-
కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండికావలికోట—2013 | నవంబరు 15
-
-
4. ఈ ఆర్టికల్‌లో మనం ఏమి చూస్తాం?
4 మరైతే, క్రైస్తవ కాపరులు గొర్రెలతో ఎలా వ్యవహరించాలి? ‘నాయకులుగా ఉన్నవాళ్లకు లోబడి ఉండండి’ అని సంఘ సభ్యులను బైబిలు ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో, “మీకు అప్పగింపబడినవారిపై [“దేవుని స్వాస్థ్యంపై,” NW] ప్రభువులైనట్టు” ఉండవద్దని సంఘ పెద్దలకు కూడా ఉపదేశమిస్తుంది. (హెబ్రీ. 13:17; 1 పేతురు 5:2, 3 చదవండి.) అయితే, నియమిత పెద్దలు “ప్రభువులైనట్టు” ఉండకుండా మందమీద ఎలా నాయకత్వం వహించవచ్చు? మరో మాటలో చెప్పాలంటే, దేవుడు తమకిచ్చిన అధికార పరిధిని దాటకుండానే పెద్దలు గొర్రెల బాగోగులను ఎలా చూసుకోవచ్చు?
-
-
కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండికావలికోట—2013 | నవంబరు 15
-
-
9. ఎలాంటి వైఖరి కలిగివుండాలని యేసు తన శిష్యులకు చెప్పాడు?
9 ఆధ్యాత్మిక కాపరులు ఎలా ఉండాలనే విషయంలో యేసుకున్న వైఖరి ఒకప్పుడు యాకోబు, యోహానులు చూపించిన వైఖరికి భిన్నంగా ఉంది. ఆ ఇద్దరు అపొస్తలులు రాజ్యంలో ప్రముఖ స్థానాలు పొందాలని ఆశించారు. అయితే యేసు ఈ మాటలతో వాళ్ల వైఖరిని సరిదిద్దాడు: “అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను.” (మత్త. 20:25, 26) తమ సహవాసుల మీద ‘ప్రభుత్వము చేయాలనే’ లేదా ‘పెత్తనం చేయాలనే’ కోరికను అపొస్తలులు జయించాల్సిన అవసరముంది.
10. పెద్దలు మందతో ఎలా వ్యవహరించాలని యేసు ఆశిస్తాడు? ఈ విషయంలో పౌలు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?
10 మందతో తాను వ్యవహరించిన విధంగానే క్రైస్తవ పెద్దలు కూడా వ్యవహరించాలని యేసు ఆశిస్తాడు. పెద్దలు తమ సహోదరుల మీద ప్రభువులుగా ఉండకుండా, వాళ్లకు సేవకులుగా ఉండడానికి ఇష్టపడాలి. అపొస్తలుడైన పౌలుకు అలాంటి వినయ స్వభావమే ఉంది, ఆయన ఎఫెసు సంఘంలోని పెద్దలకు ఇలా చెప్పాడు: ‘నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి ఎల్ల కాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో, పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.’ ఆ పెద్దలు వినయంగా ఉండాలని, తమ సహోదరుల కోసం ప్రయాసపడాలని పౌలు కోరుకున్నాడు. అందుకే ఆయన వాళ్లతో, “మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపలెననియు . . . అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని” అని అన్నాడు. (అపొ. 20:18, 19, 35) పౌలు కొరింథులోని సహోదరులకు రాస్తూ, తాను వాళ్ల విశ్వాసం మీద ప్రభువును కానని అన్నాడు. ఆయన కూడా వాళ్లలాగే వినయంగా దేవుని సేవచేశాడు, ఆనందంతో దేవుణ్ణి సేవించేలా వాళ్లకు సహాయం చేయాలని పౌలు కోరుకున్నాడు. (2 కొరిం. 1:24) వినయం విషయంలో, కష్టపడి పనిచేసే విషయంలో పౌలు నేటి పెద్దలకు ఎంతో ఆదర్శప్రాయుడు.
-
-
కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండికావలికోట—2013 | నవంబరు 15
-
-
‘మందకు మాదిరులుగా ఉండండి’
తమ కుటుంబ సభ్యులు పరిచర్యకు సిద్ధపడేలా పెద్దలు సహాయం చేస్తారు (13వ పేరా చూడండి)
13, 14. పెద్దలు ఏయే విషయాల్లో మందకు ఆదర్శంగా ఉండాలి?
13 తమకు ‘అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు’ ఉండవద్దని పెద్దలకు ఉపదేశించిన తర్వాత అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “మందకు మాదిరులుగా ఉండుడి.” (1 పేతు. 5:3) పెద్దలు మందకు మాదిరులుగా ఎలా ఉండవచ్చు? “అధ్యక్ష్యపదవిని ఆశించే” ఒక వ్యక్తి చేరుకోవాల్సిన రెండు అర్హతలను పరిశీలించండి. ఆయన “స్వస్థబుద్ధి” కలిగివుండాలి, “తన యింటివారిని బాగుగా ఏలువాడునై” ఉండాలి. ఒక సంఘ పెద్దకు కుటుంబం ఉంటే తన కుటుంబాన్ని పర్యవేక్షించే విషయంలో ఆయన ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎందుకంటే, “ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?” (1 తిమో. 3:1-3, 4, 5) ‘అధ్యక్ష్యపదవికి’ అర్హుడవ్వాలంటే ఒక వ్యక్తికి స్వస్థబుద్ధి ఉండాలి అంటే దైవిక సూత్రాలను స్పష్టంగా అర్థంచేసుకొని, వాటిని తన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఆయనకు తెలిసుండాలి. ఆయన ప్రశాంతంగా ఉంటాడు, తొందరపడి ఓ ముగింపుకు రాడు. పెద్దల్లో ఈ లక్షణాలను చూసినప్పుడు, సంఘ సభ్యులు వాళ్లమీద నమ్మకం ఉంచగలుగుతారు.
14 పరిచర్యలో ముందుండి నడిపించే విషయంలో కూడా పెద్దలు తోటి క్రైస్తవులకు చక్కని ఆదర్శాన్ని ఉంచుతారు. ఈ విషయంలో పెద్దలకు యేసు మంచి మాదిరి ఉంచాడు. యేసు భూజీవితంలో రాజ్య సువార్త ప్రకటించడం ఒక అంతర్భాగం. ఆ పని ఎలా చేయాలో ఆయన తన శిష్యులకు చూపించాడు. (మార్కు 1:38; లూకా 8:1) పెద్దలతో కలిసి పరిచర్య చేస్తూ, ప్రాణాల్ని రక్షించే ఈ పనిలో వాళ్లకున్న ఉత్సాహాన్ని చూసినప్పుడు, వాళ్ల బోధనా పద్ధతుల నుండి నేర్చుకున్నప్పుడు నేడు ప్రచారకులు ఎంత ప్రోత్సాహం పొందుతారో ఆలోచించండి! పెద్దలు ఎన్నో పనుల్లో తీరిక లేకుండావున్నా తమ సమయాన్ని, శక్తిని క్రమంగా వెచ్చిస్తూ సువార్త ప్రకటించినప్పుడు సంఘమంతా అలాంటి ఉత్సాహం చూపించాలనే ప్రోత్సాహం పొందుతుంది. కూటాలకు సిద్ధపడి వాటిలో పాల్గొనే విషయంలో, రాజ్యమందిరాన్ని శుభ్రపర్చి దాన్ని సరైన స్థితిలో ఉంచడం వంటి ఇతర పనుల్లో కూడా సంఘపెద్దలు తోటి సహోదరులకు చక్కని మాదిరిని ఉంచవచ్చు.—ఎఫె. 5:15, 16; హెబ్రీయులు 13:7 చదవండి.
పెద్దలు క్షేత్ర పరిచర్యలో ఆదర్శప్రాయులుగా ఉంటారు (14వ పేరా చూడండి)
-