క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
“సువార్త నిమిత్తం సమస్తాన్ని చేయండి” అనేది ఇండియాలో ఈ నెలలో ఆరంభమవుతున్న క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమ అంశం. (1 కొరిం. 9:23, NW) రాజ్య సువార్తనేది నేడు వినిపిస్తున్న అతి ప్రాముఖ్యమైన వార్త. ఈ అద్భుతమైన వార్తను తీసుకువెళ్లేవారిగా మనం కల్గివున్న అసమానమైన ఆధిక్యతను గుణగ్రహించేందుకు ఈ కార్యక్రమం మనకు సహాయపడుతుంది. సువార్తను మానక ప్రకటించేందుకు అది మనల్ని ధైర్యపరుస్తుంది కూడా.—అపొస్తలుల కార్యములు 5:42.
పరిచర్యలో మనం మరింత నెరవేర్చగలిగేందుకు మనకు ఇవ్వబడిన దైవపరిపాలనా తర్ఫీదును ఎలా పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చో ఈ కార్యక్రమం మనకు చూపిస్తుంది. తమ సేవను విస్తృతపర్చుకునేందుకు అవసరమైన సర్దుబాట్లను చేసుకున్న కొంతమంది వ్యక్తులనుండీ, వారితోపాటూ సువార్త వ్యాపకం నిమిత్తం తమ యావత్తునూ ఇస్తున్న యౌవనులనుండీ, వారి అనుభవాల్ని మనం వింటాం.—పోల్చండి ఫిలిప్పీయులు 2:22.
అతిథి ప్రసంగీకుడిచ్చే కీలక ప్రసంగం, ‘సువార్త అప్పగించబడేందుకు యోగ్యంగా’ మనం ఉండాల్సిన అవసరతను నొక్కి చెబుతుంది. (1 థెస్స. 2:4) ఇతరులతో సువార్తను పంచుకునే ఆధిక్యతను మనం కాపాడుకోవాలంటే, మన ఆలోచనా విధానమూ, ప్రవర్తనా ఎల్లప్పుడూ దేవుని కట్టడలకూ, ప్రమాణాలకూ తగినట్లుగా ఉండాలని గ్రహించడానికి మనకు సహాయం చేయబడుతుంది. ఇలా చేయడం మూలంగా మనం పొందే ఆశీర్వాదాలు కూడా ఉన్నతపర్చబడతాయి.
ఈ ప్రాముఖ్యమైన కార్యక్రమానికి తప్పిపోకుండా హాజరవ్వండి. ప్రత్యేక సమావేశ దినమందు బాప్తిస్మం పొందాలనుకొనే క్రొత్తగా సమర్పించుకున్న వ్యక్తులు, సంఘ పైవిచారణకర్తకు వెంటనే తెలియజేయాలి. మీరు ఎవరెవరితో బైబిలు పఠనం చేస్తున్నారో వారందర్నీ హాజరవ్వమని ఆహ్వానించండి. సువార్త నిమిత్తం సమస్తాన్నీ చేయగలిగేలా, మరి ఆ విధంగా అర్మగిద్దోను రావడానికి ముందు ఈ మహాగొప్ప పనిని పూర్తిచేయగలిగేలా, యెహోవానుండి మనం బలాన్ని పొందుదాం రండి.