గృహస్థులు వినునట్లుచేయుట కొరకైన ఉపోద్ఘాతములు
1 మీ ఇంటింటి అందింపులో అత్యంత ప్రాముఖ్యమైన భాగమేమి? అది ఉపోద్ఘాతము అనుటలో మనలో అధికులు అంగీకరింతురు. దరిదాపు మొదటి 30 సెకండ్లలలో గృహస్థునికి ఆసక్తి రేపుటలో నీవు సఫలము కానట్లయిన, బహుశ అతడు సంభాషణను ఆపివేయును.
2 ప్రభావశీలమైన ఉపోద్ఘాతమును తయారుచేయుటలో ఏ వాస్తవములను నీవు ఆలోచించవలెను? నీవు కలిసికొనబోవు ప్రజల ఆచారములను, అవసరతలను విపులముగా పరీక్షించుము. మొదట ఉల్లాసకరమైన మాటలు చెప్పుకొనుట, లేక నీవు వెంటనే అసలు విషయానికి రావలెనని కోరుట వాడుకగా ఉన్నదా? మీ ప్రాంతములో ఎక్కువగా యౌవన దంపతులున్నారా? వారి శ్రద్ధలేమై యున్నవి? మీ పొరుగు ప్రాంతమందలి ప్రజలు మానవజాతి ఎదుర్కొను సమస్యలను ఎరిగియున్నారా?
ఈ విధమైన దానిని చెప్పుటద్వారా మీరు వారు వినునట్లు చేయవచ్చును:
◼ “నమస్కారమండీ, నా పేరు_________. ప్రజలు ఆకలితో అలమటించుట, యుద్ధాలలో చంపబడుటను గూర్చి నేను చదివినప్పుడు నేను చాలా బాధపడతాను. మీరు కూడానా?” సంభాషణను ఆరంభించుటకు సహాయపడగల ఇతర ప్రశ్నలేవనగా: “లోక సమస్యలకు పరిష్కారమేమిటి?” “భూమినుండి ఈనాటి సమస్యలను ఎవరైనా తొలగించగలరని మీరనుకుంటున్నారా?” “ఒకవేళ ఇక్కడ యెషయా 9:6, 7 నందు చెప్పబడిన అర్హతలున్న పరిపాలకుడున్నట్లయితే? [చదివి లేఖనముపై వ్యాఖ్యానించుము.]”
3 కొన్ని ప్రాంతాలలో, ప్రపంచ శాంతి వంటి భౌగోళిక విషయములకు బదులు ప్రజలు గృహము, కుటుంబము విషయమై గొప్ప శ్రద్ధను కనబర్చవచ్చును.
ఇలా అడుగుటద్వారా మీరు శ్రద్ధను రేకెత్తించవచ్చును:
◼ “రాగల పదిసంవత్సరాలలో మీకొరకు మీ కుటుంబము కొరకు ఎలాంటి జీవితమును ఎదురు చూచెదరు? భవిష్యత్తును గూర్చిన బైబిలు దృష్టి బహు ప్రోత్సాహకరముగా ఉన్నది. ఎందుకంటే పరిపూర్ణ కట్టడలద్వారా పాలించగల పరిపాలకుడు వచ్చునని అది ప్రవచించుచున్నది. ఆయనను గూర్చి యెషయా 9:6, 7 ఏమి చెప్పుచున్నదో గమనించండి.”
4 నేరము భద్రత అనుదిన ముఖ్యాంశముగా ఉన్న ప్రాంతములో మీరు జీవించుచున్నారా? మీరు రీజనింగ్ పుస్తకము, పేజి 10లో “క్రైమ్/సేఫ్టి” క్రిందనున్న మొదటి ఉపోద్ఘాతమును ఉపయోగించినట్లయిన వినుటకు కొందరు మొగ్గుచూపవచ్చును.
మీరిట్లు చెప్పవచ్చును:
◼ “హల్లో. వ్యక్తిగత భద్రత అను విషయమును గూర్చి మేము ప్రజలతో మాట్లాడుచున్నాము. మనచుట్టూ ఎంతో నేరమున్నది, మన జీవితములు దాని ప్రభావమునకు లోనగుచున్నవి.” ఆ పిమ్మట, “పరిష్కారమేమి?” లేక “భూమినుండి ఎవరైనా ఈ సమస్యలను తొలగించగలరని మీరనుకుంటారా?” లేక “పరిపాలకుడొకరు ఒకవేళ ఇటువంటి అర్హతలు కలిగియున్నట్లయిన?” వంటి ప్రశ్నలు సంభాషణను ప్రారంభించుటకు సహాయ పడవచ్చును. ఆ తర్వాత మీరు యెషయా 9:6, 7 చదువవచ్చును.
5 పాఠశాల వయస్సుగల యౌవనులతోసహా, మనమందరము సరళమైన ఈ ఒక్క లేఖన అందింపులను ఉపయోగించగలము. నిజానికి, పత్రికలు అందించునప్పుడు ఒకదానిని ప్రయోగించుటకు మీరు ఇష్టపడవచ్చును. గుర్తుంచుకొనండి, సాహిత్యములను అందించుటకు ముందు గృహస్థుని ఆసక్తిని రేకెత్తించుటే మన ధ్యేయము. నిజమైన శ్రద్ధతో మనలను వినువారి ఆసక్తిని పురికొల్పుటకు అటువంటి లేఖన అందింపు శ్రేష్ఠమైన మార్గమని మీరు అంగీకరించరా? పత్రికలు మరియు నెలకొరకైన క్రమ అందింపును అందించునప్పుడు, ఫిబ్రవరి, మార్చి నెలలలో ఈ ప్రసంగ విధానములందు అనేకులు సంతోషింతురని మేము నమ్ముచున్నాము.
6 మీ సందర్శనములోని మొదటి 30 సెకండ్లను ప్రభావశీలముగా మీరు ఉపయోగించినట్లయిన, మీ వ్యవహారం, మీ ఉపోద్ఘాతముల ద్వారా గృహస్థుడు వినునట్లుచేయు ప్రాముఖ్యమైన లక్ష్యమును మీరు దాదాపు సాధించగలరు.