-
ద్వితీయోపదేశకాండం 12:31పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
31 నువ్వు నీ దేవుడైన యెహోవాను అలా ఆరాధించకూడదు. ఎందుకంటే వాళ్లు తమ దేవుళ్ల కోసం, యెహోవా ద్వేషించే ప్రతీ అసహ్యమైన పనిని చేస్తారు; ఆఖరికి తమ దేవుళ్లకు అర్పించడం కోసం తమ కుమారుల్ని, కూతుళ్లను అగ్నిలో వేసి కాల్చేస్తారు.+
-
-
2 రాజులు 16:1పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలనలోని 17వ సంవత్సరంలో, యూదా రాజైన యోతాము కుమారుడు ఆహాజు+ రాజయ్యాడు.
-
-
2 రాజులు 17:17, 18పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
17 అంతేకాదు తమ కుమారుల్ని, కూతుళ్లను అగ్నిలో వేసి కాల్చారు;*+ సోదెను అభ్యసించారు,+ శకునాలు చూశారు, యెహోవాకు కోపం వచ్చేలా ఆయన దృష్టికి చెడు చేయడంలో మునిగిపోయారు.*
18 దాంతో యెహోవాకు ఇశ్రాయేలీయుల మీద చాలా కోపం వచ్చింది, ఆయన వాళ్లను తన కళ్లముందు నుండి తీసేశాడు.+ ఒక్క యూదా గోత్రాన్ని తప్ప ఎవర్నీ మిగలనివ్వలేదు.
-
-
యిర్మీయా 7:30, 31పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
30 ‘ఎందుకంటే, యూదా ప్రజలు నా దృష్టిలో చెడ్డవైనవి చేశారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ‘నా పేరు పెట్టబడిన మందిరంలో తమ అసహ్యమైన విగ్రహాల్ని పెట్టి, దాన్ని అపవిత్రపర్చారు.+ 31 వాళ్లు బెన్‌హిన్నోము* లోయలో+ తోఫెతు దగ్గర ఉన్నత స్థలాలు నిర్మించి తమ కుమారుల్ని, కూతుళ్లను మంటల్లో కాల్చారు;+ అలా చేయమని నేను వాళ్లకు ఆజ్ఞాపించలేదు, కనీసం ఆ ఆలోచన కూడా ఎప్పుడూ నా హృదయంలో రాలేదు.’+
-