అలయ వద్దు
1 1991 వార్షిక పుస్తకము భూవ్యాప్తముగా జరుగుతున్న పులకరింపజేయు విస్తరణనుగూర్చి చెప్పుచున్నది. దేశము వెంబడి మరొక దేశములో ప్రచారకుల సంఖ్యయందు క్రొత్త శిఖరములు కలవు.
2 అయితే మీ ప్రాంతములో అది ఎట్లున్నది? మీరు విభిన్నతను ఎదుర్కొనుచున్నారా? రాజ్యవర్తమానము యెడల ప్రజలు ఉదాసీనతతో యున్నారా? కొద్దిమంది ప్రజలే ఇండ్లయొద్ద ఉంటున్నారా? కొద్దిమంది మాత్రమే అనుకూలముగా జవాబిచ్చుచున్నారా? అట్లయిన గలతీయులకు 6:9లోని పౌలు ఉపదేశమును బట్టి మీరు ప్రోత్సహించబడవచ్చును: “మనము మేలు చేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంటకోతుము.” మేలుచేయుట యందు నిశ్చయముగా ఇంటింటికి రాజ్యసువార్తను ప్రకటించుట ఇమిడియున్నది. ఆ పని ముగించబడినదని యెహోవా చెప్పువరకు అత్యవసరతతో ప్రకటించుటయందు మనము కొనసాగవలెను. (యెష. 6:8) కష్టతరమైన ప్రాంతములందును గొర్రెలాంటివారు ఇప్పటికిని కనుగొనబడుచున్నారు.
3 పరిచర్యలో అలసిపోకుండునట్లు మనమేమి చేయవచ్చును? సమీపించు పద్ధతిని, లేక ఉపోద్ఘాతములను మార్చుచుండుట సహాయపడగలదు. రీజనింగ్ పుస్తకములో బహు శ్రేష్టమైన సూచనలను కనుగొనగలము. మీరు వాటిని ప్రయత్నించి చూశారా? చాలా క్లుప్తంగా అదే సమయంలో సూటిగా సమీపించుట అనేకమంది గృహస్థుల అవధానమును ఆకట్టుకొనగలదు. వారియందు వారి క్షేమమందు వ్యక్తిగతముగా శ్రద్ధ కలిగియున్నందున నీవు అచ్చట యున్నావని ప్రజలను తెలుసుకొననిమ్ము.
పాత పుస్తకములను అందించుము
4 ఫిబ్రవరి మరియు మార్చి నెలలలో 192 పేజీల పాత పుస్తకములను అందించుట ద్వారా మనము ఇతరుల యెడల శ్రద్ధ చూపవచ్చును. సువార్తను ప్రకటించుట ద్వారా మనము వ్యక్తిగతముగా దేవుని రాజ్యమును సిఫారసుచేసి, దానిని బలపరచుదుము. అనేకులు ప్రార్థిస్తు దానిని గూర్చి బహు కొంచెమే తెలిసికొనియున్న రాజ్యమునుగూర్చి ఎక్కువగా నేర్చుకొనుటకు జీవితము పుస్తకము బహు శ్రేష్టమైన సాధనము.
5 ఈ పుస్తకపు ప్రతి అధ్యాయము మాట్లాడదగు శ్రేష్టమైన అంశములను కలిగియున్నది. ఎన్నుకున్న ఒకదాని నుండి తగిన అంశమును ఉపయోగిస్తూ 15, 16, 17 లేక 18 అధ్యాయముల పేర్లవైపు అవధానమును మళ్లించుటకు మీరు ప్రయత్నించవచ్చును. 217వ పేజిలోని “ప్రయోజనకరమగు ఒక నిజమైన మార్గము” అను ఉపశీర్షిక క్రింద మన ప్రస్తుత సంభాషణ అంశముతో ముడిపెట్టగల బహు శ్రేష్టమైన అంశములు ఉన్నవి.
6 వారవారము రాజ్యప్రకటన పనిలో భాగము వహించుట ద్వారా నిశ్చయముగా మనము వ్యక్తిగతముగా ప్రోత్సహించబడి, బలపరచబడగలము. దానికితోడు దేవునివాక్యమును స్థిరముగా పఠించుచు, క్రమముగా సంఘకూటములలో పాల్గొనుట ద్వారా మన ఆత్మీయత ఉన్నతముగా ఉంచబడగలదు.—హెబ్రీ. 10:23-25.
బలముగా ఉండుటకు ఇతరులను ప్రోత్సహించుము
7 ప్రాంతీయ పరిచర్యలో ఇతరులతో పనిచేయుటద్వారా నీకై నీవు సహాయము చేసికొనుచు, ఇతరులను ప్రోత్సహించగలవు. (గలతీ. 6:10) నీవు వారితో పనిచేయ గలిగిన, పయినీర్లను మరియు పెద్దలను ఎందుకు అడగకూడదు? అంతేకాకుండ, క్రమముగాలేనివారు, బహుశ చురుకుగా పనిచేయనివారు వారి ఆత్మీయ క్షేమమందు మీరు కలిగియున్న శ్రద్ధను బట్టి ప్రోత్సహించబడవచ్చును.
8 కష్టతరమైన ఈ అంత్య దినములలో యెహోవా సేవలో మనమందరము అలయక సహించవలసియున్నాము. అట్టి సహనము కష్టములోను, లేక ఇతరుల ఉదాసీనతయందును మన క్రైస్తవ ఆసక్తిని కాపాడుకొనుటకు సహాయపడును. (హెబ్రీ. 10:36-39) బలముకొరకై యెహోవాను ప్రార్థించుము. (యెష. 40:29-31) సహించుతూ, అనుకూలమైన దృక్పథమును కాపాడుకొనుటకు సహాయము చేయుమని ఆయనను అడుగుము. మనము దేవుని పనిని చేయుచున్నామని గుర్తించుకొనుము. తన సేవలో మనము చేయు దానిని ఆయన చూచును. ఆయన మరువడు. (హెబ్రీ. 6:10) కావున అలయక ఉందము! తన మంచి పని నిమిత్తమై మనలను బలపరచుటకు యెహోవాపై ఆధారపడుచు “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని పనిని కలిగియుందము.”—1 కొరిం. 15:28, NW; గల. 6:9.