5 “నువ్వు వెనక్కి వెళ్లి, నా ప్రజల నాయకుడైన హిజ్కియాతో ఇలా చెప్పు, ‘నీ పూర్వీకుడైన దావీదు దేవుడు యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నీ ప్రార్థన విన్నాను. నీ కన్నీళ్లు చూశాను.+ ఇదిగో నేను నిన్ను బాగుచేస్తున్నాను.+ మూడో రోజున నువ్వు యెహోవా మందిరానికి వెళ్తావు.+