ప్రతి సందర్భంలోను చందాలను ప్రతిపాదన చేయండి
1 కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను మెచ్చుకోవడానికి మనకు మంచి కారణం ఉంది. మరే పత్రికలకు అంతటి అంతర్జాతీయ ఆకర్షణ ఉంది? మన ప్రకటనపనిలో ఈ నెల ఈ పత్రికలకు చందాలను సేకరించడం విశేషాంశంగా ఉంటుంది, అక్టోబరు సంచికల్లో ఎంతో శక్తివంతమైన సమాచారం ఉంది! సాధారణంగా మనం ఇంటింటి సేవలోనే మన పత్రికల్ని, చందాలను ఎక్కువగా అందజేస్తాము; అయితే, సముచితమైన ఇతర సందర్భాలన్నిటిలో వాటిని ప్రతిపాదించడానికి మనం సిద్ధంగా ఉండాలనుకుంటాము.
2 మీరు అక్టోబరు 1 “కావలికోట” అందజేసేటప్పుడు ఇలా చెబుతూ “యుద్ధం లేని లోకం—ఎప్పుడు?” అనే శీర్షికలో ఆసక్తి కలిగించవచ్చు:
◼ “మనుష్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, శాంతియుతమైన లోకం ఎందుకు పొందలేనిదిగా ఉందని అనేకమంది ప్రజలు ఆలోచిస్తారు. అక్టోబరు 1 కావలికోట నందలి 4వ పేజీలో గల ఈ వ్యాఖ్యానాల గురించి మీరేమనుకుంటున్నారు? [ఆ పేజీ క్రింది భాగంలోవున్న బాక్సులోని కొన్ని వ్యాఖ్యానాలను చదవండి, ఆ తర్వాత జవాబు చెప్పనివ్వండి.] అంటే దీని భావం శాంతి ఎన్నడూ రాదని కాదనుకోండి. యెషయా 9:6, 7 నందున్న దేవుని వాగ్దానాన్ని గమనించండి.” మీరు ఈ లేఖనాన్ని మీ బైబిలులో నుండిగాని లేదా కావలికోట నందలి 7వ పేజీలోని రెండవ కాలమ్లో పైభాగాన ఎత్తివ్రాయబడిన దానినిగాని చదవవచ్చు. శాంతియుత లోకానికి యెహోవా రాజ్యమే ఏకైక నిరీక్షణయని కావలికోట సమర్థిస్తుందని క్లుప్తంగా వివరించి, ఆ శీర్షిక చదవమని ఆ వ్యక్తిని ప్రోత్సహించండి.
3 బైబిలు అంశంలో అంతగా ఆసక్తిలేని వారితో మాట్లాడేటప్పుడు మీరు నవంబరు 8 “తేజరిల్లు!” అందజేసి, ఇలా చెప్పవచ్చు:
◼ “ఈ పత్రిక ముఖపత్రంపై ఉన్న ఈ ప్రశ్న గురించి మీరేమనుకుంటున్నారు: ‘జీవితం ఎందుకింత చిన్నదిగా ఉంది?’ [జవాబు చెప్పనివ్వండి.] వృద్ధాప్యం గురించి ఆధునిక శాస్త్రవేత్తలు, ఇతరులు ఏమి చెబుతున్నారనే దానివైపు ఈ శీర్షికలు అవధానాన్ని మళ్లిస్తాయి, ఆ తర్వాత, నిత్య జీవాన్ని గూర్చిన ఉత్తరాపేక్షలకు సంబంధించి మన సృష్టికర్త ఏమి వాగ్దానం చేశాడనేదానిపై అది దృష్టి నిలుపుతుంది. మీరు పోస్టు ద్వారా ఈ పత్రికను క్రమంగా పొందాలని నేనిష్టపడుతున్నాను.”
4 మతసంబంధమైన ఆసక్తిగల ప్రజలను మీరు కనుగొన్నప్పుడు, అక్టోబరు 15 “కావలికోట” నుండి ఒక శీర్షికను ఎందుకు చూపించకూడదు? ఈ అందింపు మంచి ప్రతిస్పందనను కలిగించవచ్చు:
◼ “నేను ఈ ప్రశ్నపై మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను: దేవున్ని ప్రేమిస్తూ అదే సమయంలో ఆయనకు భయపడడం సాధ్యమౌతుందా?” జవాబు చెప్పనివ్వండి, ఆ తర్వాత శీర్షిక యొక్క ఈ క్యాప్షన్ చదవండి, “సత్య దేవునికి ఇప్పుడు ఎందుకు భయపడాలి?” (ప్రసంగి 12:13) తర్కించుట పుస్తకంలోని 199 పేజీనందలి ఉపమానాలలో ఒకదాన్ని ఉపయోగించి, చందా సేకరించండి.
5 ఇంటింటి పరిచర్య చేసేటప్పుడు, చిన్న చిన్న అంగళ్లను, దుకాణాలను దాటి వెళ్లిపోకండి. క్రమంగా దుకాణాలను దర్శించేవారు ఇది ఆనందించదగినదిగా, ఫలవంతమైనదిగా ఉందని వివరిస్తున్నారు. అక్టోబరు 8 “తేజరిల్లు!” (ఆంగ్లం) అందజేసేటప్పుడు మీరు ఈ సరళమైన అందింపును ప్రయత్నించవచ్చు:
◼ “తమ ప్రాంతాన్ని ప్రభావితం చేసే తాజా విషయాలను తెలుసుకొని ఉండడాన్ని వ్యాపారస్థులు ఇష్టపడతారని మనకు తెలుసు. ఈ శీర్షికలు మీకు ఆసక్తికరంగా ఉంటాయని నాకు తెలుసు.” ఆ తర్వాత “ఒంటరి తల్లి లేక తండ్రి గల కుటుంబాలు—అవి ఎంత విజయవంతమైనవిగా ఉండగలవు?” అనే శీర్షికలోని విషయాన్ని క్లుప్తంగా తెలియజేయండి.
6 మీరు కలిసిన వ్యక్తి నిజంగా తొందరలో ఉంటే, మీరు పత్రికలను కనిపించేలా పట్టుకొని ఇలా చెప్పవచ్చు:
◼ “ఈ రోజు మిమ్మల్ని కలవడానికి ఎవరైనా వస్తారని మీరు ఎదురుచూడడం లేదని నాకు తెలుసు, కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. ఒక ప్రాముఖ్యమైనదాన్ని చదివే అవకాశం మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను.” మీరు ఎంపిక చేసుకొనిన శీర్షికను చూపించి, పత్రికలను అందజేయండి.
7 జాగ్రత్తతో కూడిన ఇంటింటి రికార్డును ఉంచుకోండి, పత్రిక అందించిన ప్రతి చోటుకి తిరిగి వెళ్లండి. చందా కట్టడానికి నిరాకరిస్తే, విడి పత్రికలను తప్పకుండా అందజేయండి. ఆ తర్వాత పునర్దర్శనం సమయంలో మళ్లీ చందా ప్రతిపాదించండి. సముచితమైన ప్రతి సందర్భంలోను చందాలను ప్రతిపాదించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా, అప్రమత్తంగా ఉందాము.