కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 3/15 పేజీలు 24-27
  • క్రైస్తవ కాపరులు మీకెలా సేవ చేస్తారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ కాపరులు మీకెలా సేవ చేస్తారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేనినుండి కాపుదల?
  • కాపరి సందర్శనం అంటే ఏమిటి?
  • ఒక కాపరి మిమ్మల్ని ఎందుకు సందర్శిస్తాడు?
  • ఆరోగ్యవంతమైన గొర్రెలకు శ్రద్ధ అవసరం
  • కాపరి సందర్శనాల కొరకు సమయాన్ని పథకం వేయడం
  • కాపరి సందర్శనాల ఆశీర్వాదాలు
  • క్రైస్తవ కాపరులారా, ‘మీ హృదయాలను విశాలపర్చుకోండి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఇష్టపూర్వకముగా దేవుని మందను కాయుడి
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • ఆశీర్వాదాన్ని తెచ్చే ఒక సందర్శనం
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 3/15 పేజీలు 24-27

క్రైస్తవ కాపరులు మీకెలా సేవ చేస్తారు

అనేక ప్రాంతాల్లో ఒక మందను కాపరులు ఎలా చూసుకుంటారో గమనించడం సాధ్యమే. వారు నడిపిస్తారు, కాపాడతారు, గొర్రెల కొరకు ఆహారం సమకూరుస్తారు. ఇది క్రైస్తవ పెద్దలకు ఆసక్తిని కలిగించే విషయం, ఎందుకంటే వారి పనిలో కాపరి కార్యాలు కూడా ఇమిడి ఉంటాయి. నిజానికి, “[దేవుని] సంఘమును కాయుట” మరియు ‘యావత్తుమందను గూర్చి జాగ్రత్తగా ఉండుట’ వారి బాధ్యత.—అపొస్తలుల కార్యములు 20:28.

మీరొకవేళ క్రైస్తవ సంఘంలో సభ్యులైతే, ఆత్మీయ కాపరులు మీకెలా సేవ చేయగలరు? మరియు మీ పక్షాన వారు చేసే ప్రయత్నాలకు మీరెలా ప్రతిస్పందించాలి? సంఘానికి వారి సహాయం ఎందుకు అవసరం?

దేనినుండి కాపుదల?

ప్రాచీన కాలాల్లో సింహాలు మరితర అడవి జంతువులు మందలను ఆపదల పాలుచేసి మరియు ఒంటరి గొర్రెలను వేటాడేవి. కాపరులు కాపుదలనివ్వవలసి ఉండేవారు. (1 సమూయేలు 17:34, 35) మరి అపవాదియగు సాతాను “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతురు 5:8) మొత్తంగా యెహోవాయొక్క భూ సంస్థకు వ్యతిరేకంగా మాత్రమే గాక వ్యక్తిగతంగా దేవుని ఒక్కొక్క సేవకునికి వ్యతిరేకంగా కూడా అతడు ఉగ్రంగా యుద్ధాన్ని ప్రకటిస్తాడు. సాతాను ధ్యేయం ఏమిటి? యెహోవా ప్రజలను నిరుత్సాహపరచాలని, చివరికి ‘దేవుని ఆజ్ఞలను గైకొనుట’నుండీ “యేసును గూర్చి సాక్ష్యమిచ్చు” పని చేయడాన్నుండి వారిని ఆపుజేయాలని అతడు కోరతాడు.—ప్రకటన 12:17.

తన గొర్రెలు “సకలమైన అడవి మృగములకు ఆహార”మైనందున, ప్రాచీన ఇశ్రాయేలులోని ప్రభుత్వ కాపరుల అశ్రద్ధనుబట్టి యెహోవా వారిపై నిందారోపణ చేశాడు. (యెహెజ్కేలు 34:8) అయితే, అశ్రద్ధమూలాన లేక సాతాను, లోకం, లేక మతభ్రష్ట “తోడేళ్ల” ప్రభావం మూలాన, సంఘంలోని ఏ ఒక్కరూ తప్పిపోకుండునట్లు వారిని కాపాడాలనే హృదయపూర్వక అభిలాషను క్రైస్తవ పెద్దలు కలిగివుంటారు. (అపొస్తలుల కార్యములు 20:29, 30) మందలోని వారందరూ తెలివితో మరియు జాగరూకతతో ఉండులాగున కాపరులు ఎలా సహాయం చేస్తారు? ఒక మార్గమేమంటే చక్కగా సిద్ధం చేసిన లేఖనాధార ప్రసంగాలను రాజ్య మందిరపు వేదికపై నుండి ఇవ్వడం. కూటాలకు ముందు ఆ తరువాత అనుకూలంగా, ప్రోత్సాహకరంగా సంభాషించడం ఇంకొక మార్గం. “గొర్రెల”ను వ్యక్తిగతంగా గృహంవద్ద దర్శించడం మరొక ప్రభావవంతమైన మార్గం. (కీర్తన 95:6 పోల్చండి.) అయితే, కాపరి సందర్శనం అంటే ఏమిటి? అటువంటి సందర్శనం ఎలా చేయాలి? మరి ఎవరిని సందర్శించాలి?

కాపరి సందర్శనం అంటే ఏమిటి?

కాపరి సందర్శనం అంటే అనావశ్యక విషయాల సంభాషణతో కూడిన కేవలం ఒక సాంఘిక సందర్శనం కాదు. ఒక పెద్ద ఇలా వ్యాఖ్యానించాడు: “చాలా మంది ప్రచారకులు ఒక లేఖనము చదవడాన్ని లేక ఒక ప్రత్యేక బైబిలు పాత్రను గూర్చి చర్చించడాన్ని చక్కగా ఆనందిస్తారు. నిజమే, పెద్ద మాత్రమే అంతా మాట్లాడడు. సందర్శించబడ్డ రాజ్య ప్రచారకుడు సాధారణంగా బైబిలుపై తన ఆలోచనలను వ్యక్తం చేయడాన్ని ఆనందిస్తాడు, అలా చేయడం ఆయన స్వంత విశ్వాసాన్ని బలపరచగలదు. పెద్ద ఒక క్షేమాభివృద్ధికరమైన శీర్షికను చర్చించడానికి తనతోపాటు ఒక కావలికోట లేక తేజరిల్లు! పత్రికను తీసుకెళ్ళవచ్చు. బహుశా ఈ ఆధ్యాత్మికమైన చర్చే సాంఘిక సందర్శనానికి ఒక కాపరి సందర్శనానికి మధ్యవున్న తేడా కావచ్చు.”

ఇంకొక అనుభవజ్ఞుడైన పెద్ద ఇలా వ్యాఖ్యానించాడు: “సందర్శనానికి పూర్వము, పెద్ద, తాను సందర్శించబోయే ప్రచారకుని గురించి ఆలోచించడంలో కొంత సమయం గడుపుతాడు. ప్రచారకునికి ఏది క్షేమాభివృద్ధిని కలుగజేయగలదు? నిజాయితీతో కూడిన ప్రశంస కాపరి సందర్శనాలలోని ఒక ప్రముఖ భాగం, ఎందుకంటె అది ఒక వ్యక్తి సహించేట్లుగా ఆయనను బలపరుస్తుంది.” అవును, ఒక కాపరి సందర్శనం సంఘంలోని మరే వ్యక్తి అయినా చేయగలిగే కేవలం స్నేహపూర్వకమైన సందర్శనం కంటె ఎంతో ఎక్కువ అయివుంది.

ఒక కాపరి మిమ్మల్ని ఎందుకు సందర్శిస్తాడు?

ఒక పెద్ద ఒక గృహాన్ని సందర్శించినప్పుడు, ఆయన సహ విశ్వాసులను ప్రోత్సహించడానికి విశ్వాసంలో దృఢంగా ఉండేందుకు సహాయం చేయడానికి సిద్ధపడివుంటాడు. (రోమీయులు 1:11) కాబట్టి ఒకరు లేక ఇద్దరు పెద్దలు మిమ్మల్ని సందర్శించాలనుకుంటే, మీరెలా ప్రతిస్పందిస్తారు? ఒక ప్రయాణ కాపరి ఇలా అన్నాడు: “ఒకవేళ కాపరి సందర్శనాలు కేవలం ఏదో పొరపాటు జరిగినప్పుడే చేయబడితే, ఉద్దేశించబడిన సందర్శనానికి మొట్టమొదటి ప్రతిక్రియ, ‘నేనేం తప్పు చేశాను?’ అనేదే అయ్యుండవచ్చు.” కీర్తనల రచయిత ఎడల శ్రద్ధవహించి, ఎల్లప్పుడూ ప్రాముఖ్యంగా దురవస్థ మరియు ప్రత్యేక అవసరత ఉన్న కాలాల్లో ‘ఆయన ప్రాణమును సేదదీర్చిన’ యెహోవాను ప్రేమగల ఆత్మీయ కాపరులు అనుకరిస్తారు.—కీర్తన 23:1-4.

కాపరి సందర్శనంయొక్క ఉద్దేశము ‘పడద్రోయుట కాక, కట్టుటయే’ అయివుండాలి. (2 కొరింథీయులు 13:10) సందర్శించబడ్డ వ్యక్తియొక్క సహనం, ఆసక్తి, మరియు నమ్మకమైన పనియెడల మెప్పుతో కూడిన మాటలు నిజానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఒక పెద్ద ఇలా వ్యాఖ్యానించాడు: “కాపరి సందర్శనంలో, సమస్యలు కనుగొని చర్చించాలన్న తలంపుతో ఆ వ్యక్తి వచ్చాడన్న అభిప్రాయం కలుగజేయడం మంచిది కాదు. నిజమే, ప్రచారకుడు తానే ఒక ప్రత్యేకమైన కష్టం గురించి మాట్లాడాలనుకోవచ్చు. మరి ఒక గొర్రె కుంటడంగానీ మిగతా మంద నుండి తనను తాను వేరు చేసుకోవడం గానీ చేస్తుంటే, సహాయం చేయడానికి పెద్దలు ఏదైనా చేయాలి.”

“తప్పిపోయిన దానిని నేను [యెహోవా] వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును,” అనే మాటల్లో వర్ణించబడిన వారిగా ఎవరైనా ఉంటే క్రైస్తవ కాపరులు నిస్సందేహంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. (యెహెజ్కేలు 34:16) అవును, గొర్రెలను వెదకడం, వెనక్కి తీసుకుని రావడం, కట్టు కట్టడం, లేక బలపరచడం వంటివి చేయడం అవసరం కావచ్చు. ఇశ్రాయేలు కాపరులు ఈ బాధ్యతలయెడల అశ్రద్ధ కనబరిచారు. అటువంటి పనులను చేయడానికి కాపరి ఒకానొక గొర్రె దగ్గరకు వచ్చి దాని అవసరతలను తీర్చవలసి ఉంటుంది. మౌలికంగా, నేడు ప్రతి కాపరి సందర్శనానికి ఇదొక విశిష్ట లక్షణమైవుండాలి.

ఆరోగ్యవంతమైన గొర్రెలకు శ్రద్ధ అవసరం

ప్రస్తుత దిన ఆత్మీయ కాపరులు ఆరోగ్యవంతమైన గొర్రెలకు ప్రత్యేక అవధానం ఇవ్వవలసిన అవసరం లేదన్న ముగింపుకు మనం రావాలా? ఒక అక్షరార్థ గొర్రె చిక్కుల్లోబడితే, కాపరియందు దానికి విశ్వాసముంటే దానికి సహాయం చేయడం చాలా సులభం. “గొర్రెలు స్వాభావికంగా మానవులనుండి దూరంగా ఉంటాయి, మరి వాటి నమ్మకాన్ని చూరగొనడం అన్ని వేళలా సులభం కాదు” అని ఒక చేతిపుస్తకం వ్యాఖ్యానిస్తుంది. అదే పుస్తకం ఇతర విషయాలతో పాటు, గొర్రెల విశ్వాసాన్ని గెలవడానికి ఈ మౌలిక మార్గదర్శక సూత్రాన్ని సూచిస్తుంది: “జంతువులతో క్రమంగా మాట్లాడండి. తమకు హామీనిచ్చే ఆ స్వరానికి అవి అలవాటు పడతాయి. పచ్చిక బయలులో తరచూ గొర్రెలను సందర్శించండి.”—ఆలెస్‌ ఫ్యూర్‌ డాస్‌ షాష్‌. హాంట్‌బుక్‌ ఫ్యూర్‌ డీ ఆర్ట్‌జరఖ్‌టె హాల్టుంగ్‌. (గొర్రెలకు కావలసిందంతా. వాటిని సరిగా ఉంచడం ఎలా అనేదాని గురించిన చేతిపుస్తకం).

అందువలన కాపరికి గొర్రెలకు మధ్య నమ్మకమైన సంబంధాలు ఉండాలంటే వ్యక్తిగత సహవాసం అవసరం. క్రైస్తవ సంఘంలో కూడా అదే వాస్తవం. ఒక పెద్ద ఇలా వ్యాఖ్యానించాడు: “గొర్రెలను క్రమంగా సందర్శించే పెద్దగా సంఘంలో గుర్తించబడడం, సమస్యలున్న వ్యక్తిని సందర్శించడాన్ని సులభతరం చేస్తుంది.” అందువల్ల, ఆత్మీయ కాపరులు గొర్రెలకు కేవలం రాజ్య మందిరంలోనే ఆహారం పెట్టడానికి వాటియెడల శ్రద్ధవహించడానికి ప్రయత్నించకూడదు. పరిస్థితులు అనుమతించినంతమట్టుకు, పెద్దలు గొర్రెల గృహాల్లో కాపరి సందర్శనాలు చేయడంద్వారా వారిని తెలుసుకోవాలి. తాను క్రొత్తగా నియమించబడిన పెద్దగా ఉన్నప్పుడు, తన కుమార్తెను ఘోరమైన రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఒక సహోదరుని సందర్శించి ఓదార్చమని సంఘాధ్యక్షుడు ఫోను చేసి తనను అడిగాడని ఒక క్రైస్తవుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఆ పెద్ద ఇలా అంగీకరిస్తున్నాడు: “నేనెంత బాధపడ్డానో, ఎందుకంటె ఆ సహోదరుని నేనెన్నడూ సందర్శించలేదు, చివరికి ఆయనెక్కడ నివసిస్తాడో కూడా తెలియదు! ఒక పరిణతి చెందిన పెద్ద నాతో వచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయడం నాకెంత ఉపశమనాన్ని కలిగించిందో.” అవును, కాపరి సందర్శనాలు చేయడంలో పెద్దలు ఒకరికొకరు సహాయపడతారు.

కొన్ని నిర్ణీత కాపరి సందర్శనాలను సిద్ధపడడంలో మరియు చేయడంలో, అధ్యక్షునియొక్క “దొడ్డపనిని” అపేక్షిస్తున్న ఒక పరిచర్య సేవకుడు పెద్దతో కలవొచ్చు. (1 తిమోతి 3:1, 13) కాపరి సందర్శనాలలో ఒక పెద్ద గొర్రెలకు ఎలా సేవ చేస్తాడో చూస్తూన్న ఒక పరిచర్య సేవకుడు ఎంతటి మెప్పుదలను కనబరుస్తాడు! పెద్దలూ పరిచర్య సేవకులు క్రైస్తవ ప్రేమ మరియు ఐక్యతల బంధాలను దృఢపరుస్తూ సంఘంలోని వారందరికి దగ్గరవుతారు.—కొలొస్సయులు 3:14.

కాపరి సందర్శనాల కొరకు సమయాన్ని పథకం వేయడం

ఒక పెద్దల సమూహం కాపరి సందర్శనాల పనిని చేయడానికి పుస్తక పఠన నిర్వాహకులు చొరవ తీసుకునేందుకు విడిచిపెట్టినప్పుడు, కొన్ని గుంపులలో ప్రచారకులందరినీ ఆరు నెలల్లో సందర్శించడం జరిగితే, కొన్ని ఇతర గంపుల్లో ఎవ్వరినీ సందర్శించడం జరగలేదు. ఇది ఒక పెద్ద ఇలా చెప్పడానికి కదిలించింది: “కొంతమంది పెద్దలు చొరవ తీసుకొని ఎంతో ఎక్కువ కాపరి పని చేస్తారన్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఇతరులు అలా చేయడానికి వారికి తమ తోటి పెద్దలనుండి ప్రోత్సాహమవసరం ఉంటుంది.” అందువలన కొన్ని పెద్దల సమూహాలు ప్రచారకులందరినీ కాపరులు ఓ నిర్దిష్ట కాలంలోగా సందర్శించేలా ఏర్పాట్లు చేస్తాయి.

నిజమే, ఒక పెద్ద లేక ఏ ఇతర ప్రచారకుడైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడేంతవరకు వేచివుండకుండా సంఘంలో ఎవరినైనా సందర్శించవచ్చు. ఒక పెద్ద కాపరి సందర్శనం చేయడానికి ముందు ఫోను చేసి, “నేను ఒక్కో నెల ఒక్కో కుటుంబాన్ని సందర్శిస్తాను. వచ్చే నెల గంట లేక గంటన్నర సేపు మిమ్మల్ని సందర్శించవచ్చా? మీకిది ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది?” అని ఆడిగాడు.

కాపరి సందర్శనాల ఆశీర్వాదాలు

ఈ దుష్ట విధానం నుండి ఒత్తిడులు ఎక్కువ అవుతుండగా, అర్థం చేసుకునే పెద్దల ప్రోత్సాహపూర్వక సందర్శనాలు ఇంకా ఎంతో ప్రయోజనకరమైనవి అవుతాయి. మందలోని వారందరికీ కాపరి సందర్శనాలద్వారా ప్రోత్సాహమూ సహాయమూ ఇవ్వబడిన తరువాత, ప్రతీ గొర్రె సురక్షితంగా మరియు భద్రంగా ఉన్నట్లు భావిస్తుంది.

రాజ్య ప్రచారకులందరూ కాపరులచే క్రమంగా సందర్శించబడిన ఒక సంఘం గురించి ఇలా నివేదించబడింది: “ప్రచారకులు కాపరి సందర్శనాలయెడల చాలా అనుకూలంగా మారారు. మునుపటి సందర్శనంలో క్షేమాభివృద్ధికరమైన చర్చను ఆనందించడం వలన ఒక ప్రచారకుడు, ఇంకొక సందర్శనం ఎప్పుడు చేస్తారని అడగడానికి పెద్దలలో ఒకరిని సమీపించడం చాలా సాధారణం. సంఘ స్ఫూర్తిని అభివృద్ధిపరచడానికి సహాయం చేయడానికి కాపరి సందర్శనాలు ఒక అంశమైయుంది.” కాపరులు ఆ విధంగా ప్రేమపూర్వకంగా పరిచర్య చేసినప్పుడు, సంఘం ప్రేమలోను ఐక్యతలోను మరియు ఆప్యాయతలోను అభివృద్ధి చెందగలదని ఇతర నివేదికలు సూచిస్తున్నాయి. ఎంతటి ఆశీర్వాదం!

క్రైస్తవ కాపరులు గొర్రెల ఆత్మీయ శ్రేయస్సును వృద్ధి చేయడానికి సందర్శిస్తారు. పెద్దలు తమ తోటి విశ్వాసులను ప్రోత్సహించి బలపరచాలని కోరుకుంటారు. ఒక సందర్శనం సమయంలో సలహా అవసరమున్న ఒక గంభీరమైన సమస్య తలెత్తినప్పుడు, ప్రాముఖ్యంగా ఒకవేళ పెద్ద వెంట ఒక పరిచర్య సేవకుడు ఉంటే మరొక సమయంలో చర్చకొరకు ఏర్పాట్లు చేయడం ఉత్తమం. ఏదేమైనా, కాపరి సందర్శనాన్ని ఒక ప్రార్థనతో ముగించడం సముచితం.

సమీప భవిష్యత్తులో ఒక ఆత్మీయ కాపరి మీ గృహాన్ని సందర్శించాలని కోరుతున్నాడా? అలాగైతే, మీకోసం వేచివున్న ప్రోత్సాహం కొరకు సంతోషంతో ఎదురుచూడండి. నిత్య జీవానికి నడిపించే మార్గంలో నిలిచి ఉండాలనే మీ తీర్మానంలో మీకు సేవ చేయడానికీ మిమ్మల్ని బలపరచడానికి ఆయన వస్తున్నాడు.—మత్తయి 7:13, 14.

[26వ పేజీలోని బాక్సు]

కాపరి సందర్శనాలకు సూచనలు

◻ ఒక ఒప్పందం చేసుకోండి: సాధారణంగా ఒక ఒప్పందం చేసుకోవడం మంచిది. ఒకవేళ పెద్ద ఒక గంభీరమైన సమస్యతో వ్యవహరించాలని అనుకుంటే, దీని గురించి ప్రచారకునికి ముందే తెలియజేయడం సముచితంగా ఉంటుంది.

◻ సిద్ధపాటు: వ్యక్తియొక్క స్వభావం మరియు పరిస్థితిని పరిగణనలోనికి తీసుకోండి. హృదయపూర్వక మెప్పును అందజేయండి. ప్రోత్సాహపూర్వకమైన, విశ్వాసాన్ని దృఢపరిచే “ఆత్మసంబంధమైన . . . కృపావరమేదైనను” ఇవ్వడాన్ని ధ్యేయంగా చేసుకోండి.—రోమీయులు 1:11, 12.

◻ ఎవరిని వెంట తీసుకెళ్లాలి: మరొక పెద్దను లేక అర్హతగల ఒక పరిచర్య సేవకుడిని.

◻ సందర్శనం సమయంలో: పెద్ద ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా, అనుకూలంగా, మరియు పరిస్థితులకు అనుకూలంగా మారేలా ఉండాలి. కుటుంబాన్ని గురించి, దాని శ్రేయస్సు వంటి విషయాలను గురించి విచారించండి. జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఒక గంభీరమైన సమస్య తలెత్తితే, ప్రత్యేక కాపరి సందర్శనాన్ని ఏర్పాటు చేయడం ఉత్తమమైయుండవచ్చు.

◻ సందర్శన నిడివి: ఒప్పుకున్న సమయాన్ని పాటించండి, మీ ఆతిథేయి ఇంకా సందర్శనాన్ని ఆనందిస్తుండగానే వెళ్లిపోండి.

◻ సందర్శన్ని ముగించడం: ఒక ప్రార్థన సముచితము మరియు నిజంగా మెచ్చుకోబడుతుంది.—ఫిలిప్పీయులు 4:6, 7.

[24వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ కాపరులు ఆత్మీయ కాపుదలను అందిస్తారు

[26వ పేజీలోని చిత్రం]

కాపరి సందర్శనాలు ఆత్మీయ ప్రోత్సాహానికి చక్కని అవకాశాలనిస్తాయి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి