-
నెహెమ్యా 10:28, 29పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
28 మిగతా ప్రజలు, అంటే యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, ఆలయ సేవకులు,* సత్యదేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి చుట్టుపక్కల దేశాల ప్రజల నుండి తమను తాము ప్రత్యేకపర్చుకున్న ప్రతీ ఒక్కరు,+ వాళ్ల భార్యలు, వాళ్ల కుమారులు, కూతుళ్లు, జ్ఞానం, అవగాహన* ఉన్న వాళ్లందరూ 29 తమ సహోదరులతో, ప్రముఖులతో కలిసి, సత్యదేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఇచ్చిన సత్యదేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటామని, మన ప్రభువైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ, ఆయన న్యాయనిర్ణయాల్ని, ఆయన విధుల్ని జాగ్రత్తగా పాటిస్తామని ప్రమాణం చేశారు. అలా చేయకపోతే తమ మీదికి శాపం రావాలని ఒట్టు పెట్టుకున్నారు.
-