కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 11/1 పేజీలు 30-31
  • పాఠకుల నుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల నుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక “దుష్టతరము” నుండి రక్షింపబడుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మెలకువగా ఉండవలసిన సమయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • క్రీస్తు ప్రత్యక్షత—మీరు దానినెలా అర్థం చేసుకుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 11/1 పేజీలు 30-31

పాఠకుల నుండి ప్రశ్నలు

1 పేతురు 2:9 కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ నందు అభిషక్త క్రైస్తవులను “ఎన్నుకోబడిన తరము” అని పేర్కొనడం జరిగింది. మరి ఇది, మత్తయి 24:34 నందు వ్రాసివున్నట్లుగా యేసు ఉపయోగించిన “తరము”ను గూర్చిన మన దృక్కోణంపై అది ప్రభావం చూపాలా?

కొన్ని అనువాదాల్లో, “తరము” ఆ రెండు వాక్యాల్లో కూడా “తరము” అనే అనువదింపబడింది. కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ ప్రకారంగా, అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము మీరు ఎన్నుకోబడిన తరము, రాజులైన యాజకసమూహము, ఓ పరిశుద్ధ జనాంగము, ప్రత్యేకమైన ప్రజలు.” మరియు యేసు ముందుగానే ఇలా చెప్పాడు: “నేను మీతో నిశ్చయంగా చెబుతున్నదేమనగా, ఇవన్నియు నెరవేరేంతవరకు ఈ తరము గతింపదు.”—1 పేతురు 2:9; మత్తయి 24:34.

మొదటి భాగంలో, అపొస్తలుడైన పేతురు గ్రీకు పదమైన జీనోస్‌ను ఉపయోగించాడు, అయితే యేసు చెప్పిన వచనంలో మాత్రం జీనియా కనిపిస్తుంది. ఈ రెండు గ్రీకు పదాలూ ఒకే విధంగా కనిపించవచ్చు మరియు అవి ఒకే మూలపదానికి ముడిపెట్టబడివున్నాయి; అయినప్పటికీ, అవి వేరువేరు పదాలే, మరి వాటికి వేరువేరు అర్థాలున్నాయి. పరిశుద్ధలేఖనాల నూతనలోక అనువాదం—రిఫరెన్సుతో కూడినది (ఆంగ్లం) 1 పేతురు 2:9 అథఃస్సూచి ఇలా అంటోంది: “‘వంశం’ గ్రీకు జీనోస్‌కు; మత్తయి 24:34 నందు ‘తరం’ అని అనువదించబడిన జీ·ని·యాʹకు తేడా ఉంది. మత్తయి 24:34కి అందుకు సంబంధిత అథఃస్సూచి ఉంది.

ఆ అథఃస్సూచికలు సూచించినట్లుగా, జీనోస్‌ అనే పదాన్ని “వంశం” అనే అర్థంతో ఈ అథఃస్సూచికలు చూపునట్లు, జీనోస్‌ “వంశము” అని అర్థమిచ్చే ఆంగ్ల పదం ద్వారా సరిగ్గా అనువదింపబడింది, ఇదే సామాన్యంగా ఆంగ్ల అనువాదాల్లో కనిపిస్తుంది. పేతురు, 1 పేతురు 2:9 నందు, యెషయా 61:6లోని ప్రవచనాన్ని పరలోక నిరీక్షణ గల అభిషక్త క్రైస్తవులకు అన్వయించాడు. వీరు అనేక జనాంగాలూ జాతులవారినుండి తీసుకొనబడ్డారు, అయితే వారు ఆత్మీయ ఇశ్రాయేలు జనాంగంలో భాగమైనప్పుడు వారి సహజ చరిత్ర ఇక మరుగౌతుంది. (రోమీయులు 10:12; గలతీయులు 3:28, 29; 6:16; ప్రకటన 5:9, 10) వారు ఆత్మీయ భావంలో విశేషమైన గుంపు అంటే, “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలుగా” అవుతారని పేతురు గుర్తించాడు.

అయితే, మత్తయి 24:34 నందు కనిపించే గ్రీకు వచనంలో గ్రీకు పదమైన జీ·ని·యాʹ కనిపిస్తుంది. యేసు ప్రజల్లోని ఏ “వంశము”ను సూచించించడంలేదు కానీ కొంత కాల నిడివిలో జీవించే ప్రజలను సూచించాడని అందరూ గ్రహించారు.

ఇంచుమించు ఓ నూరు సంవత్సరాలకు పూర్వం వాచ్‌టవర్‌ సొసైటీ మొదటి అధ్యక్షుడైన చార్ల్స్‌ టి. రస్సల్‌ వ్రాస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు: “‘తరము’ మరియు ‘వంశం’ అనే పదాలు ఒక్క పదం నుండి లేక ప్రారంభ పదంనుండి వచ్చాయని చెప్పబడిననూ అవి ఒకటి కాదు; మరియు లేఖనాధార వాడుకలో ఈ రెండు పదాలు విడివిడిగా ఉపయోగించబడ్డాయి. . . . ఈ ప్రవచనంలోని మూడు వేర్వేరు సువార్తల్లో, పూర్తిగా భిన్నమైన గ్రీకు పదాన్నీ (జీ·ని·యాʹ) మన ప్రభువు ఉపయోగించినట్లుగా చెప్పబడుతున్నాడు. దాని భావం వంశం కాదు, కానీ తరం అని మనం ఉపయోగించే తెలుగు పదానికున్న అదే ప్రాముఖ్యత దానికుంది. ఈ గ్రీకుపదాన్ని (జీ·ని·యాʹ) ఇతర విధాలుగా ఉపయోగించడం అది వంశం అనే భావంతో కాదని నిరూపిస్తోంది, కానీ అది సమకాలీకులైన ప్రజలను సూచిస్తోంది.”—ప్రతిదండన దినము, పేజీలు 602-3.

ఇటీవలి కాలంలో, అనువాదకుల కొరకు రూపొందించబడిన మత్తయి సువార్తను గూర్చిన ఓ చిన్న పుస్తకం (1988) ఇలా చెప్పింది: “[ది న్యూ ఇంటర్నేష్నల్‌ వర్షన్‌] ఈ జనాంగము అనే పదాన్ని అక్షరార్థంగా అనువదించినా, అయితే ‘లేక వంశము’ అనే అథఃస్సూచిని ఇచ్చింది. మరియు ‘మత్తయి ఉద్దేశం యేసు తర్వాత జీవించిన ఒక్క తరం మాత్రమే కాదుకానీ ఆయనను తృణీకరించిన యూదా విధానంలోని తరాలన్ని’ అని ఓ న్యూటెస్టమెంట్‌ విద్వాంసుని దృఢ విశ్వాసం. అయితే, ఈ రెండు నిర్ధారణలనూ నిరూపించేందుకు ఏ భాషా రుజువులూ లేవు అంతేకాకుండ గోచరమైన భావాన్ని నివారించేందుకు చేసిన ప్రయత్నాలన్ని ప్రక్కన పెట్టాలి. దాని అసలు సన్నివేశంలో మాత్రం అది యేసు సమాకాలీకులను మాత్రమే సూచించింది.”

10-15 పేజీల్లో చర్చించినట్లుగా, తన కాలంలోని యూదులను తరాన్ని అంటే తనను తృణీకరించిన సమకాలీకులను యేసు ఖండించాడు. (లూకా 9:41; 11:32; 17:25) ఆయన తరచూ, ‘వ్యభిచారులైన చెడ్డవారైన,’ “విశ్వాసములేని మూర్ఖ” మరియు “వ్యభిచారమును పాపమును” గల వారని, ఆ తరాన్ని వర్ణించేటప్పుడు విశేషణాలను తరచూ ఉపయోగించాడు. (మత్తయి 12:39; 17:17; మార్కు 8:38) యేసు చివరిసారిగా “తరము” అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, నలుగురు అపొస్తలులతో ఆయన ఒలీవ కొండ మీద ఉన్నాడు. (మార్కు 13:3) ఆ మనుష్యులు ఆత్మతో అభిషేకించబడనివారు లేక క్రీస్తు సంఘంలో ఏ భాగమూ లేనివారు ఓ “తరము” నందుగానీ లేక ప్రజల వంశమునందుగానీ భాగస్తులుకారు. అయితే, తన సమకాలీకులను సూచిస్తూ యేసు ఉపయోగించిన “తరము” అనే పదం వారికి బాగా తెలుసు. కనుక, ఆయన చివరిసారిగా “ఈ తరము” అని ప్రస్తావించినప్పుడు ఆయన మనస్సులో ఏముందో వారు అర్థం చేసుకోవడం సహేతుకమే.a అక్కడున్న అపొస్తలుడైన పేతురు, యూదులనిలా వేడుకున్నాడు: “మీరు మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణపొందుడి.”—అపొస్తలుల కార్యములు 2:40.

ఈ ప్రసంగంలోనే యేసు ప్రవచించిన అనేక విషయాలు (యుద్ధాలు, భూకంపాలు మరియు కరువులు వంటివి), ఆయన ఈ ప్రవచనాన్ని చెప్పినప్పటి సమయానికి మరియు సా.శ. 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనానికి మధ్య కాలంలో నెరవేరినట్లు చూపే రుజువును మేము తరచూ ప్రచురించాము. అనేక విషయాలు నెరవేరాయి కానీ అన్నీ కాదు. ఉదాహరణకు రోమీయులు యెరూషలేమును (66-70 సా.శ.) ముట్టడించిన తర్వాత “భూమిమీదనున్న సకల గోత్రములవారు” రొమ్ము కొట్టుకునేట్లుగా చేస్తూ “మనుష్యకుమారుని సూచన” కనిపించిందనేందుకు ఏ రుజువూ లేదు. (మత్తయి 24:30) కాబట్టి, సా.శ. 33 మరియు సా.శ. 70 నందలి నెరవేర్పు కేవలం తొలి నెరవేర్పై ఉంటుంది, అలాగే యేసు సూచించినట్లుగా అది పూర్తి నెరవేర్పు లేక విస్తృత పరిధిలో నెరవేరినది కాదు.

జోసెఫెస్‌ వ్రాసిన ది జూయిష్‌ వార్‌ అనే పుస్తకపు అనువాదం యొక్క ఉపోద్ఘాతంలో జి. ఎ. విలియమ్‌సన్‌ ఇలా వ్రాస్తున్నాడు: “శిష్యులు [యేసును] ఒకేసారి రెండు ప్రశ్నలను అడిగారు—ఆలయ నాశనాన్ని గూర్చి మరియు ఆయన అంతిమ రాకను గూర్చి—మరి ఆయన వారికి రెండు జవాబులను చెప్పాడు, అని మత్తయి మనకు తెల్పుతున్నాడు దానిలో మొదటి భాగం, జోసెఫెస్‌ సంపూర్ణంగా వర్ణించేంతగా ఎంతో స్పష్టంగా చెప్పబడిన సంఘటనలు ఉన్నాయి.”

అవును, మొదటి నెరవేర్పులో “ఈ తరము” ఇతర కాలాల్లో ఏ భావాన్ని కల్గివుందో అలాంటి భావాన్నే కల్గివుంది—అంటే అవిశ్వాసులైన యూదుల సమాకాలీకుల తరము. ఆ “తరము,” యేసు ముందుగా చెప్పినవాటిని అనుభవించకుండ గతించిపోదు. విలియమ్‌సన్‌ వ్యాఖ్యానించినట్లుగా, ప్రత్యక్షసాక్షిగా చరిత్రకారుడైన జోసిఫస్‌ వర్ణించినట్లుగా యెరూషలేము నాశనానికి ముందున్న దశాబ్దాల్లో ఇది నిజమైంది.

కనుక సహేతుకంగా, రెండవ లేక విస్తృతమైన నెరవేర్పులో “ఈ తరము” సమకాలీకులైన ప్రజలుగా ఉంటారు. 16వ పేజీలో ప్రారంభమైన శీర్షిక రుజువుచేస్తున్నట్లు, ఆ ‘తరముగా’ తయారుకాగల సంవత్సరాల సంఖ్యను యేసు సూచిస్తున్నాడని మనం తేల్చి చెప్పలేము.

దానికి విరుద్ధంగా, “తరము” అని భావమిచ్చే ఏ కాలాన్ని గూర్చి అయినా రెండు కీలకమైన విషయాలను చెప్పవచ్చు: (1) (దశాబ్దము లేక శతాబ్దము) వంటి పదాలకు కొన్ని నిర్దిష్ట భావమున్నట్లుగా ఓ తరం ప్రజలు అంటే నిర్దిష్ట సంవత్సరాలుగల కాలంలోని ప్రజలుగా దృష్టించకూడదు. (2) ఒక తరంలోని ప్రజలు సాపేక్షంగా కొంత కాలం వరకు మాత్రం జీవిస్తారు, ఎక్కువ కాలం జీవించరు.

కాబట్టి, “ఈ తరము” అన్న దాన్ని యేసు సూచించినప్పుడు ఆయన అపొస్తలులు ఏమి భావించి ఉండవచ్చు? అయితే మనం, పశ్చిమ జ్ఞానంవల్ల, ‘మహా శ్రమలలో’ యెరూషలేము నాశనం 37 సంవత్సరాల తర్వాత వచ్చిందని మనం తెలుసుకోగలిగాము, కానీ యేసు చెప్పేది వినే అపొస్తలులు దాన్ని తెలుసుకోలేకపోయారు. బదులుగా, ఆయన “తరము” అని ప్రస్తావించడం ఎంతో సుదీర్ఘమైన కాలమన్న ఆలోచనను కాదుగానీ, సాపేక్షంగా ఒక పరిమిత కాలనిడివిలో జీవించిన ప్రజలను సూచించింది. మన విషయంలో కూడా అది సత్యం. తర్వాత యేసు చెప్పిన మాటలు ఎంత సరిగ్గా ఉన్నాయి: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రిమాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. . . . . మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.”—మత్తయి 24:36-44.

[అధస్సూచీలు]

a “ఈ తరము” అనే మాటలోని హౌటోస్‌ అనే నిర్దేశక సర్వనామము “ఈ” అన్న తెలుగు పదానికి సరిగ్గా సరిపోతుంది. అది మాట్లాడే వ్యక్తి ఎదుట కానీ లేక ముందుకానీ ఉన్న దాన్ని సూచిస్తుంది. కానీ దాని ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. ఎక్స్‌జెటికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ది న్యూ టెస్టమెంట్‌ (1991) ఇలా వ్రాస్తోంది: “[హౌటోస్‌] అనే పదం అసలు వాస్తవాన్ని సూచిస్తుంది. ఆ విధంగా [ఎయినోస్‌ హౌటోస్‌] అంటే ‘ప్రస్తుతమున్న లోకం’ . . . మరియు [జీ·ని·యాʹ హౌటోస్‌] ‘ఇప్పుడు జీవిస్తున్న తరము’ అనే వాటిని సూచిస్తాయి. (ఉదా. మత్త. 12:41 అథఃస్సూచి, 45; 24:34) . . .” డాక్టర్‌ జార్జి బి. విన్నర్‌ ఇలా వ్రాస్తున్నాడు: “[హౌటోస్‌] సర్వ నామము కొన్నిసార్లు సమీప స్థానంలో ఉన్న నామవాచకాన్ని సూచించదు కానీ దూరంగా ఉన్న వాటిని సూచిస్తుంది. అంటే ముఖ్య విషయం రచయితకు మానసికంగా అతి సమీపంలో ఉంటుంది.”—ఏ గ్రామర్‌ ఆఫ్‌ ది ఇడియమ్‌ అఫ్‌ ది న్యూ టెస్టమెంట్‌, 7వ సంపుటి 1897.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి