5 యెరూషలేము నుండి, యూదయ అంతటి నుండి, అలాగే యొర్దాను చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరికి వెళ్తూ ఉన్నారు.+6 వాళ్లు తమ పాపాల్ని అందరిముందు ఒప్పుకుంటూ, యొర్దాను నదిలో అతని దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు.*+
20 ఎందుకంటే యోహాను నీతిమంతుడని, పవిత్రుడని హేరోదుకు తెలుసు+ కాబట్టి హేరోదు అతనికి భయపడి, అతన్ని కాపాడుతూ వచ్చాడు. అతని మాటలు విన్నప్పుడు హేరోదుకు అతన్ని ఏమి చేయాలో అర్థమయ్యేది కాదు, అయినా అతను చెప్పేది సంతోషంగా వినేవాడు.