కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం.
2 యెహోవా అతన్ని సంరక్షించి సజీవంగా ఉంచుతాడు.
అతను భూమ్మీద సంతోషంగల వ్యక్తిగా ఎంచబడతాడు;+
3 అతను అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు యెహోవా అతన్ని ఆదుకుంటాడు;+
అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు అతని పడకను పూర్తిగా మార్చేస్తావు.
4 “యెహోవా, నా మీద అనుగ్రహం చూపించు.+
నన్ను బాగుచేయి,+ నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను”+ అని నేను అన్నాను.
5 కానీ నా శత్రువులు, “అతను ఎప్పుడు చస్తాడో,
అతని పేరు ఎప్పుడు తుడిచిపెట్టుకుపోతుందో” అంటూ నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు.
6 వాళ్లలో ఎవరైనా నన్ను చూడడానికి వస్తే, అతను* కపటంగా మాట్లాడతాడు.
నా గురించి చెడుగా మాట్లాడడానికి అతను సమాచారం సేకరిస్తాడు;
తర్వాత బయటికి వెళ్లి, దాని గురించి అంతటా చెప్తాడు.
7 నన్ను ద్వేషించేవాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారు;
నాకు కీడు చేయాలని కుట్ర పన్నుతున్నారు:
10 కానీ యెహోవా, నేను వాళ్లకు ప్రతీకారం చేసేలా
నా మీద అనుగ్రహం చూపించి, నన్ను పైకి లేపు.
11 నా శత్రువులు నా మీద గెలవలేకపోయినప్పుడు,
నువ్వు నన్ను చూసి సంతోషిస్తున్నావని నాకు తెలుస్తుంది.+
ఆమేన్. ఆమేన్.