కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన. కోరహు కుమారుల కీర్తన.+ అలమోతు* స్వరంలో పాడాలి.
2 అందుకే మనం భయపడం;
భూమి మార్పు చెందినా, పర్వతాలు కంపించి సముద్ర లోతుల్లోకి దిగిపోయినా,+
3 దాని జలాలు ఘోషించి నురగలు కక్కినా,+
దాని అలజడికి పర్వతాలు కంపించినా మనం భయపడం. (సెలా)
4 ఒక నది ఉంది; దాని కాలువలు దేవుని నగరానికి,+
సర్వోన్నతుని గొప్ప పవిత్ర గుడారానికి ఉల్లాసాన్ని ఇస్తున్నాయి.
5 దేవుడు ఆ నగరంలో ఉన్నాడు;+ ఎవరూ దాన్ని కదల్చలేరు.
తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తాడు.+
6 దేశాలు అల్లకల్లోలంగా ఉన్నాయి, రాజ్యాలు కూలిపోయాయి;
ఆయన తన స్వరం వినిపించినప్పుడు భూమి కరిగిపోయింది.+
8 వచ్చి, యెహోవా పనుల్ని చూడండి,
ఆయన భూమ్మీద ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేశాడో చూడండి.
9 ఆయన భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.+
విల్లును విరగ్గొడతాడు, ఈటెను ముక్కలుముక్కలు చేస్తాడు,
యుద్ధ రథాల్ని* అగ్నిలో కాల్చేస్తాడు.
10 ఆయన ఇలా అన్నాడు: “లొంగిపోండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి.