కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w09 4/1 పేజీ 5
  • దేవునికి వ్యక్తిత్వం ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునికి వ్యక్తిత్వం ఉందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడెవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • దేవుడు ప్రతీచోట ఉంటాడా? ఆయన సర్వాంతర్యామా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • యేసుక్రీస్తు ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దేవుడు ఎక్కడ నివసిస్తాడు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
w09 4/1 పేజీ 5

దేవునికి వ్యక్తిత్వం ఉందా?

చాలామంది ఏమంటారంటే . . .

▪ “ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్నింటా ఉంటాడు, ఇంకా చెప్పాలంటే ఆయన గాలిలా అంతటా వ్యాపించివున్నాడు.”

▪ “దేవుడంటే మనకు అంతుబట్టని, మన ఊహకందని ఒక మానవాతీత శక్తి.”

యేసు ఏమి చెప్పాడంటే. . .

▪ “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు.” (యోహాను 14:2) మనం ఉండే ఇల్లులాంటిది కాకపోయినా దేవునికి ఒక నివాస స్థలముందని యేసు చెప్పాడు.

▪ ‘నేను తండ్రి దగ్గరి నుండి బయలుదేరి లోకానికి వచ్చాను; మరియు లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.’ (యోహాను 16:28) దేవుడు నిజమైన వ్యక్తనీ, ఆయన అన్నిచోట్ల కాదుకానీ ప్రత్యేకంగా ఒక్క స్థలంలో ఉంటాడనీ యేసు నమ్మాడు.

దేవుడు ఏదో మానవాతీత శక్తి అని యేసు ఎప్పుడూ చెప్పలేదు. ఆయన దేవునితో మాట్లాడాడు, ఆయనకు ప్రార్థించాడు. యేసు యెహోవాను తరచూ తన పరలోక తండ్రి అని పిలిచాడు, దీన్నిబట్టి తండ్రితో ఆయనకు ఎంత దగ్గరి అనుబంధం ఉందో తెలుస్తోంది.—​మత్తయి 6:14, 26, 32.

దేవుణ్ణి నిజంగానే ‘ఎవరూ ఎప్పుడూ చూడలేదు’ ఎందుకంటే “దేవుడు ఆత్మ.” (యోహాను 1:18; 4:24) అంటే ఆయనకు ఎలాంటి శరీరంగానీ రూపంగానీ లేదని కాదు. ‘ప్రకృతిసంబంధమైన శరీరముంది కాబట్టి ఆత్మసంబంధమైన శరీరముకూడ’ ఉంది అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 15:44) మరైతే దేవునికి ఆత్మ శరీరం ఉందా?

అవును ఉంది. చనిపోయిన యేసును దేవుడు తిరిగి బ్రతికించిన తర్వాత ఆయన ‘మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకములో ప్రవేశించెను.’ (హెబ్రీయులు 9:24) ఈ లేఖనంలో మనం దేవుని గురించిన రెండు ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుంటాం. మొదటిది ఏంటంటే ఆయనకో నివాస స్థలం ఉంది. రెండవది, ఆయన అన్నిచోట్లా ఉండే శక్తి కాదని స్పష్టమవుతోంది.

మరైతే దేవుడు ఒకేచోట ఉండి విశ్వంలో జరిగే దాన్నంతటిని ఎలా చూసుకుంటున్నాడు? ఆయన తన పరిశుద్ధాత్మను, మరో మాటలో చెప్పాలంటే తన శక్తిని ఉపయోగించి విశ్వంలో ఎక్కడైనా, ఏదైనా చేయగలడు. ఆ విషయాన్ని ఒక ఉపమానం సహాయంతో అర్థంచేసుకుందాం. విద్యుత్‌ సరఫరా కేంద్రం ఒకేచోట ఉంటుంది. కానీ అక్కడినుండే ఆ చుట్టూ ఉన్న ప్రాంతంలోని ఇళ్ళన్నిటికీ కరెంటు సరఫరా అవుతుంది. అలాగే దేవుడు ఉండేది పరలోకంలోనే అయినా విశ్వంలో ఎక్కడైనా తాను అనుకున్నది చేయడానికి తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తాడు.—​కీర్తన 104:30; 139:7.

దేవునికంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఇష్టాయిష్టాలు ఉన్నాయి. అంతేకాదు ఆయనకు ప్రేమ, సంతోషం వంటి భావాలు కూడా ఉన్నాయి. ఆయన తన ప్రజలను ప్రేమిస్తాడని, తను చేసే పనిలో ఆయనకు సంతృప్తి ఉంటుందని, విగ్రహాలను పూజించడం ఆయనకు అసహ్యమని, చెడు జరిగినప్పుడు ఆయన బాధపడతాడని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 6:6; ద్వితీయోపదేశకాండము 16:22; 1 రాజులు 10:9; కీర్తన 104:31) దేవునికి భావాలున్నాయి కాబట్టే యేసు చెప్పినట్లు మనమాయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం నేర్చుకోగలం.—​మార్కు 12:30.a (w09 2/1)

[అధస్సూచి]

a ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలో మొదటి అధ్యాయాన్ని చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి