కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. గీతం.
2 ప్రార్థనలు వినే దేవా, అన్నిరకాల ప్రజలు నీ దగ్గరికి వస్తారు.+
5 మా రక్షకుడివైన దేవా,
సంభ్రమాశ్చర్యాలు పుట్టించే నీతికార్యాలతో+ నువ్వు మాకు జవాబిస్తావు;
భూమి నలుమూలల్లో, సముద్రం అవతల సుదూరంలో
ఉన్న ప్రజల నమ్మకానివి నువ్వే.+
8 సంభ్రమాశ్చర్యాలు పుట్టించే నీ కార్యాల్ని చూసి మారుమూల ప్రాంతాల ప్రజలు భయపడతారు;+
సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు ఉన్న ప్రజల్ని నువ్వు సంతోషంతో కేకలు వేసేలా చేస్తావు.
9 నువ్వు భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ,
అది విస్తారంగా పండేలా* చేస్తూ దాన్ని సుసంపన్నం చేస్తున్నావు.+
దేవుని నుండి ప్రవహించే వాగు నీళ్లతో నిండివుంది,
నువ్వు ప్రజలకు ధాన్యాన్ని ఇస్తావు,+
నువ్వు భూమిని ఈ విధంగా సిద్ధం చేశావు.
10 నువ్వు దాని చాళ్లను తడిపి, దున్నిన నేలను చదును చేస్తావు;
వర్షం చినుకులతో దాన్ని మెత్తపరుస్తావు; దాని మొలకల్ని దీవిస్తావు.+
11 నీ మంచితనంతో సంవత్సరాన్ని అలంకరిస్తావు;
నీ దారులు సమృద్ధితో పొంగిపొర్లుతున్నాయి.+
13 పచ్చికబయళ్లలో ఎక్కడ చూసినా మందలే ఉన్నాయి,
లోయల్లో పంట చేలు తివాచీలా పరుచుకున్నాయి.+
అవి సంతోషంతో కేకలు వేస్తున్నాయి, అవును పాటలు పాడుతున్నాయి.+