యెషయా
30 యెహోవా ఇలా అంటున్నాడు: “లోబడని మొండి పిల్లలకు+ శ్రమ,
వాళ్లు నావి కాని ఉద్దేశాల్ని నెరవేరుస్తున్నారు,+
నా ఇష్టానికి విరుద్ధంగా దేశాలతో సంధి చేసుకుంటున్నారు,*
అలా వాళ్లు పాపం మీద పాపం మూటగట్టుకుంటున్నారు.
2 నన్ను సంప్రదించకుండా+ వాళ్లు ఐగుప్తుకు వెళ్తున్నారు,+
ఫరో సంరక్షణలో ఉండడానికి,
ఐగుప్తు నీడలో ఆశ్రయం పొందడానికి వాళ్లు వెళ్తున్నారు!
3 అయితే ఫరో సంరక్షణలో ఉండడం వల్ల మీరు సిగ్గుపడాల్సి వస్తుంది,
ఐగుప్తు నీడలో ఆశ్రయం పొందడం వల్ల మీరు అవమానాలపాలు అవుతారు.+
4 అతని అధిపతులు సోయనులో+ ఉన్నారు,
అతని ప్రతినిధులు హానేసుకు చేరుకున్నారు.
5 తమకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేని ప్రజల వల్ల,
సిగ్గు, అవమానం తీసుకురావడం తప్ప సహాయం గానీ, మేలు గానీ చేయలేని ప్రజల వల్ల
వాళ్లంతా సిగ్గుపడతారు.”+
6 దక్షిణాన ఉన్న మృగాల గురించిన సందేశం:
కష్టాలూ కన్నీళ్లతో నిండిన దేశం గుండా,
అంటే సింహం, గర్జించే సింహం నివసించే దేశం గుండా,
విషసర్పం, మంటపుట్టించే విషమున్న ఎగిరే సర్పం* నివసించే దేశం గుండా వెళ్తూ
గాడిదల మీద వాళ్లు తమ సంపదను,
ఒంటెల వీపుల మీద తమ సామాన్లను మోసుకెళ్తున్నారు.
కానీ అవి ప్రజలకు ఉపయోగపడవు.
7 ఎందుకంటే ఐగుప్తు సహాయం దేనికీ పనికిరాదు.+
అందుకే నేను దాన్ని “ఏమీ చేయకుండా కూర్చున్న రాహాబు”*+ అని పిలిచాను.
8 “ఇప్పుడు నువ్వు వెళ్లి, వాళ్ల సమక్షంలో ఈ విషయాన్ని పలక మీద చెక్కు,
పుస్తకంలో దాన్ని రాయి,+
అలా అది భవిష్యత్తులో ఏదో ఒక రోజు
శాశ్వతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది.+
10 వాళ్లు దీర్ఘదర్శులతో ‘చూడొద్దు’ అని అంటారు.
దర్శనాలు చూసేవాళ్లతో వాళ్లిలా అంటారు: ‘నిజమైన దర్శనాల గురించి మాకు చెప్పకండి.+
మాకు నచ్చేవాటినే మాకు చెప్పండి; మోసపూరితమైన మాయా దర్శనాలు చూడండి.+
11 దారిలో నుండి పక్కకు తప్పుకోండి; వేరే దారిలో వెళ్లండి.
ఇశ్రాయేలు పవిత్ర దేవుని గురించి మాతో మాట్లాడడం మానేయండి.’ ”+
12 అందుకే ఇశ్రాయేలు పవిత్ర దేవుడు ఇలా అంటున్నాడు:
“మీరు ఈ మాటను తిరస్కరించి+
వంచనను, మోసాన్ని నమ్ముకుంటున్నారు,
వాటి మీద ఆధారపడుతున్నారు;+
13 కాబట్టి ఈ తప్పు మీకు పగిలిన గోడలా,
ఉబ్బిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎత్తైన గోడలా తయారౌతుంది.
అది అకస్మాత్తుగా, ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది.
14 కుమ్మరివాడి పెద్ద కుండ పగలగొట్టబడినట్టు అది పగలగొట్టబడుతుంది,
అది ఎంతగా నలగ్గొట్టబడుతుందంటే,
పొయ్యిలో నుండి నిప్పులు లాగడానికి గానీ
గుంటలో* నుండి నీళ్లు తీసుకోవడానికి గానీ ఒక్క పెంకు కూడా మిగలదు.”
15 ఎందుకంటే సర్వోన్నత ప్రభువూ ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:
“నా దగ్గరికి తిరిగొచ్చి విశ్రాంతి తీసుకుంటే మీరు రక్షించబడతారు;
మీరు కంగారుపడకుండా, నమ్మకం చూపిస్తే అదే మీకు బలం.”+
కానీ అది మీకు నచ్చలేదు.+
16 మీరు, “అలా కాదు, మేము గుర్రాల మీద పారిపోతాం!” అన్నారు.
కాబట్టి నిజంగానే మీరు పారిపోతారు.
“వేగంగా పరుగెత్తే గుర్రాలమీద మేము వెళ్లిపోతాం!” అని మీరు అన్నారు.+
కాబట్టి తరిమేవాళ్లు మిమ్మల్ని వేగంగా తరుముతారు.+
17 ఒక్క వ్యక్తి బెదిరిస్తే మీలో వెయ్యిమంది వణికిపోతారు;+
ఐదుగురు బెదిరిస్తే మీరంతా పారిపోతారు.
మీలో మిగిలినవాళ్లు పర్వత శిఖరం మీద ఉన్న స్తంభంలా,
కొండ మీదున్న ధ్వజస్తంభంలా అయ్యేవరకు అలా జరుగుతుంది.+
18 అయితే మీ మీద అనుగ్రహం చూపించాలని యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు,*+
మీ మీద కరుణ చూపించడానికి ఆయన లేస్తాడు.+
ఎందుకంటే యెహోవా న్యాయవంతుడైన దేవుడు.+
ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నవాళ్లంతా* సంతోషంగా ఉంటారు.+
19 ప్రజలు సీయోనులో, అంటే యెరూషలేములో నివసించినప్పుడు+ నువ్వు అస్సలు ఏడ్వవు.+ సహాయం కోసం నువ్వు పెట్టే మొర వినబడగానే ఆయన తప్పకుండా నీ మీద అనుగ్రహం చూపిస్తాడు; నీ మొర విన్న వెంటనే నీకు జవాబిస్తాడు.+ 20 యెహోవా నీకు కష్టాల రూపంలో రొట్టెను, అణచివేత రూపంలో నీళ్లను ఇచ్చినా,+ నీ మహాగొప్ప ఉపదేశకుడు ఇకమీదట దాక్కోడు, నువ్వు కళ్లారా నీ మహాగొప్ప ఉపదేశకుణ్ణి చూస్తావు.+ 21 నువ్వు కుడివైపు గానీ ఎడమవైపు గానీ తిరిగితే,+ “ఇదే దారి.+ ఇందులో నడువు” అని నీ వెనక నుండి ఒక శబ్దం రావడం నీ చెవులారా వింటావు.
22 నీ చెక్కుడు విగ్రహాల మీది వెండి రేకును, నీ పోత* విగ్రహాల మీది బంగారు పూతను నువ్వు అపవిత్రపరుస్తావు.+ వాటిని మైలగుడ్డలా* పారేసి, “పొండి!” అని అంటావు.*+ 23 నువ్వు నేలలో విత్తే విత్తనాల కోసం ఆయన వర్షం కురిపిస్తాడు,+ అప్పుడు నేల నుండి శ్రేష్ఠమైన ఆహారం సమృద్ధిగా పండుతుంది.+ ఆ రోజు నీ పశువులు, మందలు విశాలమైన పచ్చిక మైదానాల్లో మేత మేస్తాయి.+ 24 నేలను దున్నే పశువులు-గాడిదలు, పారతో పంగలకర్రతో చెరిగి పుల్లటి ఆకుకూరలతో కలిపిన మేతను మేస్తాయి. 25 గొప్ప వధ జరిగే రోజున బురుజులు కూలిపోయినప్పుడు ఎత్తైన ప్రతీ పర్వతం మీద, ఎత్తుగా ఉన్న ప్రతీ కొండ మీద వాగులు, కాలువలు పారతాయి.+ 26 యెహోవా తన ప్రజల విరిగిన ఎముకలకు కట్టుకట్టి, తాను కొట్టడం వల్ల ఏర్పడిన గాయాన్ని మాన్పే+ రోజున నిండు చంద్రుడి వెలుగు సూర్యుడి వెలుగులా ఉంటుంది; సూర్యుడి వెలుగు ఏడంతలు పెరుగుతుంది,+ అది ఏడురోజుల వెలుగులా ఉంటుంది.
ఆయన పెదాలు ఉగ్రతతో నిండిపోయాయి,
ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.+
28 ఆయన శ్వాస* మెడ లోతు వరకు ప్రవహించే వాగులా ఉంది,
అది నాశనమనే జల్లెడలో* దేశాల్ని జల్లెడపడుతుంది.
జనాల్ని తప్పుదారి పట్టించే ఒక కళ్లెం వాళ్ల దవడలకు ఉంటుంది.+
29 నీ పాట, పండుగ+ కోసం సిద్ధపడుతున్నప్పుడు*
రాత్రిపూట పాడే పాటలా ఉంటుంది;
నీ హృదయం, పిల్లనగ్రోవి ఊదుతూ*
యెహోవా పర్వతానికి, అంటే ఇశ్రాయేలు ఆశ్రయదుర్గం*+ దగ్గరికి
వెళ్లే వ్యక్తి సంతోషించినట్టు సంతోషిస్తుంది.
30 యెహోవా గంభీరమైన తన స్వరాన్ని+ వినిపిస్తాడు,
దహించే అగ్ని జ్వాలతో,+
కుండపోత వర్షంతో,+ ఉరుముల తుఫానుతో, వడగండ్లతో+
కోపాగ్నితో దిగివస్తున్న తన బాహువును+ ఆయన వెల్లడిచేస్తాడు.
32 యెహోవా అష్షూరును శిక్షించడానికి
దానిమీదికి తన కర్రను ఎత్తిన ప్రతీసారి,
యుద్ధంలో ఆయన వాళ్ల మీద తన బాహువును ఆడిస్తుండగా+
ఆయన ఆ చోటును విశాలంగా, లోతుగా చేశాడు;
దానిలో మంటలు, కట్టెలు సమృద్ధిగా ఉన్నాయి.
గంధకపు వాగులా యెహోవా శ్వాస
దానికి నిప్పు అంటిస్తుంది.