యెషయా
2 ప్రతీ ఒక్కరు గాలికి చాటైన చోటులా,*
తుఫాను నుండి దాక్కునే చోటులా,*
నీళ్లులేని దేశంలో నీళ్ల కాలువలా,+
ఎండిపోయిన దేశంలో పెద్ద బండ నీడలా ఉంటారు.
3 అప్పుడు, చూసేవాళ్ల కళ్లు మూయబడవు,
వినేవాళ్ల చెవులు శ్రద్ధగా ఆలకిస్తాయి.
4 తొందరపాటు పనులు చేసేవాళ్ల హృదయం జ్ఞానయుక్తమైన విషయాల గురించి ఆలోచిస్తుంది,
నత్తివాళ్ల నాలుక తడబడకుండా స్పష్టంగా మాట్లాడుతుంది.+
5 తెలివిలేని వాణ్ణి ఇక ఎంతమాత్రం ఉదారస్వభావి అని పిలవరు,
నీతినియమాల్లేని వాణ్ణి గొప్పవాడని అనరు.
6 ఎందుకంటే తెలివిలేనివాడు అర్థంపర్థంలేని మాటలు మాట్లాడతాడు,
అతని హృదయం హానిచేయాలని కుట్ర పన్నుతుంది;+
భక్తిహీనంగా ప్రవర్తించడానికి,* యెహోవా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడానికి,
ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం దొరకకుండా చేయడానికి,
దాహంగా ఉన్నవాళ్లకు నీళ్లు దొరకకుండా చేయడానికి అతను పథకాలు వేస్తాడు.
7 నీతినియమాలు లేనివాడి విధానాలు చెడ్డవి;+
పేదవాళ్లు చెప్పేది సరిగ్గా ఉన్నాసరే,
కష్టాల్లో ఉన్నవాళ్లను అబద్ధాలతో నాశనం చేయడానికి+
అతను అవమానకరమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తాడు.
9 “చీకూచింతా లేని స్త్రీలారా, లేచి నా స్వరం వినండి!
నిశ్చింతగా ఉన్న కూతుళ్లారా,+ నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించండి!
10 నిశ్చింతగా ఉన్న మీరు ఒక్క సంవత్సరం గడవగానే వణికిపోతారు,
ఎందుకంటే, ద్రాక్ష కోత ముగిసేసరికి ఒక్క ద్రాక్షపండు కూడా సమకూర్చబడదు.+
11 చీకూచింతా లేని స్త్రీలారా, వణకండి!
నిశ్చింతగా ఉన్నవాళ్లారా, ఊగిపోండి!
12 రమ్యమైన పొలాల్ని బట్టి, బాగా పండే ద్రాక్షతీగల్ని బట్టి
దుఃఖంతో గుండెలు బాదుకోండి.
13 ఎందుకంటే నా ప్రజల నేల ముళ్లతో, ముళ్లపొదలతో కప్పబడుతుంది;
ఉల్లసించే ఇళ్లన్నిటినీ,
అవును, సంతోషంగా ఉండే నగరమంతటినీ+ అవి కప్పేస్తాయి.
ఓపెలు,+ కావలిబురుజు ఎప్పటికీ పనికిరాని స్థలంగా తయారయ్యాయి,
అవి అడవి గాడిదలు సంతోషించే స్థలంగా,
మందలు మేత మేసే స్థలంగా మారిపోయాయి.+
15 పైనుండి మన మీద పవిత్రశక్తి కుమ్మరించబడి+
ఎడారి పండ్ల తోటలా మారేవరకు,
పండ్ల తోట అడవిలా మారేవరకు+ పరిస్థితి అలాగే ఉంటుంది.
18 నా ప్రజలు ప్రశాంతమైన నివాస స్థలంలో,
సురక్షితమైన నివాసాల్లో, నెమ్మదిగల విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.+
19 అయితే వడగండ్లు అడవిని నేలమట్టం చేస్తాయి,
నగరం పూర్తిగా చదును చేయబడుతుంది.