? ‘తాను తప్పిదము చేయకుండండవలెననియు’ దేవుడు తనను శోధనలో వదిలివేయక దుష్టుడైన అపవాదియగు సాతానునుండి తప్పించవలెనని ప్రార్థించవచ్చును. (2 కొరింథీయులు 13:7; మత్తయి 6:13) ఒకరు భౌతికంగా వ్యాధిగ్రస్థులైనప్పుడు, తన వ్యాధిని సహించగల మనోధైర్యము (బలము) నివ్వమని యెహోవాను మనము అడుగవచ్చును.—కీర్తన 41:1-3.

హింసించబడుచున్న తోటి ఆరాధికులనుగూర్చి ప్రార్థించుట ఎల్లప్పుడు యుక్తమైనది. పౌలు మరియు తన సహవాసులు తీవ్రమైన హింసననుభవించారు. కొరింథులోని క్రైస్తవులకు ఆయన ఇలా చెప్పాడు: “మా కొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా. . .అనేకుల ప్రార్థనద్వారా మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.” (2 కొరింథీయులు 1:8-11; 11:23-27) మనము జైలులో ఉన్నను, “నీతిమంతుల ప్రార్థనను” యెహోవా వినునని గుర్తించుకొని, హింసంచబడుచున్న ఇతర సహోదరులకొరకు ప్రార్థించవలెను.—సామెతలు 15:29.

ప్రత్యేకముగా యెహోవా సంస్థలో గొప్ప బాధ్యతలను నిర్వహిస్తున్న మన సహోదరులకొరకు మనము ప్రార్థించవలెను. అనగా సంస్థను నడిపిస్తూ, “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని” ద్వారా అందించబడు ఆత్మీయాహారమును తయారుచేయు వారినికూడ ఇందులో చేర్చవలెను. (మత్తయి 24:45-47) ఉదాహరణకు యెహోవాసాక్షుల గవర్నింగ్‌ బాడి సభ్యులను గూర్చి, దేవుడు వారికి “జ్ఞానముగల మనస్సును” దయచేయునట్లు ప్రార్థించవచ్చును.—ఎఫెసీయులు 1:16, 17.

క్రైస్తవ లక్షణములు ఉన్నతపరచబడును

తోటి విశ్వాసులనుగూర్చి ప్రార్థించుటద్వారా మనము వారియెడల శ్రద్ధకలిగి, నిస్వార్థముగా, ప్రేమగలిగియున్నామని చూపుచున్నాము. మన ఆత్మీయ సహోదర సహోదరీలయెడల నిస్వార్థము, ప్రేమగల శ్రద్ధ, “ప్రేమ స్వప్రయోజనము విచారించుకొనదు” అని పౌలు సూచించినదానికి అనుగుణ్యముగా ఉన్నది. (1 కొరింథీయులు 13:4, 5) “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెన”ను దానిని అన్వయించుటయందు ఇతరులకొరకు ప్రార్థించుట ఒక మార్గమైయున్నది. (ఫిలిప్పీయులు 2:4) మనము ఇతరుల ఆత్మీయ క్షేమమునుగూర్చి మన ప్రార్థనలో శ్రద్ధచూపినయెడల, యేసు శిష్యులను గుర్తించు సహోదర ప్రేమయందు మనము వారికి సమీపస్థులమగుదుము.—యోహాను 13:34, 35.

మనము ప్రార్థించువారియెడల సానుభూతి లక్షణము వృద్ధిచెందును. (1 పేతురు 3:8) మనము వారియెడల సానుభూతిని కలిగి, వారి శ్రద్ధలందు, దుఃఖములందు భాగము వహించెదము. మానవశరీరములో ఒక చేతికి గాయమైన, మరొకటి దాన్నిగూర్చి శ్రద్ధవహించి, గాయము వలన కలుగు బాధను తొలగించుటకు ప్రయత్నించును. (1 కొరింథీయులు 12:12, 26 ను పోల్చుము) అలాగే, బాధననుభవించు మన సహోదర సహోదరీలకొరకు ప్రార్థించుట మనలో వారియెడల సానుభూతిని వృద్ధిచేసి, వారిని మన మనస్సులో ఉంచుకొనునట్లు సహాయముచేయును. నమ్మకస్థులైన మన తోటి క్రైస్తవులను మన ప్రార్థనలో చేర్చకుండ నిర్లక్ష్యము చేసిన అది మనకే నష్టము. ఎందుకనగా దేవుడు మరియు క్రీస్తు మాత్రము వారిని ఎడబాయడు.—1 పేతురు 5:6, 7.

మనము ఇతరులకొరకు ప్రార్థించినప్పుడు అనేక దైవిక లక్షణములు వృద్ధిచెందును. మనము వారిని బాగుగా అర్థము చేసికొనువారమై, వారియెడల సహనమును కనపరచెదము. విరోధభావమును తీసివేసుకొని, ప్రేమ మరియు ఆనందదాయకమైన క్షేమాభివృద్ధికర తలంపులకు స్థానమిచ్చెదము. ఇతరులకొరకు ప్రార్థించుటయనునది యెహోవా ప్రజల మధ్య ఐక్యత మరియు సమాధానమును వృద్ధిచేయును.—2 కొరింథీయులు 9:13, 14.

ఒకరికొరకు ఒకరు ప్రార్థించుచుండుడి

పౌలువలె మనమును ఇతరులను మనకొరకు ప్రార్థించమని అడుగవచ్చును. మనతోపాటు ప్రార్థించుటయేగాక, వారి వ్యక్తిగత ప్రార్థనలలోను మన పేరును ఉపయోగించి మన సమస్యను తెలియజేస్తూ మనకు సహాయముచేయమని యెహోవాను ప్రార్థించవచ్చును. సహాయము నిశ్చయంగా వస్తుంది. ఎందుకనగా: “తన భక్తులను శోధనలోనుండి తప్పించుటకు యెహోవా సమర్థుడు.”—2 పేతురు 2:9.

మనలను తమ ప్రార్థనలలో జ్ఞాపకముచేసికొను యెహోవాసాక్షులకు కూడ శోధనలున్నవి. బహుశా అవి మనకంటే ఎక్కువ దుఃఖకరమైనవి కావచ్చును. అయినను వారు మన అవసరతలను నిత్యుడగు రాజు యెదుట ఉంచి, బహుశా మన పక్షముగా కన్నీటితో మొరపెట్టవచ్చును. (2 కొరింథీయులు 2:4; 2 తిమోతి 1:3, 4 ను పోల్చుము.) ఈ విషయమునకు మనమెంత కృతజ్ఞులమైయుండవలెను. మెప్పునుబట్టియు, మరియు ఇప్పుడు చర్చించిన ఇతర కారణములనుబట్టియు ఒకరికొరకు ఒకరము ప్రార్థించుదము. (w90 11/15)

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి