ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రాన్ని అందించడానికి
ఇంటివాళ్లకు బైబిలు విషయాలపట్ల నిజంగా ఆసక్తి ఉందని అనిపిస్తే, మీరిలా చెప్పవచ్చు: “నమస్తే. ఒక ముఖ్యమైన వార్షిక ఆచరణకు మీ కుటుంబాన్ని ఆహ్వానించడానికి వచ్చాను, అది ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న జరుగుతుంది. అది యేసు చనిపోయిన రోజు. ఆయన మరణం మనకెలా సహాయం చేస్తుందో వివరించే ఉచిత బైబిలు ప్రసంగం అక్కడ ఇస్తారు. ఆచరణ జరిగే స్థలం, సమయం గురించిన వివరాలు ఈ ఆహ్వానపత్రంలో ఉన్నాయి.”