ప్రారంభపు మాటలు భేదాన్ని చూపగలవు
1 రీజనింగ్ పుస్తకంలోగాని, లేక ఇటీవలి మన రాజ్యపరిచర్య సంచికలలోగాని సూచించబడిన ఉపోద్ఘాతములలో కొన్నింటిని మీరు ఉపయోగిస్తున్నారా? ఈ ప్రారంభపు పలుకులను ముద్రించబడినట్టే ప్రతి-పదాన్ని తప్పిపోకుండా ఉపయోగించుటద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తున్నట్లు అనేకమంది ప్రచారకులు రిపోర్టుచేస్తున్నారు. ప్రాంతీయ పరిచర్యకు సిద్ధపడుటకు, ఇతరులు కొంచెం ఎక్కువ సమయం తీసికొనుటద్వారా, ముద్రించబడిన సూచనలలోని పదాలనే ఆధారంగా తీసుకొని, తమ స్వంత మాటలలో ప్రారంభపు మాటలను ఏర్పరచుకోగలిగారు.
2 ఒక విషయం మాత్రం ఖచ్చితం. ఏమనగా రాజ్యవర్తమానముతో ఒకరిని కలుసుకొనబోయేముందు ప్రారంభపు మాటలను నీ మనస్సులో బాగా కలిగివుంటే, ఎంతో తేలికగా, ఎంతో దృఢనమ్మకముతో ఉన్నట్లు నీవు భావిస్తావు. నీ పలుకులు సువార్తను పంచుకొనుటకు నీలోగల నిష్కపటమైన శ్రద్ధను ప్రతిబింబిస్తాయి. మీరు బాగా సిద్ధపడివుంటే, మీపరిచర్యను అది ఎంతో ఆనందవంతంగా చేస్తుంది, ఎందుకంటే మీరు మంచి ఫలితాలను పొందుతారు. మనం చేయగలిగిన సేవలో అతి శ్రేష్టమైన దానిని అర్పించుటయే అన్నిటిలో కెల్లా అతి ప్రాముఖ్యమైనది.—హెబ్రీ. 13:15; 1 పేతు. 2:5.
3 కాబట్టి సిద్ధపడుటకు సమయాన్ని తీసికొనండి. బహుశా మీ స్థానిక ప్రాంతంలో మీరు ఎటువంటి తరహా ప్రజలను కలుసుకొనగలరో తలంచండి. వారి చింతలు, వారి శ్రద్ధలు ఏమిటి? ప్రస్తుత సంఘటనలలో వారి జీవితాలపై ఏవి ప్రభావాన్ని కలిగివున్నవి? ఈ ప్రశ్నలకు సమాధానాలను తలంచిన తరువాత, రీజనింగ్ పుస్తకములో 9-15 పేజీలలో సూచించబడిన ప్రారంభపు మాటలను చూడండి లేక మన రాజ్యపరిచర్య నుండి ఒకటి లేక ఎక్కువ ప్రారంభపు మాటలను ఎన్నుకొనండి. మీరు సులభంగా చెప్పగలుగునట్లు ఖచ్చితమైన ఆ పదాలను మీరు స్వేచ్ఛగా మలుచుకోవచ్చు, లేక దిద్దుకోవచ్చు. తరువాత ఇతర ప్రచారకులు మీ ప్రారంభపు మాటలను పరిశీలించునట్లు వారితో కూడ అభ్యాస కార్యక్రమమును నిర్వహించుకొనవచ్చును. బహుశా ఇది, వారు కూడా తమ ప్రారంభపు మాటలను వృద్ధిచేసికొనుటకు సహాయముచేస్తుంది. ఎలాగైనను, మీరు నిశ్చయంగా ఒకరినొకరు ప్రోత్సహించుకొంటూ, సత్క్రియలందు ఎదుగువారగుదురు.
4 మీ ప్రాంతీయ అందింపు ప్రసంగములను సిద్ధపడుటలో మీరు గడుపు సమయము, మీ కృషి, ప్రతిఫలము పొందుతుంది. ప్రస్తుతము సాగిపోతున్న ఆసక్తికరమగు సమకూర్పు పనిలో మరెక్కువ ఫలవంతమైన వంతును కలిగివుండునట్లు మీరు దీవించబడవచ్చును.