కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; “లిల్లీ పువ్వులు” అనే రాగంలో పాడాలి. దావీదు కీర్తన.
69 దేవా, నీళ్లు నన్ను ముంచెత్తుతున్నాయి, నన్ను రక్షించు.+
2 కాలు నిలపడానికి గట్టినేల లేని లోతైన ఊబిలో నేను కూరుకుపోయాను,+
నేను లోతైన నీళ్లలో మునిగిపోయాను,
వరద ప్రవాహానికి కొట్టుకుపోయాను.+
3 మొరపెట్టీ పెట్టీ నేను అలసిపోయాను;+
నా గొంతు బొంగురుపోయింది.
నా దేవుని కోసం ఎదురుచూసీ చూసీ నా కళ్లు క్షీణించాయి.+
నన్ను చంపాలని చూసే
మోసగాళ్లయిన శత్రువులు* ఎక్కువయ్యారు.
నేను దొంగిలించనిదాన్ని బలవంతంగా ఇవ్వాల్సి వచ్చింది.
5 దేవా, నా తెలివితక్కువతనం నీకు తెలుసు,
నా అపరాధం నీకు కనిపిస్తూనే ఉంది.
6 సర్వోన్నత ప్రభువా, సైన్యాలకు అధిపతివైన యెహోవా,
నీ మీద ఆశపెట్టుకునేవాళ్లు నా కారణంగా సిగ్గుపడే పరిస్థితి రాకూడదు.
ఇశ్రాయేలు దేవా,
నిన్ను వెదికేవాళ్లు నా కారణంగా అవమానాలపాలు కాకూడదు.
8 నేను నా సహోదరులకు పరాయివాణ్ణి అయ్యాను,
నా తోడబుట్టిన వాళ్లకు పరదేశిని అయ్యాను.+
9 నీ మందిరం* విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంది,+
నిన్ను నిందించేవాళ్ల నిందలు నా మీద పడ్డాయి.+
10 ఉపవాసం ఉండి నన్ను నేను తగ్గించుకున్నప్పుడు,*
దాని గురించి నన్ను నిందించారు.
11 నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు,
వాళ్లు నన్ను ఈసడించుకున్నారు.*
12 నగర ద్వారం దగ్గర కూర్చున్నవాళ్లు నా గురించి మాట్లాడుకుంటున్నారు,
తాగుబోతులు నా మీద పాటలు పాడుతున్నారు.
13 అయితే యెహోవా,
అనుకూలమైన సమయంలో నా ప్రార్థన నీ దగ్గరికి చేరాలి.+
దేవా, నీ అపారమైన విశ్వసనీయ ప్రేమను బట్టి నాకు జవాబిచ్చి,
నువ్వే నిజమైన రక్షకుడివని చూపించు.+
14 ఊబిలో నుండి నన్ను రక్షించు;
నన్ను లోపలికి కూరుకుపోనివ్వకు.
నన్ను ద్వేషించేవాళ్ల నుండి,
లోతైన నీళ్ల నుండి నన్ను కాపాడు.+
15 నన్ను వరద ప్రవాహానికి కొట్టుకుపోనివ్వకు,+
లోతైన నీళ్లు నన్ను మింగేయనివ్వకు,
16 యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ మంచిది, నాకు జవాబివ్వు.+
నేను కష్టాల్లో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వు.+
18 నా దగ్గరికి వచ్చి, నన్ను రక్షించు;
నా శత్రువుల నుండి నన్ను విడిపించు.
19 నాకు కలిగిన నింద, సిగ్గు, అవమానం నీకు తెలుసు.+
నా శత్రువులందర్నీ నువ్వు చూస్తున్నావు.
20 నిందలవల్ల నా గుండె బద్దలైంది, నా గాయం నయంకానిది.
ఎవరైనా సానుభూతి చూపిస్తారని ఎదురుచూశాను, కానీ ఎవ్వరూ చూపించలేదు,+
ఓదార్చేవాళ్ల కోసం చూశాను, కానీ ఒక్కరూ కనిపించలేదు.+
22 వాళ్ల భోజనం బల్ల వాళ్లకు ఉచ్చుగా తయారవ్వాలి,
వాళ్ల సమృద్ధి వాళ్లకు ఉరిగా మారాలి.+
26 ఎందుకంటే, నువ్వు కొట్టినవాణ్ణి వాళ్లు తరుముతున్నారు,
నువ్వు గాయపర్చినవాళ్ల బాధల గురించి మాట్లాడుకుంటున్నారు.
27 వాళ్ల అపరాధానికి వాళ్లకు పూర్తి శిక్ష పడాలి,
వాళ్లు నీ దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడకూడదు.
29 నేను కష్టాల్లో ఉన్నాను, బాధపడుతున్నాను.+
దేవా, నీ రక్షణ శక్తితో నన్ను కాపాడు.
30 నేను దేవుని పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను,
కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన్ని ఘనపరుస్తాను.
32 సాత్వికులు దాన్ని చూసి సంతోషిస్తారు.
దేవుణ్ణి సేవించే ప్రజలారా, మీ హృదయాలు తెప్పరిల్లాలి.
34 భూమ్యాకాశాలు ఆయన్ని స్తుతించాలి,+
సముద్రాలు, వాటిలో కదిలేవన్నీ ఆయన్ని స్తుతించాలి.