యెషయా
“భయపడకు, నేను నిన్ను తిరిగి కొన్నాను.+
పేరు పెట్టి నిన్ను పిలిచాను.
నువ్వు నాకు చెందినవాడివి.
2 నువ్వు జలాల గుండా వెళ్లేటప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను;+
నువ్వు నదుల గుండా వెళ్లినప్పుడు, అవి నిన్ను ముంచెత్తవు.+
అగ్ని గుండా నడిచినప్పుడు నువ్వు కాలిపోవు,
అగ్ని జ్వాల వల్ల కమిలిపోవు.
3 ఎందుకంటే నేను నీ దేవుడైన యెహోవాను,
ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి, నీ రక్షకుణ్ణి.
నిన్ను విడిపించడానికి ఐగుప్తును మూల్యంగా చెల్లించాను,
నీ కోసం ఇతియోపియాను, సెబాను చెల్లించాను.
కాబట్టి నీకు బదులుగా ప్రజల్ని,
నీ ప్రాణానికి బదులుగా దేశాల్ని ఇస్తాను.
5 భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.+
6 ఉత్తర దిక్కుతో, ‘వాళ్లను ఇచ్చేయి!’ అని చెప్తాను.+
దక్షిణ దిక్కుతో నేనిలా అంటాను: ‘వాళ్లను నీ దగ్గరే ఉంచుకోవద్దు.
దూరం నుండి నా కుమారుల్ని, భూమి కొనల నుండి నా కూతుళ్లను తీసుకురా;+
7 నా పేరుతో పిలవబడే ప్రతీ ఒక్కర్ని,+
నా మహిమ కోసం నేను సృష్టించినవాళ్లను,
నేను తయారుచేసి రూపించినవాళ్లను+ తీసుకురా.’
వాళ్లలో ఎవరు దీన్ని చెప్పగలరు?
లేదా మొదటి సంగతుల్ని* ఎవరు మాకు వినిపించగలరు?+
తాము నిర్దోషులమని రుజువు చేసుకోవడానికి వాళ్లు తమ సాక్షుల్ని ప్రవేశపెట్టాలి,
లేదా విని, ‘ఇదే సత్యం!’ అని ఒప్పుకోవాలి.”+
10 “మీరే నా సాక్షులు”+ అని యెహోవా అంటున్నాడు,
“అవును, నేను ఎంచుకున్న నా సేవకుడివి నువ్వు.+
నువ్వు తెలుసుకొని, నా మీద విశ్వాసముంచి,*
నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నానని+ అర్థం చేసుకునేలా నేను నిన్ను ఎంచుకున్నాను.
నాకన్నా ముందు ఏ దేవుడూ లేడు,
నా తర్వాత కూడా ఏ దేవుడూ లేడు.+
11 నేను నేనే యెహోవాను,+ నేను తప్ప వేరే రక్షకుడు లేడు.”+
కాబట్టి మీరే నా సాక్షులు” అని యెహోవా అంటున్నాడు, “నేనే దేవుణ్ణి.+
నేను చర్య తీసుకున్నప్పుడు ఎవరు దాన్ని అడ్డుకోగలరు?”+
14 నీ విమోచకుడూ ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ+ అయిన యెహోవా+ ఇలా అంటున్నాడు:
“మీ కోసం నేను వాళ్లను బబులోనుకు పంపించి, దాని ద్వారాల అడ్డగడియలన్నిటినీ విరగ్గొడతాను,+
తమ ఓడల్లో ఉన్న కల్దీయులు ఆర్తనాదాలు పెడతారు.+
15 నేను యెహోవాను, నీ పవిత్ర దేవుణ్ణి,+ ఇశ్రాయేలు సృష్టికర్తను,+ నీ రాజును.”+
16 సముద్రం గుండా దారిని,
అల్లకల్లోల జలాల మధ్య త్రోవను ఏర్పాటు చేసే+
యెహోవా ఇలా అంటున్నాడు;
17 అవును, యుద్ధ రథాల్ని, గుర్రాల్ని,
సైన్యాన్ని, బలమైన యోధుల్ని నడిపే దేవుడు+ ఇలా అంటున్నాడు:
“వాళ్లు పడుకొని తిరిగి లేవరు.+
వాళ్లు ఆర్పేయబడతారు, కాలుతున్న వత్తిలా ఊదేయబడతారు.”
18 “పాత సంగతుల్ని గుర్తుచేసుకోకండి,
గతం గురించి అదేపనిగా ఆలోచించకండి.
మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారా?
20 అడవి జంతువులు నన్ను ఘనపరుస్తాయి,
నక్కలు, నిప్పుకోళ్లు నన్ను గౌరవిస్తాయి;
ఎందుకంటే నేను ఎంచుకున్న నా ప్రజలు+ తాగడానికి
ఎడారిలో నీళ్లను,
ఎడారిలో నదుల్ని దయచేస్తాను.+
21 నా కీర్తిని చాటడానికి
నా కోసం నేను రూపొందించుకున్న ప్రజలు వాళ్లు.+
23 నువ్వు సంపూర్ణ దహనబలులు అర్పించడానికి నా దగ్గరికి గొర్రెల్ని తేలేదు,
నీ బలులతో నన్ను మహిమపర్చలేదు.
నాకు కానుక తెమ్మని నేను నిన్ను బలవంతం చేయలేదు,
సాంబ్రాణి తీసుకురావాల్సిందే అంటూ నిన్ను విసిగించనూ లేదు.+
బదులుగా నీ పాపాల భారాన్ని నా మీద మోపావు,
నీ దోషాలతో నన్ను విసిగించావు.+
26 నువ్వు నాకు గుర్తుచేయి; మన మధ్య ఉన్న వివాదం గురించి మాట్లాడుకుందాం;
నువ్వు నిర్దోషివని నిరూపించడానికి నీ వాదన వినిపించు.