కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

రోమీయులు విషయసూచిక

      • ఇశ్రాయేలీయులు పూర్తిగా తిరస్కరించబడలేదు (1-16)

      • ఒలీవ చెట్టు ఉదాహరణ (17-32)

      • దేవుని తెలివి ఎంతో లోతైనది (33-36)

రోమీయులు 11:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనం నుండి వచ్చినవాణ్ణి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 12:22; యిర్మీ 31:37

రోమీయులు 11:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:5; కీర్త 94:14

రోమీయులు 11:3

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 19:2, 14

రోమీయులు 11:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 19:18

రోమీయులు 11:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 9:27

రోమీయులు 11:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 1:7; 2:8
  • +గల 2:15, 16

రోమీయులు 11:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 1:11, 12
  • +2కొ 3:14, 15

రోమీయులు 11:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 29:10
  • +ద్వితీ 29:4

రోమీయులు 11:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 69:22, 23

రోమీయులు 11:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:21; రోమా 10:19

రోమీయులు 11:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “సంపదలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 9:23, 24

రోమీయులు 11:13

అధస్సూచీలు

  • *

    లేదా “ఘనపరుస్తున్నాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 9:15; గల 1:15, 16; ఎఫె 3:8
  • +అపొ 28:30, 31; కొలొ 1:23; 2తి 4:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2003, పేజీ 9

    9/15/1993, పేజీలు 5-6

రోమీయులు 11:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 21:43

రోమీయులు 11:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2011, పేజీలు 23-24

రోమీయులు 11:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    2/2019, పేజీ 6

    కావలికోట,

    5/15/2011, పేజీలు 23-24

    5/15/2000, పేజీ 28

రోమీయులు 11:18

అధస్సూచీలు

  • *

    లేదా “అసలు కొమ్మలకు వ్యతిరేకంగా గొప్పలు చెప్పుకోకండి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 10:12

రోమీయులు 11:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 15:14

రోమీయులు 11:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 21:43
  • +ఎఫె 2:8

రోమీయులు 11:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2011, పేజీలు 23-24

రోమీయులు 11:22

అధస్సూచీలు

  • *

    అంటే, విశ్వాసంలో పడిపోయిన.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:4
  • +మత్త 23:38

రోమీయులు 11:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 2:38

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2011, పేజీ 25

రోమీయులు 11:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2011, పేజీ 25

రోమీయులు 11:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 3:5, 6

రోమీయులు 11:26

అధస్సూచీలు

  • *

    లేదా “రక్షకుడు.”

  • *

    అంటే, ఇశ్రాయేలు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 2:29; 9:6; గల 3:29
  • +కీర్త 14:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2011, పేజీ 25

    6/15/2008, పేజీ 28

    యెషయా ప్రవచనం II, పేజీలు 299-300

రోమీయులు 11:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 27:9
  • +యెష 59:20, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెషయా ప్రవచనం II, పేజీలు 299-301

రోమీయులు 11:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 10:15

రోమీయులు 11:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 2:1, 2
  • +అపొ 7:51
  • +అపొ 15:7-9

రోమీయులు 11:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1తి 2:3, 4
  • +రోమా 3:9

రోమీయులు 11:33

అధస్సూచీలు

  • *

    అక్ష., “సంపదలు.”

  • *

    లేదా “గొప్పవి!”

  • *

    అక్ష., “తీర్పుల్ని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 176-177

    కావలికోట,

    11/15/2012, పేజీలు 16-17

రోమీయులు 11:34

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 40:13; దాని 4:35

రోమీయులు 11:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 41:11

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

రోమా. 11:11స 12:22; యిర్మీ 31:37
రోమా. 11:2నిర్గ 19:5; కీర్త 94:14
రోమా. 11:31రా 19:2, 14
రోమా. 11:41రా 19:18
రోమా. 11:5రోమా 9:27
రోమా. 11:6ఎఫె 1:7; 2:8
రోమా. 11:6గల 2:15, 16
రోమా. 11:7యోహా 1:11, 12
రోమా. 11:72కొ 3:14, 15
రోమా. 11:8యెష 29:10
రోమా. 11:8ద్వితీ 29:4
రోమా. 11:10కీర్త 69:22, 23
రోమా. 11:11ద్వితీ 32:21; రోమా 10:19
రోమా. 11:12రోమా 9:23, 24
రోమా. 11:13అపొ 9:15; గల 1:15, 16; ఎఫె 3:8
రోమా. 11:13అపొ 28:30, 31; కొలొ 1:23; 2తి 4:5
రోమా. 11:15మత్త 21:43
రోమా. 11:181కొ 10:12
రోమా. 11:19అపొ 15:14
రోమా. 11:20మత్త 21:43
రోమా. 11:20ఎఫె 2:8
రోమా. 11:22రోమా 2:4
రోమా. 11:22మత్త 23:38
రోమా. 11:23అపొ 2:38
రోమా. 11:25ఎఫె 3:5, 6
రోమా. 11:26రోమా 2:29; 9:6; గల 3:29
రోమా. 11:26కీర్త 14:7
రోమా. 11:27యెష 27:9
రోమా. 11:27యెష 59:20, 21
రోమా. 11:28ద్వితీ 10:15
రోమా. 11:30ఎఫె 2:1, 2
రోమా. 11:30అపొ 7:51
రోమా. 11:30అపొ 15:7-9
రోమా. 11:321తి 2:3, 4
రోమా. 11:32రోమా 3:9
రోమా. 11:34యెష 40:13; దాని 4:35
రోమా. 11:35యోబు 41:11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
రోమీయులు 11:1-36

రోమీయులు

11 కాబట్టి నేను అడిగేది ఏమిటంటే, దేవుడు తన ప్రజల్ని తిరస్కరించాడా?+ లేనేలేదు! ఎందుకంటే నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే, అబ్రాహాము సంతానంలో ఒకణ్ణి,* బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి. 2 దేవుడు మొట్టమొదట ఎంచుకున్న తన ప్రజల్ని తిరస్కరించలేదు.+ ఏలీయా ఇశ్రాయేలీయుల మీద దేవునికి ఫిర్యాదు చేసిన సందర్భం గురించి లేఖనం ఏమి చెప్తుందో మీకు తెలీదా? 3 ఏలీయా ఇలా అన్నాడు: “యెహోవా,* వాళ్లు నీ ప్రవక్తల్ని చంపేశారు, నీ బలిపీఠాల్ని ధ్వంసం చేశారు; నేను ఒక్కడినే మిగిలాను, ఇప్పుడు వాళ్లు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు.”+ 4 కానీ అప్పుడు దేవుడు అతనితో ఏమన్నాడు? “బయలుకు మోకరించని 7,000 మంది పురుషులు నాకు మిగిలివున్నారు.”+ 5 అలాగే, ఈ కాలంలో కూడా దేవుడు తన అపారదయతో ఎంచుకున్న ఇశ్రాయేలీయులు కొంతమంది మిగిలివున్నారు.+ 6 దేవుడు అపారదయతో ఎంచుకున్నాడంటే,+ పనుల్ని బట్టి ఎంచుకోలేదని దానర్థం.+ ఒకవేళ పనుల వల్ల ఎంచుకునివుంటే, ఇక అది అపారదయ అవ్వదు.

7 మరైతే ఏమనాలి? ఇశ్రాయేలీయులు దేనికోసమైతే పట్టుదలగా ప్రయత్నించారో దాన్ని వాళ్లు పొందలేదు; కానీ దేవుడు ఎంచుకున్నవాళ్లు దాన్ని పొందారు.+ మిగతావాళ్ల హృదయాలు కఠినం అయ్యాయి.+ 8 ఇది లేఖనాల్లో రాసివున్నట్టే జరిగింది: “దేవుడు వాళ్ల హృదయాలకు గాఢనిద్ర కలగజేశాడు;+ వాళ్లకు చూడలేని కళ్లను, వినలేని చెవుల్ని ఇచ్చాడు. ఈ రోజు వరకు వాళ్లు అదే స్థితిలో ఉన్నారు.”+ 9 అంతేకాదు దావీదు కూడా ఇలా అన్నాడు: “వాళ్ల భోజనం బల్ల వాళ్లకు ఉరిగా, ఉచ్చుగా, అడ్డురాయిగా మారాలి. వాళ్లు శిక్షించబడాలి. 10 వాళ్ల కళ్లకు చీకటి కమ్మాలి, వాళ్లకు ఏమీ కనబడకూడదు; వాళ్ల నడుములు వంగిపోయే ఉండాలి.”+

11 కాబట్టి నేను అడిగేది ఏమిటంటే, వాళ్లు తట్టుకొని పూర్తిగా పడిపోయారా? అలా అస్సలు జరగలేదు! కానీ వాళ్ల తప్పటడుగు వల్ల అన్యజనులకు రక్షణ కలిగింది. ఇశ్రాయేలీయులకు రోషం పుట్టించడానికే అలా జరిగింది.+ 12 వాళ్ల తప్పటడుగు వల్ల లోకానికి దీవెనలు,* వాళ్ల సంఖ్య తగ్గడం వల్ల అన్యజనులకు దీవెనలు వస్తే,+ వాళ్ల పూర్తి సంఖ్య వల్ల ఇంకెన్ని దీవెనలు వస్తాయో కదా!

13 ఇప్పుడు నేను అన్యజనులైన మీతో మాట్లాడుతున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుణ్ణి+ కాబట్టి నా పరిచర్యను మహిమపరుస్తున్నాను.*+ 14 నా సొంత ప్రజలకు ఏదోవిధంగా రోషం పుట్టించి, వాళ్లలో కొందరినైనా రక్షించాలన్నదే నా ఉద్దేశం. 15 దేవుడు వాళ్లను నిరాకరించడం వల్ల+ లోకానికి ఆయనతో శాంతియుత సంబంధం ఏర్పడితే, దేవుడు వాళ్లను అంగీకరించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్లు మృతుల్లో నుండి మళ్లీ బ్రతికినట్టు ఉంటుంది. 16 అంతేకాదు, పిండిముద్ద నుండి ప్రథమఫలాలుగా తీసుకున్న భాగం పవిత్రమైనదైతే, పిండిముద్దంతా పవిత్రమైనదే; చెట్టు వేరు పవిత్రమైనదైతే, కొమ్మలు కూడా పవిత్రమైనవే.

17 దేవుడు మంచి ఒలీవ చెట్టుకున్న కొన్ని కొమ్మలు విరిచి, అడవి ఒలీవ కొమ్మలైన మిమ్మల్ని దానికి అంటుకట్టాడు, దానివల్ల మీరు కూడా మంచి ఒలీవ చెట్టు వేరు సారం నుండి ప్రయోజనం పొందుతున్నారు. 18 కాబట్టి విరవబడిన అసలు కొమ్మల్ని చిన్నచూపు చూడకండి.*+ ఎందుకంటే చెట్టు వేరు మీకు పోషణ ఇస్తోంది కానీ మీరు దానికి పోషణ ఇవ్వట్లేదు. 19 అయితే మీరు ఇలా అంటారు: “నన్ను అంటుకట్టడం కోసం+ దేవుడు ఆ కొమ్మల్ని విరిచాడు.” 20 నిజమే! వాళ్లకు విశ్వాసం లేకపోవడం వల్ల దేవుడు వాళ్లను విరిచేశాడు;+ అయితే మీరు విశ్వాసం వల్ల స్థిరంగా ఉన్నారు.+ అలాగని గర్వించకండి, బదులుగా జాగ్రత్తగా ఉండండి. 21 ఎందుకంటే, దేవుడు సహజమైన కొమ్మల్నే విరిచేశాడంటే, మిమ్మల్ని విరిచేయకుండా ఉంటాడా? 22 కాబట్టి దేవుడు ఎలా దయ చూపించాడో,+ ఎలా విరిచేశాడో ఆలోచించండి. ఆయన పడిపోయిన* కొమ్మల్ని విరిచేశాడు,+ కానీ మీ మీద దయ చూపించాడు. అయితే మీరు ఆయన దయలో నిలిచివుండాలి, లేదంటే మిమ్మల్ని కూడా విరిచేస్తాడు. 23 వాళ్లు కూడా మళ్లీ విశ్వాసం చూపిస్తే తిరిగి అంటుకట్టబడతారు,+ ఎందుకంటే దేవుడు వాళ్లను తిరిగి అంటుకట్టగలడు. 24 దేవుడు అడవి ఒలీవ చెట్టు నుండి మిమ్మల్ని విరిచి, సహజ విరుద్ధంగా మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టాడంటే, మంచి ఒలీవ కొమ్మలైన వీళ్లను తిరిగి సొంత చెట్టుకు అంటుకట్టడం ఇంకెంత సులభం!

25 సహోదరులారా, మీ దృష్టిలో మీరు తెలివిగలవాళ్లు కాకుండా ఉండడానికి, మీరు ఈ పవిత్ర రహస్యం తెలుసుకోవాలని+ కోరుకుంటున్నాను: అన్యజనుల సంఖ్య పూర్తయ్యేవరకు కొందరు ఇశ్రాయేలీయుల హృదయాలు కఠినం అయ్యాయి. 26 ఈ విధంగా పూర్తి ఇశ్రాయేలు+ రక్షించబడుతుంది. లేఖనాల్లో ఇలా ఉంది: “సీయోను నుండి విమోచకుడు* వచ్చి,+ యాకోబు* వంశస్థులతో భక్తిహీన పనుల్ని మాన్పిస్తాడు. 27 నేను వాళ్ల పాపాల్ని తీసేసేటప్పుడు+ వాళ్లతో చేసే ఒప్పందం ఇదే.”+ 28 నిజమే, మంచివార్త విషయంలో వాళ్లు మీ కోసం శత్రువులుగా ఉన్నారు; అయితే దేవుడు ఎంచుకోవడం విషయానికొస్తే, వాళ్ల పూర్వీకుల్ని బట్టి వాళ్లు ప్రియమైనవాళ్లుగా ఉన్నారు.+ 29 వరాలిచ్చే విషయంలో, ఎంచుకునే విషయంలో దేవుడు తన మనసు మార్చుకోడు. 30 మీరు ఒకప్పుడు దేవునికి అవిధేయులుగా ఉండి,+ ఇప్పుడు వాళ్ల అవిధేయత వల్ల+ కరుణించబడినట్టే,+ 31 మీరు కరుణ పొందేలా ఇప్పుడు వాళ్లు అవిధేయులుగా ఉన్నారు. అలా వాళ్లమీద కూడా కరుణ చూపించవచ్చు. 32 వాళ్లందరి మీద కరుణ చూపించాలని+ దేవుడు వాళ్లందర్నీ అలా అవిధేయులుగా ఉండనిచ్చాడు.+

33 ఆహా! దేవుని ఔదార్యం,* తెలివి, జ్ఞానం ఎంత లోతైనవి!* ఆయన నిర్ణయాల్ని* పరిశోధించడం, ఆయన మార్గాల్ని కనుక్కోవడం అసాధ్యం! 34 ఎందుకంటే, “యెహోవా* మనసును తెలుసుకున్నది ఎవరు? ఆయనకు సలహాదారుడిగా ఉన్నది ఎవరు?”+ 35 “ఆయన తిరిగి ఇవ్వడానికి, ముందుగా ఆయనకు ఇచ్చింది ఎవరు?”+ 36 ఎందుకంటే అన్నీ ఆయన నుండే వచ్చాయి, అన్నీ ఆయన్ని బట్టి, ఆయన కోసం ఉన్నాయి. నిరంతరం ఆయనకు మహిమ కలగాలి. ఆమేన్‌.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి