కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 9/8 పేజీలు 10-11
  • జారత్వాన్ని—క్షమించాలా వద్దా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జారత్వాన్ని—క్షమించాలా వద్దా?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు ఎల్లప్పుడూ క్షమించవలసిందేనా?
  • క్షమాపణ—పాప పర్యవసానాలను గూర్చి ఏమిటి?
  • క్షమాపణ మరియు విడాకులు
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవా క్షమిస్తున్నట్లు మీరు క్షమిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 9/8 పేజీలు 10-11

బైబిలు ఉద్దేశము

జారత్వాన్ని—క్షమించాలా వద్దా?

“మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, . . . . వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.” (మార్కు 11:25, 26) జారత్వం వల్ల వివాహజీవితంలో అశాంతి ఏర్పడిన సందర్భంలో నిర్దోషియైన క్రైస్తవురాలు తన భర్తను క్షమించి, వివాహజీవితాన్ని కొనసాగించవలసిందేనా?a విడాకులివ్వాలని ఆమె తీర్మానించుకుంటున్నట్లయితే, ఆమె దేవునితో గల తన సంబంధాన్ని అపాయంలో పడ వేసుకుంటుందా? అనే సవాలు చేసే కొన్ని ప్రశ్నలను యేసు మాటలు లేవదీశాయి. ఈ ప్రశ్నలకు జవాబులివ్వడానికి బైబిలెలా సహాయపడుతుందో చూద్దాం.

మీరు ఎల్లప్పుడూ క్షమించవలసిందేనా?

“ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల . . . క్షమించుడి” అన్న యేసు మాటలకు అన్ని పరిస్థితుల్లోను—భర్త జారత్వం చేసినప్పుడు కూడా క్రైస్తవురాలు క్షమించ బద్ధురాలైయున్నదా? క్షమించడాన్ని గూర్చి యేసు చేసిన ఇతర వ్యాఖ్యానాల వెలుగులో ఆయన మాటలను అర్థం చేసుకోవాలి.

ఉదాహరణకు, లూకా 17:3, 4నందు వ్రాయబడిన యేసు మాటల నుండి క్షమాగుణమనే ముఖ్యమైన సూత్రాన్ని మనం నేర్చుకుంటాం: ‘నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము. అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీ వైపుతిరిగి—మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెను.’ నిజంగా, గంభీరమైన తప్పిదము జరిగిన సందర్భాల్లోను తప్పిదస్థుడు నిజంగా మారుమనస్సు పొందిన ఎడల దానికి గురైనవాడు క్షమించాలని ప్రోత్సహించబడుతున్నాడు. యెహోవా కూడా విషయాలను ఈ విధంగా దృష్టిస్తున్నాడు; దైవిక క్షమాపణను పొందేందుకు మనం యథార్థంగా మారుమనస్సు పొందాలి.—లూకా 3:3; అపొస్తలుల కార్యములు 2:38; 8:22.

అయితే, జారత్వం చేసిన భర్త పశ్చాత్తాపపడకుండా తాను చేసిన పాపానికి బాధ్యత వహించడానికి నిరాకరిస్తున్నట్లయితే నిర్దోషియైన భార్య క్షమించవద్దని తీర్మానించుకోవడం సహేతుకమేనని కూడా ఇది చూపిస్తుంది.—1 యోహాను 1:8, 9 పోల్చండి.

క్షమాపణ—పాప పర్యవసానాలను గూర్చి ఏమిటి?

అయితే, జారుడు పశ్చాత్తాపపడినట్లయితే ఏమిటి? పశ్చాత్తాపమున్నప్పుడు, క్షమించేందుకు ఆధారముంది. కాని క్షమించడమంటే, తప్పిదస్థుడు తన క్రియల పర్యవసానాలన్నింటి నుండి తప్పించబడతాడని భావమా? యెహోవా క్షమాగుణాన్ని గూర్చిన కొన్ని ఉదాహరణలను గూర్చి ఆలోచించండి.

ఇశ్రాయేలీయులు పదిమంది వేగులవారు కనాను దేశాన్ని గూర్చి ఇచ్చిన చెడు వర్తమానాన్ని విని, తిరుగుబాటు చేసినప్పుడు మోషే యెహోవాను ఈ విధంగా అభ్యర్థించాడు: ‘ఈ ప్రజలదోషమును దయచేసి క్షమించుము.’ “నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను” అని యెహోవా అన్నాడు. తప్పిదస్థులు తమ క్రియల పర్యవసానాల నుండి తప్పించబడ్డారని దీని భావమా? యెహోవా ఈ విధంగా కొనసాగించాడు: “వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యముచేసినవారిలో ఎవరును దానిని చూడరు.” (సంఖ్యాకాండము 14:19-23) యెహోవా తన మాట నిజమని నిరూపించాడు; యెహోషువ, కాలేబు తప్ప ఆ పాత తరంవారెవరూ వాగ్దాన దేశాన్ని చూడలేదు.—సంఖ్యాకాండము 26:64, 65.

అదేవిధంగా, బత్షెబతో దావీదు పాపం చేసినప్పుడు, నాతాను ప్రవక్త ఆయనను గద్దించగా, పశ్చాత్తాపం చెందిన దావీదు ‘నేను [యెహోవాకు వ్యతిరేకంగా, NW] పాపం చేశాను’ అని అంగీకరించాడు. ‘నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను’ అని నాతాను దావీదుతో చెప్పాడు. (2 సమూయేలు 12:13) అయితే, యెహోవా దావీదును క్షమించినప్పటికీ, దావీదు తన శేషజీవితంలో తన పాప ఫలితాలను అనుభవించాడు.—2 సమూయేలు 12:9-14; 2 సమూయేలు 24వ అధ్యాయం కూడా చూడండి.

దైవిక క్షమాపణ యొక్క ఈ మాదిరులు మనం పాపానికి శిక్షననుభవించకుండా ఉండం అనే ఒక ముఖ్య పాఠాన్ని నొక్కిచెబుతున్నాయి. (ఆదికాండము 6:7, 8) పశ్చాత్తాపం చెందిన పాపి, తాను క్షమాపణ పొందినప్పటికీ, తాను చేసిన తప్పిదంవల్ల కలిగే పర్యవసానాలను తప్పించుకోలేడు. కనీసం విద్వేషాన్ని వదిలిపెట్టాలనే అర్థంలో నిర్దోషియైన భార్య ఆ జారుడ్ని క్షమించవచ్చని దీని భావమా—అయితే, అతనికి విడాకులు ఇవ్వాలని తీర్మానించుకోవచ్చా?

క్షమాపణ మరియు విడాకులు

యేసు తన పరిచర్య కాలంలో, మూడు సందర్భాల్లో విడాకులను గూర్చి మాట్లాడాడు. (మత్తయి 5:32; 19:3-9; లూకా 16:18) ఈ చర్చల్లో ఒక్కసారి కూడా యేసు క్షమాపణను గూర్చి మాట్లాడలేదన్నది ఆసక్తికరమైన విషయం. ఉదాహరణకు, మత్తయి 19:9లో కనుగొనబడినట్లు, “వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు జారత్వము [NW] చేయుచున్నాడని” ఆయన చెప్పాడు. “వ్యభిచారము నిమిత్తమే తప్ప” అని చెబుతూ లైంగిక అవినీతి నిర్దోషియైన జతకు విడాకులు తీసుకునే హక్కు లేదా లేఖనాల “ఆధారం” ఉందని చూపించాడు. అయితే, నిర్దోషియైన వ్యక్తి తప్పనిసరిగా విడాకులు తీసుకోవాలని యేసు చెప్పలేదు. అయినప్పటికీ, ఆమె అలా చేయవచ్చు అని ఆయన స్పష్టంగా సూచించాడు.

వివాహమనేది ఇద్దరు వ్యక్తులను కలిపే బంధము. (రోమీయులు 7:2) వారిలో ఒకరు అపనమ్మకస్థులైనప్పుడు, ఆ బంధము ఛేదించబడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆ నిర్దోషియైన జత ఎదుట రెండు తీర్మానాలు ఉన్నాయి. మొదటిది, తాను క్షమించాలా? మనం చూసినట్లు, జారుడు యథార్థంగా పశ్చాత్తాపపడ్డాడా లేదా అనేది ముఖ్యమైన కారకాంశము. పశ్చాత్తాపం ఉన్నప్పుడు, నిర్దోషియైన భార్య కాలక్రమేణా కనీసం విద్వేషాన్ని వదిలిపెట్టడం అనే భావంలో క్షమించవచ్చు.

రెండవ తీర్మానమేమిటంటే, తాను విడాకులు తీసుకోవాలా? ఆమె అతన్ని క్షమించినట్లయితే, ఈ ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది?b సరే, ముఖ్యంగా తన భర్త గతంలో దౌర్జన్యం చేసేవాడైతే, ఆమె తన క్షేమాన్ని గూర్చి మరియు పిల్లల క్షేమాన్ని గూర్చి చింతించేందుకు సరైన కారణాలున్నట్లయితే అప్పుడు ఏమిటి? లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులు వస్తాయేమోనని భయమున్నట్లయితే ఏమిటి? లేదా తన నమ్మకాన్ని వమ్ము చేసిన తరువాత, భార్యభర్తల సంబంధంలో తానిక అతనిని నమ్మలేనని అనుకుంటున్నట్లయిన అప్పటి మాటేమిటి? అలాంటి సందర్భాల్లో నిర్దోషియైన భార్య తన భర్తను (విద్వేషాన్ని కలిగి ఉండదనే భావంలో) క్షమించవచ్చు అయితే, అతనితో జీవితం కొనసాగించాలనే కోరిక ఆమెకు లేనందువల్ల విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. విద్వేషాన్ని వదిలిపెట్టడం ఆమె తన జీవితంలో ముందుకు సాగిపోవడానికి సహాయపడుతుంది. అది జారునితో భవిష్యత్తులో అవసరమైన వ్యవహారాలను మరింత మర్యాదపూర్వకంగా సాగించడానికి తోడ్పడవచ్చు.

నమ్మకస్థుడు కాని భర్తకు విడాకులు ఇవ్వాలా వద్దా అన్నది వ్యక్తిగత తీర్మానం, నిర్దోషియైన భార్య అన్ని కారకాంశాలను జాగ్రత్తగా, ప్రార్థనపూర్వకంగా తూచి చూసిన తర్వాత తీసుకోవలసిన తీర్మానమది. (కీర్తన 55:22) ఏదైనా చెప్పే ప్రయత్నం చేసేందుకు గాని లేదా ఒకటి కాకపోతే మరొకటి చేయమని బలవంతపెట్టే హక్కు గాని ఇతరులకు లేదు. (గలతీయులు 6:5 పోల్చండి.) నిర్దోషియైన వ్యక్తి ఏమి చేయాలో యేసు చెప్పలేదని గుర్తు చేసుకోండి. అలాంటప్పుడు సరైన లేఖనాధారంతో విడాకులు తీసుకోవాలని తీర్మానించుకునే వారి ఎడల యెహోవాకు అప్రీతి కలుగదన్నది స్పష్టం.

[అధస్సూచీలు]

a మేము ఇక్కడ నిర్దోషియైన జతను “ఆమె” అని సంబోధిస్తున్నప్పటికీ, నిర్దోషి క్రైస్తవ పురుషుడైనప్పుడు కూడా చర్చించబడిన సూత్రాలు సమానంగా వర్తిస్తాయి.

b మళ్ళీ లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వలన నిర్దోషియైన భార్య తప్పుచేసిన తన భర్తతో సమాధానపడుతుందని సూచిస్తుంది. ఆ విధంగా ఆమె విడాకులకు గల ఏ లేఖనాధారాన్నైనా నిరర్థకం చేస్తుంది.

[Picture Credit Line on page 10]

Life

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి