కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w09 4/1 పేజీ 8
  • దేవునికి నేనంటే పట్టింపు ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునికి నేనంటే పట్టింపు ఉందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆత్మ సామ్రాజ్యమందలి పరిపాలకులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఎందుకు ఇన్ని బాధలు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • చెడుతనం, బాధలు ఎందుకు ఉన్నాయి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
w09 4/1 పేజీ 8

దేవునికి నేనంటే పట్టింపు ఉందా?

చాలామంది ఏమంటారంటే . . .

▪ “దేవుడు చాలా గొప్పవాడు కదా, ఆయన నా సమస్యలను ఎందుకు పట్టించుకుంటాడు?”

▪ “ఆయన నా గురించి పట్టించుకుంటాడని నేను అనుకోవడంలేదు.”

యేసు ఏమి చెప్పాడంటే . . .

▪ ‘రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్ముడుపోతాయి కదా! అయినా, ఒక్క పిచ్చుకనైనా దేవుడు మరచిపోలేదు. మీ తల మీద ఎన్ని వెంట్రుకలున్నాయో కూడా దేవునికి తెలుసు. పిచ్చుకలకన్నా మీ విలువ ఎక్కువే! కనుక భయపడకండి.’ (లూకా 12:6, 7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అవును, దేవుడు మనల్ని పట్టించుకుంటాడని యేసు బోధించాడు.

▪ ‘ఏమి తింటామో ఏమి తాగుతామో ఏమి ధరించుకొంటామో అని చింతించకండి; అన్యజనులు వీటన్నిటి విషయంలో విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు.’ (మత్తయి 6:31, 32) మనలో ప్రతీఒక్కరికి ఏమి అవసరమో దేవునికి తెలుసని యేసు నమ్మకంగా చెప్పాడు.

దేవునికి మనమంటే శ్రద్ధవుందని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (కీర్తన 55:22; 1 పేతురు 5:7) దేవుడు నిజంగా మనల్ని పట్టించుకుంటే మనకీరోజు ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి? దేవునికి ప్రేమే ఉంటే, ఆయన అంత శక్తిమంతుడే అయితే, ఈ కష్టాలను చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు?

దానికొక కారణమేంటంటే, అపవాది అయిన సాతాను ఈ దుష్టలోకాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ఆ విషయం చాలామందికి తెలీదు. సాతాను యేసును తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ రాజ్యాలన్నిటిని చూపించి ఆయనతో, ‘ఈ అధికారమంతా, ఈ రాజ్యాల మహిమంతా నీకిస్తాను; అది నాకప్పగించబడింది, నేను అదెవరికి ఇవ్వాలనుకుంటానో వారికిస్తాను’ అని అన్నాడు.—​లూకా 4:5-7.

సాతానును ఈ ప్రపంచ పరిపాలకునిగా చేసిందెవరు? మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వ సాతాను మాట విని దేవుని మీద తిరుగుబాటు చేశారు, అలా వాళ్ళే సాతానును తమ పరిపాలకుడిగా చేసుకున్నారు. సాతాను పరిపాలన ఘోరంగా విఫలమైందని చూపించడానికే యెహోవా దేవుడు, అప్పటినుండి నుండి ఇప్పటివరకు ఓపికపట్టాడు. తనను ఆరాధించాలని యెహోవా దేవుడు ఎవ్వరినీ బలవంతపెట్టడు. నిజానికి, మనం మళ్ళీ ఆయనకు దగ్గరయ్యే అవకాశాన్ని కల్పించాడు.—​రోమీయులు 5:10.

మనమంటే దేవునికి పట్టింపు ఉంది కాబట్టే యేసును పంపి మనల్ని సాతాను పరిపాలన నుండి విడిపించే ఏర్పాట్లు చేశాడు. త్వరలోనే యేసు, ‘మరణముయొక్క బలముగలవానిని నశింపజేస్తాడు.’ (హెబ్రీయులు 2:14) అలా ఆయన ‘అపవాది క్రియలను లయపరుస్తాడు.’—​1 యోహాను 3:8.

ఈ భూమంతా మళ్ళీ అందమైన తోటలా మారుతుంది. అప్పుడు దేవుడు ‘[ప్రజల] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు, మరణము ఇక ఉండదు, దుఃఖము, ఏడ్పు, వేదన ఇక ఉండవు, మొదటి సంగతులు గతించిపోతాయి.’—​ప్రకటన 21:4, 5.a (w09 2/1)

[అధస్సూచి]

a దేవుడు కష్టాలను ఇప్పుడే ఎందుకు తీసివేయడంలేదో తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలో 11వ అధ్యాయాన్ని చూడండి.

[8వ పేజీలోని బ్లర్బ్‌]

భవిష్యత్తులో భూమి అందమైన తోటలా మారుతుంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి