యెషయా
31 సహాయం కోసం ఐగుప్తుకు వెళ్లేవాళ్లకు+ శ్రమ!
వాళ్లు గుర్రాల మీద ఆధారపడుతున్నారు,+
చాలా ఉన్నాయని యుద్ధ రథాల్ని,
బలంగా ఉన్నాయని యుద్ధ అశ్వాల్ని* నమ్ముకుంటున్నారు.
కానీ వాళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుని వైపు చూడట్లేదు,
యెహోవా కోసం వెదకట్లేదు.
2 అయితే, ఆయన కూడా తెలివిగలవాడే,
ఆయన తప్పకుండా విపత్తు తీసుకొస్తాడు, తన మాటల్ని వెనక్కి తీసుకోడు.
దుష్టుల ఇంటి మీదికి,
తప్పుచేసేవాళ్లకు సహకరించే వాళ్ల మీదికి ఆయన లేస్తాడు.+
3 అయినా ఐగుప్తీయులు మామూలు మనుషులే, వాళ్లు దేవుడు కాదు;
వాళ్ల గుర్రాలు మామూలు జంతువులే, అవి అదృశ్య శక్తులు కావు.+
యెహోవా తన చెయ్యి చాపినప్పుడు,
సహాయం చేసే వ్యక్తి తడబడతాడు,
సహాయం పొందిన వ్యక్తి పడిపోతాడు;
వాళ్లంతా ఒకేసారి నాశనమౌతారు.
4 ఎందుకంటే యెహోవా నాతో ఇలా చెప్పాడు:
“జంతువు తనకు చిక్కినప్పుడు సింహం గర్జించినట్టు, బలమైన కొదమ సింహం గుర్రుమన్నట్టు,
దాన్ని వెళ్లగొట్టడానికి కాపరులందర్నీ పిలిచినప్పుడు
వాళ్ల శబ్దానికి భయపడకుండా,
ఆ కోలాహలానికి బెదిరిపోకుండా అది గుర్రుమన్నట్టు
సైన్యాలకు అధిపతైన యెహోవా యుద్ధం చేయడానికి
సీయోను పర్వతం మీదికి, దాని కొండ మీదికి దిగివస్తాడు.
5 అకస్మాత్తుగా దూసుకొచ్చే పక్షిలా సైన్యాలకు అధిపతైన యెహోవా వేగంగా వచ్చి యెరూషలేమును కాపాడతాడు.+
ఆయన దాన్ని కాపాడతాడు, రక్షిస్తాడు.
దాన్ని దాటివెళ్తూ దాన్ని తప్పిస్తాడు.”
6 “ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎవరిమీదైతే ఘోరంగా తిరుగుబాటు చేశారో ఆయన దగ్గరికి తిరిగిరండి.+ 7 ఆ రోజు ప్రతీ వ్యక్తి వెండితో చేయబడిన తన వ్యర్థమైన దేవుళ్లను, బంగారంతో చేయబడిన తన విలువలేని దేవుళ్లను తిరస్కరిస్తాడు; ఆ దేవుళ్లను మీరే స్వయంగా మీ చేతులతో చేసుకొని పాపం మూటగట్టుకున్నారు.
8 అష్షూరీయులు ఖడ్గంతో చంపబడతారు, కానీ అది మనిషి ఖడ్గం కాదు;
మనుషులది కాని ఖడ్గం వాళ్లను మింగేస్తుంది.+
ఖడ్గాన్ని చూసి వాళ్లు పారిపోతారు,
వాళ్ల యువకులు బానిసలౌతారు.