కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 7/1 పేజీలు 14-15
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?
    దేవుడు చెప్తున్న మంచివార్త!
  • మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—1వ భాగం
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 7/1 పేజీలు 14-15

దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

ఈ ఆర్టికల్‌సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

1. కలిసి జీవించాలనుకునేవాళ్లు సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోవడం ఎందుకు అవసరం?

సంతోషంగల దేవుడైన యెహోవాయే వివాహాన్ని ఏర్పాటుచేశాడు. కలిసి జీవించాలనుకునేవాళ్లు పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే, దానివల్ల వాళ్లకు సాహచర్యం దొరకడంతోపాటు తమ పిల్లల్ని పెంచడానికి సురక్షిత వాతావరణం కూడా నెలకొంటుంది. వివాహాన్ని దేవుడు ఎలా దృష్టిస్తున్నాడు? ఒక పురుషుడు, ఒక స్త్రీ చట్టబద్ధంగా వివాహం చేసుకుని, ఎల్లకాలం కలిసి జీవించాలని ఆయన కోరుతున్నాడు. (లూకా 2:1-5) భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. (హెబ్రీయులు 13:4) భార్యాభర్తల్లో ఒకరు వ్యభిచారం చేసినప్పుడు మాత్రమే, రెండో వ్యక్తి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి యెహోవా అనుమతిస్తాడు.—మత్తయి 19:3-6, 9 చదవండి.

2. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మెలగాలి?

పురుషుడు, స్త్రీ ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండేలా యెహోవా వాళ్లను సృష్టించాడు. (ఆదికాండము 2:18) భర్త, కుటుంబానికి శిరస్సు కాబట్టి ఆయన తన కుటుంబ సభ్యులకు కావాల్సినవి సమకూర్చాలి, అంతేకాదు వాళ్లకు దేవుని విషయాలు బోధించాలి. ఆయన తన భార్యపట్ల స్వయంత్యాగపూరిత ప్రేమ చూపించాలి. అయితే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటేనే వాళ్ల కాపురం ఆనందంగా సాగుతుంది.—ఎఫెసీయులు 4:31, 32; 5:22-25, 33; 1 పేతురు 3:7 చదవండి.

3. సమస్యలు వస్తే విడిపోవడమే పరిష్కారమా?

సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ఎక్కువ ప్రేమ చూపించుకోవడానికి ప్రయత్నించాలి. (1 కొరింథీయులు 13:4, 5) దంపతుల మధ్య సమస్యలు వస్తే, విడిపోవడమే పరిష్కారమని బైబిలు చెప్పడం లేదు. అయితే కొన్ని తీవ్రమైన పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రం, విడిపోవాలా వద్దా అనేది ఒక క్రైస్తవుడు/రాలు సొంతగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.—1 కొరింథీయులు 7:10-13 చదవండి.

4. పిల్లలూ, మీరు ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నాడో తెలుసా?

మీరు సంతోషంగా ఉండాలనేదే యెహోవా కోరిక. బాల్యాన్ని సంతోషంగా గడపాలంటే మీరు ఏం చేయాలో యెహోవాకన్నా బాగా ఎవ్వరూ చెప్పలేరు. జ్ఞానం, అనుభవం ఉన్న మీ తల్లిదండ్రుల మాట విని, ప్రయోజనం పొందమని ఆయన చెబుతున్నాడు. (కొలొస్సయులు 3:20) మీరు మీ తల్లిదండ్రుల మాట విన్నప్పుడు యెహోవా సంతోషిస్తాడు.—ప్రసంగి 11:9–12:1; మత్తయి 19:13-15; 21:15, 16 చదవండి.

5. తల్లిదండ్రులారా, మీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే వాళ్లకేమి కావాలి?

మీ పిల్లలకు ఆహారం, బట్టలు, వసతి సమకూర్చడానికి మీరు కష్టపడి పనిచేయాలి. (1 తిమోతి 5:8) అయితే మీ పిల్లలు నిజంగా సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించాలని, ఆయన నుండి నేర్చుకోవాలని మీరు వాళ్లకు బోధించాలి. (ఎఫెసీయులు 6:4) దేవుని మీద ప్రేమతో మీరు చేసే పనులను మీ పిల్లలు చూస్తే అది వాళ్ల మనసుల మీద చెరగని ముద్ర వేస్తుంది. మీరు వాళ్లకు బైబిలు ప్రకారం బోధిస్తే, వాళ్లు సరైన విధంగా ఆలోచించడం నేర్చుకుంటారు.—ద్వితీయోపదేశకాండము 6:4-7; సామెతలు 22:6 చదవండి.

పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల, మెచ్చుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. అయితే వాళ్లను సరిదిద్దడం, క్రమశిక్షణలో పెట్టడం కూడా అవసరం. అలాంటి శిక్షణవల్ల పిల్లలు తమ ఆనందాన్ని పాడుచేసే ప్రవర్తనకు దూరంగా ఉంటారు. (సామెతలు 22:15) అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలను కఠినంగా, క్రూరంగా శిక్షించకూడదు.—కొలొస్సయులు 3:21 చదవండి.

తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం యెహోవాసాక్షులు బైబిలు ఆధారంగా ఎన్నో పుస్తకాలను ప్రచురించారు.—కీర్తన 19:7, 11 చదవండి. (w11-E 10/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, 14వ అధ్యాయం చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి