7 ఎలియాజరు కుమారుడూ, యాజకుడైన అహరోను మనవడూ అయిన ఫీనెహాసు+ అది చూసినప్పుడు, వెంటనే సమాజం మధ్య నుండి లేచి తన చేతిలో ఈటె తీసుకున్నాడు. 8 తర్వాత అతను ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ డేరాలోకి వెళ్లి ఆ స్త్రీ కడుపులో గుండా వాళ్లిద్దర్నీ పొడిచాడు. దాంతో ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిన తెగులు ఆగిపోయింది.+